ALO REMBAAVAI-04


 నాల్గవ పాశురము


*************

ఆళిమళై కణ్ణా! ఒన్రు నీ కై  కరవేల్

ఆళియుల్ పుక్కు ముగందు కొడార్ త్తేరి

ఊళి ముదల్వన్ ఉరువం పోల్ మెయికరుత్తు

పాళియన్ తోళుడై ప్పర్బనాబన్ కైయిల్

ఆళిపోల్ మిన్ని వలంబురి పోల్  నిన్రదిందు



తాళాదే శార్ఙ్ ముదైత్త శరమళై పోల్

వాళ ఉలగనిల్ పెయిదిడాయ్ నాంగళుం

మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంబావై.


 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః
*****************************




   కణ్ణా! - ఓ శ్రీకృష్ణా!
   నాం-గలం-మా అందరికి-గోపికా సమూహమునకు,
  
   మళిందు-మహోత్సాహముతో,

   మార్గళి నీరాడ-భగవత్గుణ వైభవమను యమునలో స్నానము చేయుటకు

     (దయతో)

  పెయిదిడాయ్-వర్షములను కురిపించుము.

   అవి తడి-పొడి చినుకులు-అర-కొర వానలు,నీ ఔదార్యమునకు భంగమును కలిగించేవి కాకూడదు.

  కనుక నీవు త్రేతాయుగములో శ్రీరాముడు ఏ విధముగా, తన,

  శార్ఞ్గం -విల్లును ఎక్కుపెట్టి (శత్రువులపై)
  ఉదైత్త-గురిచూసి కురిపించిన,

  శరైమళై-బాణ వర్షము వంటి,

  కుండపోత వర్షములను కురిపించుము.

     మేము,
 నీ-నిన్ను
 ఒన్రు-మరేది
 కైకరవేల్-అనుగ్రహింపమని కోరము.

   ( ఐహికములను అడగము.)


శ్లో. తిరువనంత పురే భుజగేశయో రుచిరమత్స్య సరోవర సుందరే|
   శశి విభూషణ వజ్రధరేక్షిత శ్శఠరిపూత్తమ సూరి పరిష్కృత:||
   అనంత పద్మనాభ శ్శ్రీహరి:లక్ష్మీ సమన్విత:|
   ద్వారత్రయేణ సంసేవ్య: హేమ కూట విమానగ:||
నమ్మాళ్వార్లు తమ తిరువాయిమొళి ప్రబంధములో (10-2)"అరవిల్ పళ్లి పైన్ఱవన్ పాతజ్గాణ నడుమినో సమర్‌ కళుళ్లీర్" భాగవతులారా! అనంతునిపై పవళించియున్న పద్మనాభ స్వామి శ్రీపాదములను సేవింప బయలుదేరుడు" అని యుపదేశించియున్నారు.
సంసారబధ్ధులమై శరణాగతినివేడుచున్న మమ్ములను అనుగ్రహించి,











 పర్పనాపన్- ఓ పద్మనాభస్వామి, నీవు

 పాళియన్ తోళ్-విశాల భుజపరాక్రమమును కలవాడవు.
  కనుక మాపై దయతో,

  ఆళియళ్ పుక్కు- సముద్రములోనికి పుక్కు-ప్రవేశింపుము.

  ముగందుకొద్-జలమును  సంపూర్ణముగా నిశ్శేషముగా/         స్వీకరింపుము.

  కడుపు నిండిన తరువాత, నీవు లేచి నిలబడినప్పుడు, త్రేంచునపుడు,

ఉన్-నీ యొక్క,
కైయ్యల్-దివ్య హస్తముల,ఒకటి

 ఆళిపోల్ మిన్ని-సుదర్శన చక్ర కాంతి వంటి మెరుపులతో, 
ఇంకొకటి,

  వలంపురి పోల్-పాంచజన్యము వంటి శంఖనాదమును చేయు ఉరుములతో,  

 అంతెందుకు
 
 ఉళి-ముదల్వాన్- ఓ జగదాద్యా,

 ఉన్ మెయి- నీ దివ్య శరీరము,
 కరుత్తుపి-నల్లని మేఘము కాంతితో" త్వమేవాహం" నీవే మేము-మేమే నీవు అని అంటున్నది.


 అట్టి స్వామిని సేవించు స్నానవ్రతమునకు రమ్మని గోదమ్మ గోపికలను పిలుచుచున్నది

ఇక్కడ నల్లని మేఘములు మెరుపులు -ఉరుములు స్వామి ధరించిన ఆయుధములతో.స్వామి మేనిఛాయతో పోల్చబడి ధన్యతనొందినవి.
.

  ఇది సామాన్యార్థము.


   ఇందులో విశేషముగా ఆచార్యులు,మరింత విశేషముగా రామానుజాచార్యులు ప్రస్తుతింపబడినారని స్పురిస్తున్నట్లుగా పెద్దల అభిప్రాయము...,

  వారు మన జ్ఞాన దాహమును తీర్చుటకు వేద-ఉపనిషద్సాగరములో మునిగి,వాటి సారమును పూర్తిగా గ్రహించి,   జ్ఞాన తేజోవంతులై/ఉన్నతులై,     శిష్యులకు అనుగ్రహించుటకు పూర్తిగాజలముతో నిండిన మేఘముల వలె నున్నారని అన్యాపదేశముగా ఆచార్య ప్రాశస్త్యమును గోదమ్మ ప్రస్తావించుచున్నది.

  అనుగ్రహమూర్తి అమ్మ చేతిని పట్టుకుని మన అడుగులను కదుపుదాము.

 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.




Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)