doota

నః ప్రయచ్చంతి సౌఖ్యం-18 ************************* భగవంతుడు భగవతికి మరియు భక్తునకు దూత. " నమో దూతాయచ-ప్రహితాయచ." శత్రువుల విషయములను తెలిసికొని తన యజమానికి నివేదించగల నేర్పరి దూత.హితమును ఒకచోటు నుండి మరొక చోటునకు తీసుకొని వెళ్ళగల సమర్థుడు దూత. దూతను రాయబారి-వార్తాహరుడు-పురోసూచకుడు అనికూడా పిలుస్తారు.ఇతను చక్కని సమయస్పూర్తి-సంభాషణాచతురతను కలిగినవాదై యుండవలెను.జరుగబోవు పరిణామములను తెలియచేయగల సామర్థ్యమును కలిగియుండవలెను.మహా భారతములో శ్రీకృష్ణుడు,రామాయణములో హనుమంతుడు సమర్థవంతమైన దౌత్యమును చేసియున్నారు.సంధికి అంగీకరించని ఎడల కలుగు పరిణామములను తమను పంపినవారి శౌర్య పరాక్రమములను వివరించి పురోసూచకులుగా కూడ ప్రసిధ్ధిపొందారు. " సృష్టి స్థితి లయాయస్య లీలా ఇవ మహేశితుః తం వందే సచ్చిదానందం సర్వాశుభ నివృత్తయే" సకల అశుభములను నివృత్తిచేయు సర్వమంగళాకార సదాశివ నమస్సులు. " నమ అమీవత్కేభ్యః" అంతతను విజృభించువారును,అందరిని హింసించువారిని చేరినాడు నలదమయంతులకు హం...