Monday, July 3, 2017

NAMOSTUTAE SARASVATI



సరస్వతీ నమోస్తుతే
*******************
జగమున శారద నమోస్తుతే _ గగనపు శారద నమోస్తుతే
సుత నారద నమోస్తుతే -సిత నీరద నమోస్తుతే
ఇందిర సఖి నమోస్తుతే -ఇందు ముఖి నమోస్తుతే
వేదసారమా నమోస్తుతే - ఘనసారమా నమోస్తుతే
పటిమ అనుపమ నమోస్తుతే - పటీర ఉపమ నమోస్తుతే
మాఘ శుక్ల పంచమి నమోస్తుతే - మరాళ వాహన నమోస్తుతే
తల్లి ఆకార నమోస్తుతే -మల్లికాహార నమోస్తుతే
నిషాద ఏలిక నమోస్తుతే - తుషార పోలిక నమోస్తుతే
చేత కచ్చపి నమోస్తుతే - ఫేన స్వచ్చత నమోస్తుతే
అజుని నాయికా నమోస్తుతే - రజతాచలమా నమోస్తుతే
కాంతి సంకాశ నమోస్తుతే -కాస ప్రకాశ నమోస్తుతే
పుష్ప కేశిని నమోస్తుతే- పూజ్య ఫణీశ నమోస్తుతే
భక్త మందార నమోస్తుతే - కుంద మందార నమోస్తుతే
వసుధ నాదనిధి నమోస్తుతే - సుధా పయోధి నమోస్తుతే
ఆశ్రిత పోషిత నమోస్తుతే _ సిత తామరస నమోస్తుతే
ఆగమ విహారి నమోస్తుతే -అమర వాహిని నమోస్తుతే
ఓంకార రూప నమోస్తుతే - శుభాకార రూప నమోస్తుతే
పోతన శుభస్తుత నమోస్తుతే - శ్వేత వస్త్రధర నమోస్తుతే
సకల బుద్ధివి నమోస్తుతే - సకల సిద్ధివి నమోస్తుతే
సర్వశుక్ల రూపమా నమోస్తుతే -సరస్వతీ నామమా నమోస్తుతే
మనసా-వచసా- శిరసా సతతం స్మరామి.
పురుషార్థ ప్రదాయినీ పున: పున: నమామి.
భావము
శరదృతువులో పిండారబోసినట్లుండే వెన్నెల- శారద
నీటిని తనలో దాచుకుని తెల్లగా ప్రకాశించే మేఘము- నీరదము
మరల మరల అభివృద్ధిని పొందువాడు చంద్రుడు- ఇందు
ఆత్మార్పణములో అవశేషమే లేనిది కర్పూరము- ఘనసారము
పరిమళము-ప్రశాంతత కలది- మంచి గంధము-- -పటీరము
పాలు-నీరు వేరుచేయ గలిగినది హంస- మరాళము
శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాదులు కలిగినది-మల్లెపువ్వు--మల్లిక హార
అర్ద్రతయే స్వభావముగా గలది-మంచు--తుషార
పరుగుల ఒరవడి-నడవడి గలది నురుగు-ఫేనము
చల్లదనము-తెల్లదనము కల కొండ- వెండి కొండ--రజతాచలము
పరమాత్మ సూక్ష్మ రూపములో వసించు గడ్డి(పువ్వు)--రెల్లుపువ్వు--కాశ
అగ్నిని-జలమును సమతౌల్యము చేయగలది-ఆదిశేషుడు-- ఫణీశ
స్వయం ప్రకాశ -సత్వగుణ ప్రతీక-దేవతా పుష్పము--కుంద
కోరిన కోరికలు తీర్చు కల్పవృక్షము---మందార
అవధులులేని అమృతగుణము- పాల సముద్రము-- సుధా పయోధి
సకల జ్ఞాన స్థానమే తెల్ల పద్మము ---సిత తామరస
పైనుండి క్రిందికి దిగివచ్చినది-ఆకాశ గంగ-- అమర వాహినీ
ఓంకార స్వరూపమైన సంపూర్ణత్వము శుభాకారత
ప్రకాశించుట యందు ఆసక్తిగలది భారతి.(జ్ఞాన స్వరూపము)

పోతనగారి సహజకవిత్వపు లోతులగురించి తెలిసికొనుటకు భక్తి-భావన అను రెండు దివ్య నేత్రముల సహకారము ఎంతో అవసరము.వారు ఈ పద్యములో ఎన్నో తాత్త్విక విషయములను పొందుపరచిరి అనిపిస్తోంది.ఇవి అలంకారిక శాస్త్ర ప్రకారము తీసుకున్న ఉపమానములు మాత్రమే కావేమో.కొంచం పరిశీలిద్దాము.
1 స్థూల సూక్ష్మ విషయ విచారణ చేశారనుటకు వారు ప్రయోగించిన
మేఘము-వెన్నెల, మంచు బిందువు-మంచు కొండ,నురుగు-సముద్రము, రెల్లు-కల్పవృక్షము,పద్మము-జ్ఞానము రెండు అమ్మయే అయితే అమ్మ అంటే ఎవరు. ఇంకొంచము దర్శించగలిగితే
పంచభౌతికతత్త్వము ఈ జ్ఞాన ప్రకాశము అనిపిస్తుంది.ఉదాహరణకు,
1.ఆకాశ తత్త్వము- మేఘము-వెన్నెల-చందమామ
2.జల తత్త్వము-మంచు బిందువు,నురుగు,ఆకాశ గంగ,సముద్రము.
3.అగ్ని తత్త్వము- ఆదిశేషుడు {విషము-అగ్నికీలలు)
4.భూతత్త్వము-రెల్లు,కల్ప వృక్షము
5.వాయు తత్త్వము-పువ్వులు చందనము కర్పూరము (సువాసనను వ్యాపింపచేయును)
పంచేంద్రియ సంకేతములు కూడా గోచరిస్తున్నాయి.
సముద్రము- నాదము -కర్ణము (చెవి)
వెన్నెల-గంగ-స్పర్శ (చర్మము)
పువ్వులు-గంధము-నాసిక ముక్కు)
మకరందము-వాక్కు-రసనము (జిహ్వ)
సర్వ శుక్లరూపము-నయనము. (కన్ను)
అంతేకాదు,
శరదృతువు,మేఘము,చంద్రుడు,కర్పూరము,మంచిగంధము,మల్లెపూలు,కల్పవృక్షము,మంచుకొండ.ఆకాశ గంగ,రజో-తమో గుణములనధిగమించితమని తాము స్వఛ్చందముగా సమర్పించుకుంటూ,పరోపకారం ఇదం శరీరం గా ప్రకాశించునవి.
చర్మ చక్షువులకు సరస్వతీదేవి సర్వశుక్ల స్త్రీమూర్తిగా ద్యోతకమగును కాని కొంచము ఆలోచిస్తే పోతన ఆ మూర్తిని పరోపకారమైన పంచభూత స్థూల-సూక్ష్మ ప్రాకృతిక ప్రవాహ జ్ఞానముగా కనుగొనినాడనిపిస్తోంది.
అట్టి జ్ఞానగంగా ప్రవహాము మనలనందరిని అనుగ్రహించుగాక.

TELUGU POOLA DANDA



******************************
తెలుగుభాష పండుగలో పరిమళములు చిందిస్తు
ముసిముసి నవ్వులతో కుసుమములు గుసగుసలాడెను
సుగ్రంధాల సుగంధాలు సౌగంధిక పుష్పములు
వ్యాకరణ వయ్యారములు వైజయంతి కుసుమములు
మధుర ఇతిహాసములు మందార దరహాసములు
ప్రబంధాల బంధాలు (ఆ)నంది వర్ధనాలు
చమత్కార చాటువులు చలాకీ చామంతులు
అష్టావధానాలు అందమైన దవనాలు
చంపూ కావ్యాలుగా చంపకాల తావులు
దివి భువి సంధానాలు వాగ్గేయ పారిజాతాలు
అలరారు శతకాలు ఆ నూరు వరహాలు
కాంతల కవనాలనే చంద్రకాంత పూవులు
ఖండ కావ్యాలుగా అఖండ కళల కలువలు
వాడుక సంకెల తుంచిన వేడుక సంపెంగలు
సంస్కరణల సిరులు కరవీర కుసుమాలు
సుద్దుల ముద్దు ముచ్చట ముగ్ధ ముద్ద బంతులు
జానపదుల పదాలు జాజిపూల పరిమళాలు
తూరుపు ఇటలీ నేనని నేరుపుతో లిల్లీలు
ఆరాధన మానవతకు ఆ రాధామాధవాలు
గుండెలోని ప్రేమతో గుబాళించు గులాబీలు
దేశభక్తిగీతాలురా ఆ కాశీరత్నాలు
తెలుగుతల్లి మమతలు మరుమల్లెల విరులు
మొగలితో పాటుగ తోటలో విరిసిన మిగిలిన పూలు
పొగడతరమ తెలుగును అను తడబాటు పొగడలు
మరువము తెలుగును అను పరిమళపు మరువము
దాచిన దాగని ఘనతగా పూచిన తంగేడులు
జ్ఞానపీఠము ఎక్కిన ఘన జ్ఞాన ప్రసూనాలు
శ్రీరస్తు దీవనతో శ్రీభూషణ పద్మాలు
కదంబమై ఒదిగినా కైదండలో పొదివినా
ఆ చంద్ర తారార్కాలు అందమైన తెలుగుపూలు.

TATPRANAMAAMI SADAA SHIVA LINGAM (తత్ప్రణమామి సదాశివలింగం)

తత్ప్రణమామి సదాశివలింగం
**********************************
1.శుభరూపము శివునిగా,సంకేతము లింగముగా
సృజనాత్మక తత్వముతో,నిశ్చయముగ శుభములొసగు
"పశ్చిమాభిముఖుడు" పరమ కరుణాంతరంగుడు
"సద్యోజాత" నామ శివుడు,సకల శుభములొసగు గాక.
భావము: పశ్చిమ ముఖుడిగా లింగాకారములోనున్న "సద్యోజాతుడు"
అను పేరుగల శివుడు,సృష్టికార్యమును నిర్వహించుచు,మనలను సకల
శుభములతో అనుగ్రహించు గాక.
2లింగముగా.అరూపము ఆదిగా,సంకేతము
సంతోషాత్మక తత్వముతో,సత్వరముగ శుభములొసగు
"ఉత్తరాభిముఖుడు" ఉత్తుంగ తరంగ ధరుడు
"వామదేవ" నామ శివుడు వాంచితార్థమిచ్చుగాక.
భావము: ఉత్తర ముఖుడిగా లింగాకారములోనున్న "వామదేవుడు"
అను పేరుగల శివుడు సంతోషమును తన స్వభావముగా గలిగి,వెం
టనే మనలను అనుగ్రహించు గాక.
3. గుణరహితము తానుగా సంకేతము లింగముగా
మేథ,జ్ఞాన తత్వములో సకల విద్యలనొసగె
" దక్షిణాభిముఖుడు",దక్షరాజు అల్లుడు
"అఘోర" నామ శివుడు,అఘములు తొలగించు గాక
.
భావము:దక్షిణ ముఖుడిగా లింగాకారములో నున్న
"అఘోర నామ శివుడు మనల పాపములను తొలగించి,
సకల విద్యలను ప్రసాదించుగాక.
4.మాయను కప్పువాడిగా,సంకేతము లింగముగా
తిరోధాన తత్వముతో,లోక పరిపాలన సాగిస్తు
"తూర్పు ముఖాభిముఖుడు"కాలమార్పులేవి లేనివాడు
"తత్పురుష"నామ శివుడు పురుషార్థములిచ్చుగాక
భావము: తూర్పు ముఖుడిగా లింగాకారములో నున్న
"తత్పురుష"నామ శివుడు మనలను మాయవైపు తిప్పుతు
సృష్టి పోషణ (తల్లి శిశువును పెంచుట)చేయుచు,
మనలను రక్షించుగాక
5.పంచ కృత్యములు తానుగా,సంకేతము లింగముగా
అనుగ్రహ తత్వముతో,భువనైక సంపదలనొసగు
"ఊర్థ్వ ముఖాభిముఖుడు" అర్థనారీశ్వరుడు
"ఈశాన" నామ శివుడు ఈప్సితార్థము ఇచ్చుగాక
.
భావము: పైకి చూచుచున్న ముఖము కలవాడుగా నున్న
"ఈశాన" నామ శివుడు సృష్టి,స్థితి,లయ,తిరోధానము,
అనుగ్రహము అను ఐదు పనులను నిరంతరము చేయుచు,
మనలను అనుగ్రహించు గాక
.
శివ దర్శనం న చింత నాశనం
పాద దర్శనం న పాప నాశనం
జంగమ దేవర స్మరణం జన్మ సార్థకం.
(ఏక బిల్వం శివార్పణం)

SHIVAARPANAM


సాలేనైనా కాకపోతిని శూలిగూటిని నేయగా
కరిని ఐనా కాకపోతిని కనికరమునే పొందగా

లేడినైనా కాకపోతిని వేడుకగ దరి చేరగా
పులితోలునైనా కాకపోతిని నూలుపోగుగా మారగా

పందినైనా కాకపోతిని బొందెనే అందీయగా
ఎద్దునైనా కాకపోతిని పెద్దదేవుని మోయగా

బూదినైనా కాకపోతిని ఆదిదేవుని తాకగా
జటను ఐనా కాకపోతిని జటిలమును తొలగించగా

విషమునైనా కాకపోతిని విషయమును గ్రహియించగా
పుర్రెనైనా కాకపోతిని వెర్రితనమును బాపగా

వాని యోగము యేమో ఉపయోగములుగా మారగా
నన్నూ తరీంపనీ నీ అనవరతపు కరుణగా.

mogincharaa nagaaraa

అవసరాలకే లోటు
ఆపనంటుంది ఓటు

ఆడుకుంటుంది నోటు
అసహాయముతో ఓటు

ప్రసంగాలు బహుఘాటు
పరిహాసముతో ఓటు


నామినేషను తడబాటు
మామూలే అనే ఓటు


కండువాల సర్దుబాటు
అండయేనా? అనే ఓటు


ప్రణాళికలు సెపరేటు
ప్రమాదములో ఓటు


వాగ్దానముల మాటు
అంతర్ధానము ఓటు


మోగించరా నగారా
ఓటేరా సహారా.

O MANISHI! ALOECHIMCHU

 " అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ |
  తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః "

   (అఖిలాండ బ్రహ్మాండలములలోను,అన్ని చరాచర జీవ రాశులలోను గురువు వ్యాపించి 
    యున్నాడట.నిజమేనా?  మీరేమంటారు?)

     ఓ ! మనిషి! ఆలోచించు
    *************************


  మూస్తూ-తెరుస్తూ, నిరంతరము శ్రమిస్తూ
  కంటిని కాపాడే కనురెప్ప కాదా గురువు

  పీలుస్తూ-వదులుతూ, ఊపిరిని అందిస్తూ
  ఉనికిని కాపాడే నాసిక కాదా గురువు

  కప్పేస్తూ-దాచేస్తూ, వ్యవస్థలను రక్షిస్తూ
  స్పర్శను అందించే  చర్మము కాదా గురువు

  కదలకుండ-మెదలకుండ పదును పళ్ళ మధ్య తానుంటూ
  అదనుచూసి  కదలాడే నాలుక కాదా గురువు

  అడుగు వేస్తు-అడుగుతీస్తు నడవడిని చూపిస్తూ
  కుడి ఎడమల పయనించే నడకయు కాదా  గురువు

  మంచి పనులు-చెడ్డ పనులు  రెండింట్లో తానుంటూ
  మనసు దారి మళ్ళించే బుద్ధియు కాదా గురువు

  ఐదు జ్ఞానేంద్రియములు-ఐదు కర్మేంద్రియములు నివసిస్తూ
  అనవరతము  పాటించే క్రమశిక్షణ కాదా గురువు

  నీ శరీరమే గురు కులమై ఎన్నో నేర్పిస్తుంటే ( గురువుల సమూహము)
  వినయముగా  శిష్యుడివై నిన్ను తీర్చి దిద్దుకో.

PAAHI PAAHI GAJAANANA


 జై బోలో గణేశ్ మహరాజ్ కి
ముజ్జగములు కొలువ ఓ బొజ్జ గణపయ్య
ముచ్చటైన ఎలుకని ఎక్కి ఒజ్జవైన గణపయ్య
చవితి పూజలు అందుకొనగ చక చకరావయ్యా
....
కీర్తి మూర్తీభవించిన తెల్లని వస్త్రముతో
విష్ణువు అని స్తుతియించగ వ్యాపకత్వముతో
స్పూర్తి ప్రదాయకమైన చంద్రకాంతి శరీరముతో
శత్రు దుర్భేద్యమైన చతుర్భుజములతో
ప్రపన్నతలు తొలగించే ప్రసన్న వదనముతో
అడ్డంకులు అడ్డుకునే దొడ్డదైన కరుణతో
అంబ వదన అంబుజపు వికసిత రవి కిరణముతో
రేయి పగలు చేరుచున్న సుముఖుడివి అను స్తుతులతో
"ఏక దంత" అని కొలుచు అనేకమంది భక్తులతో
కరివదన కనికరమున కదిలి వేగ రావయ్యా.
........
పత్రి పూజలు అందుకొనగ మిత్రుడియై రావయ్యా
ఉండ్రాళ్ళను ఆరగించ మెండు ప్రీతి రావయ్యా
మొక్కులను స్వీకరించ చక్కని దొర రావయ్యా
పది దినములు పలుకరించ,పదికాలాలు బ్రోవ రావయ్యా
..........
ఉత్సవాలు ప్రోత్సహించు,ఉత్త పూజలైన సహించు
కాని పనులు క్షమించు,కానుకలు అనుగ్రహించు
వినతిని స్వీకరించు,వినుతులు స్వీకరించు
పంపిచేస్తామయ్యా కనుల సొంపైన వేడుకగా
మళ్ళీ మళ్ళీ రమ్మంటూ కన్నీళ్ళ వీడ్కోలుగా
మనసులోనే పూజిస్తు మళ్ళీ సంవత్సరానికై
"మజ్జారే" అనిపించే నిమజ్జనాలతో
ఓ ముద్దు గణపయ్య మమ్ము సరిదిద్దగ రావయ్యా..

MAKARA SANKRAANTI.



సంక్రాంతి శుభాకాంక్షలు

బోసి నవ్వుల పాపలకు భోగిపళ్ళను పోస్తూ
ఉండాలి రక్ష అని తీయగ దీవిస్తుంది
అందమైన అరకతో అడుగులను తనువేస్తూ
నిండాలి కుక్షి అని పంటలు పండిస్తుంది
పడుచుతనపు మెలికలతో పరుగులను తీస్తూ
నునుసిగ్గుల బుగ్గలల్లే ముగ్గులు వేస్తుంది
కుందనపుబొమ్మలా అందాలను చిందిస్తూ
బొమ్మలకొలువులా విందులెన్నో చేస్తుంది
కన్నెమనసు కనుగొని వెన్నుని వరునిగ తెస్తూ
వేద మంత్రాలతో గోదా కళ్యాణము చేస్తుంది
పంతులమ్మ నేనని వింతలెన్నో చూపిస్తూ
అంతులేని విజ్ఞానపు అంచులు తాకిస్తుంది
పాపాయి నుండి పడతిగా పరిణితిని ప్రసరిస్తూ
ఆడుపాడుతూ ఆనందము పంచుతుంది
కాంతులనే తలదన్నిన పూబంతుల మేలుబంతి
చెంతనే చేరెనమ్మా సంతసాల సంక్రాంతి.

vyarthamu anu padamu nishiddham.

వ్యర్థం దీని అర్థం?
వ్యర్థం అనే పదానికి
అర్థాలే వేరులే
నిరర్థకము అన్నదేది లేదు
అర్థమైతే అనుభవము.
......
నేలరాలు గోరుచూసి
గేలిచేయు జనులకు
పులిగోరుగ మారి తన
విలువను తెలిపింది
......
జారిపోవు జుట్టుచూసి
బేజారవుతుంటే జనులు
ఉన్నికోటుగ మారి చలిని
తరిమికొట్ట కలిగింది
.......
ఊడుతున్న దంతాలు
ఏడుపుముఖమును పెడితే
ఏనుగు ఎత్తుకు ఎదిగి
జగమే ఏలేస్తుంది
.........
మమతలు మారిపోయి
నీ జతను వీడుతుంటే
గొంగళిపురుగేగ
సీతాకోక చిలుక
సంగతి తెలిసిందా
ఎందుకింక అలుక
ఘనతను పొందే మార్గం
భవితగ మారుతుంది నీ
భారం దించుతుంది

baalaa dinoetsavamu-nov 14

భలే భలే నవంబరు 14
********************
భలే భలే ఉత్సవముర, బాలల దినోత్సవము
తెలిసిందిర రాము, చేయమిక మారాము
అడిగో! రండని మనలను బుడుగు పిలుస్తున్నాడు
బాబి,కిట్టు,చిన్ని,బుజ్జి ఈరోజు ఎన్నెన్నో
పెత్తనాలు చేయాలి,మన సత్తాను చాటాలి
సరేరా ఏం చేద్దాం?
చాచాజి గురించి, చాలా చాలా చెబుదాము
మేటితనము చాటగా, పోటీలను పెడదాము
అందాల పందాలతో, చిందులు వేసేద్దాము
సందళ్ళ పందిరిలో ముందును, చూసేద్దాము
ఆడదాము,పాడదాము, అందరినీ అలరిద్దాము
గులాబీలను అందంగా, కోటు గుండీలకు పెడదాము
గుబాళించు పనులతో, కోటి గుండెలలో నిండుదాము
ప్రతిచోట చాచాజీ ప్రతిరూపాలే తుళ్ళు
చాలవు కన్నులు, అనగా సంతోషపు పరవళ్ళు

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...