Monday, July 3, 2017

MAKARA SANKRAANTI.



సంక్రాంతి శుభాకాంక్షలు

బోసి నవ్వుల పాపలకు భోగిపళ్ళను పోస్తూ
ఉండాలి రక్ష అని తీయగ దీవిస్తుంది
అందమైన అరకతో అడుగులను తనువేస్తూ
నిండాలి కుక్షి అని పంటలు పండిస్తుంది
పడుచుతనపు మెలికలతో పరుగులను తీస్తూ
నునుసిగ్గుల బుగ్గలల్లే ముగ్గులు వేస్తుంది
కుందనపుబొమ్మలా అందాలను చిందిస్తూ
బొమ్మలకొలువులా విందులెన్నో చేస్తుంది
కన్నెమనసు కనుగొని వెన్నుని వరునిగ తెస్తూ
వేద మంత్రాలతో గోదా కళ్యాణము చేస్తుంది
పంతులమ్మ నేనని వింతలెన్నో చూపిస్తూ
అంతులేని విజ్ఞానపు అంచులు తాకిస్తుంది
పాపాయి నుండి పడతిగా పరిణితిని ప్రసరిస్తూ
ఆడుపాడుతూ ఆనందము పంచుతుంది
కాంతులనే తలదన్నిన పూబంతుల మేలుబంతి
చెంతనే చేరెనమ్మా సంతసాల సంక్రాంతి.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...