NAH PRAYACHCHANTI SAUKHYAM-13

నః ప్రయచ్చంతి సౌఖ్యం-13 ************************** " రావయ్యా రావయ్యా రా కూడల జంగమదేవా రా శరణు శరణు సంగమదేవ కరుణను కావుము సంగమదేవ" అనుచు భక్తులు స్వామి దర్శనమునకు ఎదురుచూచుచు,భక్తి పారవశ్యముతో మునితేలు తుంటారు. " నమః తీర్థాయచ కూల్యాయచ" తీర్థములందున్న వానికి,తీర్థపు గట్టుల నందున్న రుద్రునికి నమస్కారములు. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలములో తుంగ-భద్ర-కృష్ణ-వేణి-భీవిలి-మలాపహారి-భవనాశి అను ఏడు నదుల సంగమ కూడలిలో స్వామి సంగమేశ్వరుడు. నీ దయ గౌతము గంగా చేరగ నీ పాదము కడుగంగ ఈశా, నివృత్తి సంగమేశ్వరుడు,రూపాల సంగమేశ్వరుడు,కూడలి సంగమేశ్వరుడు అను బహు రూపములతో భాసించు స్వామి,ఏడాడిలో ఎనిమిది ఎలలు ఈటిలో ఉండి,కేవలము నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడటభక్తుల పాపములతో మలిన మైఅగంగమ్మ తల్లి ఈ ఏడునదుల సంగమములో స్నానమాచరించి పాపప్రక్షాళనమును చేసుకుంటుందట. మరికొందరి అభిప్రాయము ప్రకారము సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రదేశము కనుక నివృత్తి సంగమేశ్వరముగా కీర్తిస్తారు.అమ్మవారైన అయ్యవారైన అర్థనారీశ్వరమే...