Posts

Showing posts from February 4, 2026

ADITYAHRDAYAMU-17

Image
         ఆదిత్యహృదయం-17   "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం    కిరణసమిత పాపం క్లేశ దుఃఖస్య నాశం    అరుణకిరణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం    సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము. *********** " తేజసామపి తేజస్వి" మండల వాసియై తన శక్తులచే నక్షత్రములను-తారలను-గ్రహములను-జ్యోతిర్గణములను నిర్మించి,వానిచే వెలువడుచున్న రశ్ములచే సకలభువన సాక్షియై, " ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కక్కడై తోచుచు, ప్రస్తుత శ్లోకములో జయజయ ధ్వానములచే కీర్తింపబడుచున్నాడు. శ్లోకము ****** " జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమోనమః నమోనమః సహస్రాంశో ఆదిత్యాయ నమోనమః" నమోనమః శబ్దమును మూడుసార్లు ప్రయోగించారు మహర్షి వాల్మీకి.కొంతమంది దీనిని పునరావృతముగా భావిస్తే త్రికరణములతో సమర్పించు నమస్కారముగా ఉపాసకులు భావిస్తారు. ప్రస్తుత శ్లోకము ఆదిమూర్తి యైన ఆదిత్యుని, 1.జయప్రదునిగా 2.జయభద్రునిగా 3.సహస్రాంశునిగా 4.హర్యశ్వనునిగా , పూజిస్తున్నది. హరితము పచ్చదనము అభిలషించు మనసును హర్యశ్వముగా,భావనచేస్తూ,అదియును అనేకానేకములు/సహస్రములు,పరమాత్మను ధ్యానిస్తే,జయములు ప్రాప్తిస్తాయి-ప్రాప్తించిన ...