Wednesday, November 29, 2023

KADAA TVAAM PASYAEYAM-17



 


 




  కదా    త్వాం పస్యేయం-17


  *************************


 " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం  ప్రార్థితం


   నమామి  భగవత్పాదం  శంకరం  లోకశంకరం."




 "రోదస్తోయహృతః శ్రమేణ పథికశ్చాయాం తరోర్వృష్టితో


  భీతః స్వస్థగృహం గృహస్థమతిథిం దీనః  ప్రభుం


  దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్థం తథౌ


  చేతః సర్వపాపహం వ్రజసుఖం శంభోపదాంభోరుహం." 


  


   ఏవిధముగా నీటి ప్రవాహములో మునిగిపోతున్న వానికి దుంగ ఆధారమవుతుందో,అలిసిపోయినబాటసారికి వృక్షము ఆశ్రయమవుతుందో,జడివానలో తడుస్తున్న వానికి స్వగృహం సంరక్షణమును ఇస్తుందో,చీకటులను తొలగించి,దీపము ప్రకాశమును ఇస్తుందో,అదే సాపేక్షతానుసారముగా ,నా మనసు చుట్టుముట్టిన భయములను మహేశ పాదపద్మములు తొలగించునుగాక అన్న గట్టినమ్మకముతో త్రికరణ శుద్ధిగా పాదనమస్కారమును చేస్తూ,ఈనాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము.


  ఈనాటి శంకరయ్య గమ్యము కొరకు పయనిస్తున్న పథికుడు/బాటసారి.స్వామి  కరుణ ఆయనకు దేనిని  ఆశ్రయముగా అందిస్తుందో,ఏ సంఘటనము ద్వారా భక్తిని పెంపొందింపచేస్తుందో,ఏ విధముగా మార్గబంధువై సహాయపడుతుందో తెలుసుకునే ప్రయత్నమును చేస్తాను.శివోహం.




 ఆ  మార్గమంతా కళకళలాడుతోంది.ఒకటే భక్తుల సండడి.బిల్వపత్రాలు,పులిచర్మాలు,ఆకాశగంగ పాత్రలు,విభూతి గుండలు ,


 శివోహం శివోహం అంటూ శివనామ స్మరణములు.


  


  చటుక్కున బాహ్యస్మృతికలిగి శంకరయ్య పక్కనున్న పెద్దమనిషితో ,మర్యాదగా 


 అయ్యా మనమెక్కడ ఉన్నాము.ఈ రోజు ఇంత హడావిడిగా ఉండుటకు కారణమేమిటి?అని ప్రశ్నించాడు.


  దానికి ఆ పెద్ద మనిషి ఈ ప్రాంతము నంజనగూడు సమీపములో గల "కల్లన్న మూలై" కి అతి దగ్గరకో ఉన్నాము.


 ఈ రోజు మా దొర,మా తండ్రి,మా సకలము,మా సర్వము అయిన "కాట్రేడు దొర" మా ప్రాంతపు వారిని  అనుగ్రహించిన రోజు.


 కొంచము సేపయితే ఆ చెట్టుదగ్గరకు చేరుకుంటాము అన్నాడు.


  కాట్రేడు..కాట్రేడు...నసుగుతున్నాడు శంకరయ్య,


 అవునండి! మీరు విన్నది ఆ నామమే.మీ భాషలో "శ్మశాన రాజు" కాశి విశ్వేశ్వరుడు"


  అయినా ఎవరమైనా చివరకు అక్కడికి వెళ్ళవలసిన వారమేకదా.అన్నాడు భక్తిగా.


 ఈ సారి కొంచము పరిశీలనగా చూశాడు శంకరయ్య ఆ పెద్దమనిషి వంక.


 ఆయన మరొక వ్యక్తిని తాళ్ళతో బంధించి తీసుకుని వెళుతున్నాడు.ఆ బంధించిన వ్యక్తి గురించి అడగబోతు,ఆగిపోయాడు శంకరయ్య.

 దానిని గమనించిన ఆ  పెద్దమనిషి,




 "అడుగు అడుగు శివమే-అణువు అణువు శివమే"అనుకుంతూ, 


 వీడు "స్తేనానాం" విభాగానికి చెందిన దొంగ.అనగానే,


 శంకరయ్య  అంటే,అన్నాడు అర్థంకాక.


 అంటే ఎవ్వరికి అనుమానం రాకుండా/రహస్యంగా దొంగతనం చేయడం  వీడి అలవాటు.మా ఊరిపెద్దలు వీడికి ఎంతో  నచ్చచెప్పారు.వినకపోతే నిర్బంధించారు.


 అయినావీడు తన పద్ధతిని మార్చుకోలేదు.


 అందుకే నాతో జాతరకు వీడిని పంపుతున్నారు.


   అప్పుడు మానేస్తాడా ?మారిపోతాడా?


 ఆశ్చర్యముగా అడిగాడు శంకరయ్య.


 అక్కడ తస్కరణాం పతి/అసలైనదొంగల నాయకుడుంటాడుగా. 


 వాడు వీడిలోని దొంగబుద్ధిని తొలగించివేస్తాడట.పైగా,


 " శివ శాసనము శిలాశాసనము" అని వాడిని సంస్కరిస్తాడట.


 అసలు ఆ జాతర చేసేది కూడా కల్లన్న అన్న దొంగ కొరకేనట.


 ఆ ముందు కూడా మీలాగేనే ఇద్దరు వెళుతున్నారు. వాళ్ళు, ఆగాడు.


 ఓ వాళ్ళా ! వాళ్ళలో కూడ ఒకడు దొంగనే.కాని"స్థాయూనాం" విభాగానికిచెందినవాడు.


 అలాఅశ్చర్యపోకండి.


 వాడు ప్రభువును సేవిస్తున్నట్లు నటిస్తూ,సంపదలను దోచుకుంటాడు.


 మన వెనకవస్తున్న వాళ్ళు అన్నాడు వెనకకు తిరిగి.


 వాళ్ళు "ఊష్ణతాం"విభాగమునకు చెందినదొంగ.


 ప్రభువునకు ఈయవలసిన పంటలను/ధాన్యమును ఈయకుండా దాచుకుంటున్నాడు.


ముందర ఎందరో వెళుతున్నారు.మన వెనకాలేందరో వస్తున్నారు.


 అంతే.అంటే ఇలా ఎంతమంది దొంగలు వస్తున్నారు  అక్కడికి?


  ఆత్రంగా అడిగాడు శంకరయ్య.


 ఇంకా,




 రాత్రి పూట కత్తిపట్టుకుని  తిరిగే "ప్రకృంతానాం" విభాగము వాళ్ళు,కొండలలో తిరిగే "కులుంచానాం" విభాగము వాళ్ళు ,ఇంకాఎం దరెందరో మొండి దొంగలను ఈ జాతరకు పంపించి,సరిచేయించుకుంటారట ఆ తస్కరాణాం పతి మాటలతో.




  అంటే వీళ్ళను మార్చే ఆయన కూడా దొంగ..దొంగ..దొంగ..నేనా...నసుగుతున్నాడు శంకరయ్య.


 అలా మెల్లగా చెబుతారేంటి బాబు.పెద్ద దొంగ.


 కాని పేరులు మాత్రము,


 భవహరుడు,పురహరుడు,తిమిర హరుడు,అంటూ బహు గొప్పగా ఉంటాయి లెండి.


 అలా చెబుతూనే    తన  వశముకాని మనసు పరవశుని చేస్తుంటే,


 " మనసా చరితం వదామి శంభో


   రహముద్యోగ విధాసు తే ప్రసక్తః


   మనసాకృతిమీశ్వరస్య సేవే


   శిరసాచైవ సదాశివం నమామి"


  అప్రయత్నముగా శంకరయ్య కంఠము తాను జతకలిపి పరవశిస్తోంది.చిత్త చోరుడు చిత్రాలను ప్రారంభించాడు.


 కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ.

    'తన్మై మనః శివ సంకల్పమస్తు

     వాచే మమశివపంచాక్షరస్తు

     మనసే మమ శివభావాత్మ మస్తు".

     పాహిమాం పరమేశ్వరా.

    (ఏక బిల్వం  శివార్పణం)

 



TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...