పదిశక్తులపరమార్థము-నాల్గవశక్తి-భువనేశ్వరి.
*************************************
భువనేశ్వరి తత్త్వము గురించి క్లుప్తముగా మూడువిషయములను పరిచయము చేసుకుందాము.
1 భూగోళము-ఖగోళము
భువనము అనగా ప్రపంచము.తల్లి తనవీక్షణతో పదునాలుగు భువనములను సృష్టించినది.భూగోళమునకు సహాయకారిగా ఖగోళమును సృష్టించి,దానిని విస్తరింప చేసింది.ప్రణాళిక ప్రకారమే జరిగినది.ఈ ప్రక్రియ.గ్రహములు-గ్రహగతులు నిర్ణయింపబడినది.అదేకద రాత్రింబవళ్ళు.విచిత్రముగా ఒక రోజు గడిచినది అంటాము గాని భూమి సూర్యుని చుట్టు తిరిగినది అనము.
2.కలి-ఆకలి.
భూగోళ-ఖగోళ పరిభ్రమణము జీవులలో ఆకలినితెలియచేసినది.కరువు-కాటకముల ఇబ్బందులు తెలిశాయి.కలి తమకడుపులో లేదని మనకు తెలియచేసేది ఆకలి.కలో-గంజో అని మనము అంటుంటాము కదా.ఆకలి ని తొలగించుటకుభువనేశ్వరి శాకములను- ఫలములను-ధాన్యములను తన శరీరమునుండి ఉత్పత్తి చేసి శాకంబరి గా మారినది.కలిని కొనసాగించుటకు భూగోళము లోని వృక్షములకు-ఖగోళములోని సూర్యులకు మైత్రి కలిపి ,జలములకు మేఘములకు పొత్తు కలిపి ఆకలిదప్పులను తీర్చుచున్నది.
3.మనదేహము-మణిద్వీపము.
మనదేహములోని హృదయము దహరాకాశము.పంచభూతాలలోని ఆకాశము.మహదాకాశము.కాశము అంటే వెలుగు.ప్రకాశము అంతే గొప్పదైన ( ప్రకృష్టమైన) వెలుగు.అజ్ఞానపు చీకటిని తొలగించుతల్లి మన దేహములో సూక్ష్మముగా ప్రకాశిస్తుంటుంది.తెలుసుకోగలిగితే మనహృదయమే మణిద్వీపము.మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువైయున్నది.
ఇఛ్ఛాశక్తి తో పాటుగా తన మాతృభావనను కలిపి వీక్షగా మార్చిన భువనేశ్వరి మాత సాధనతో మన దృషిని వికే0ద్రీకరణ నుండి మరల్చి కే0ద్రీకరించగలిగితే స్వర్ణాభరణములను,ఏ విధముగా గొలుసు-కడియము-కుండలము అని చూడకుండా,దానిలో దాగిన బంగారమును మాత్రమే చూడగలుగుతామో,అదే విధముగా మనము చూచుచున్న సకలచరాచరములలోని విభేదములను అధిగమించి మూలశక్తియైన అమ్మను చూడగలుగుతాము దేవి కృపతో.
భువనేశ్వరి మాత చరణారవిందార్పణమస్తు.