శ్రీచక్ర పంచమావరణదేవతాః
సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,
సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ,
సర్వార్థసాధక చక్రము-05
********************
"" కులం శక్తిః ఇతి ప్రోక్తం అకులం శివ ఉచ్యతే"
బహిర్దశార చక్ర పరివారదేవతలైన ఐదవ ఆవరనములో విలసిల్లుతూ,సధకునికి ఋజుమార్గ పయనమునకు సహాయపడు పదిశక్తులు కులయోగినులు.
అగ్నికి విస్పులింగములవలె పరమేశ్వరికన్న భిన్నముకాని ,పరమేశ్వరిచే విస్తరింపబడీ శక్తులు.
మరికొందరు వీరినే దశవాయువులుగాను,నారాయణుని దశావతారములుగాను కీర్తిస్తారు.
పది త్రికోణమూగా పదిశక్తులు ప్రకటితమయే ఊహాచతురస్రము.
అనంతశక్తులను దాటి,సర్వము తామై విలసిల్లే సర్వశక్తుల అనుగ్రహముతో సాధకుడు తన లక్ష్యమును సులభముచేసుకొనుచున్నాడు.
వారే,
1.సర్వసిద్ధిప్రదే
2.సర్వ సంపత్ప్రదే
3.సర్వ ప్రియంకరీ
4.సర్వ మంగళకారిణీ
5.సర్వకామ/కాయ ప్రదే
6.సర్వ దుఖః విమోచనీ
7.సర్వమృత్యుప్రశమనీ
8.సర్వ విఘ్ననివారిణీ
9.సర్వాంగసుందరి
10.సర్వసౌభాగ్యదాయిని.
ఇక్కడ మనమొక విషయమును గమనించాలి.సుందరమైన శాశ్వతమైన అమ్మ తత్త్వమును అర్థముచేసుకొనుటకు మనకు అడ్డుపడే విషయములను /విఘ్నములను దుఃఖములను కొన్ని శక్తులు తొలగిస్తుంటే,మరికొన్ని శక్తులు సాధ్యముచేయుటకు సహకరిస్తున్నాయి.
మానవ నైజము ఎప్పుడో జరిగిపోయిన విషయమును పదేపదే తలచుకొని దుఃపడుతుంటుంది.నిజమునకు జరిగినప్పుడు కలిగే బాధ సమయముతో పాటు సమసిపోతుంది.అదేవిధముగా మానవ అజ్ఞానము దారిని మళ్ళిస్తూ ముందుకు సాగనీయకుండా అడ్డుపడుతుంటుంది.
వాటిని దూరముచేసి,సాధనకు దగ్గర్చేయుటకు సహాయపడే సహృదయ శక్తులే కులయోగినులు.
కులము అను పదము యొక్క విశిష్టతను శ్రీలలితారహస్య సహస్రనామములు చక్కగా వివరించాయి.
అమ్మవారు అకుల.తనను తాను ఎన్నో శక్తులుగా విస్తరింపచేసుకొని,సాధకుని అనుగ్రహించుచున్నది.
సజాతీయ సమూహము కులము.సుషుమ్నా నాడీమార్గము కులము.సంప్రదాయాచారము కులము.శివశక్తుల సామరస్యము కులము.కుండలినిశక్తి కులము.దానిని జాగృతపరచుశక్తులు కులయోగినులు.
మానవదేహ పరముగా భావిస్తే విశుధ్ధి చక్రము/వశిత్వసిధ్ధికి సంకేతము ఈ ఆవరణము.
జ్ఞానేంద్రియ-కర్మేంద్రియ సంకేతములైన ఈ పది యోగినులు సాధకునితో నిద్రాణముగా నున్న చైతన్యమును జాగృతపరచి కులోత్తీర్ణమార్గము వైపునకు నడిపిస్తాయి.చక్రేశ్వరికి నమస్కరిస్తూ భావమోహ వ్యాకులతనువీడి ఆరవ ఆవరన ప్రాముఖ్యతను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాను. సర్వాసౌభాగ్యప్రద చక్రములోని సంప్రదాయయోగినుల
వాత్సల్యమును పొందిన సాధకుడు చక్రేశ్వరియైన త్రిపురవాసినిదేవికి నమస్కరించి, ఐదవ
ఆవరణమైన"సర్వార్థ సాధక చక్రము"లోనికి
కులోత్తీర్ణ యోగినుల సహృదయతతో ప్రవేశించుచున్నాడు.