01NAMONAMAHA

నవదుర్గ మాతా నమో నమః ******************** ప్రసీద మమ సర్వదా ****************** "యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ" నిరాకార-నిరంజన నిర్గుణ నిత్య తత్త్వమే తత్.అంటే అది.అది అంటే అన్నింటా ఉన్నది.దానినే సా సావర్ణిగా ( సా అనే అక్షరముగా పెద్దలు చెబుతారు.ఇంకా సులభముగా మనకు అర్థమవాలంటే ఏకాతత్త్వమే-బహుముఖములుగా తనని తాను పరిచయము చేసుకొనుచు ఆదే చదరంగపు ఆట.ఇందులోని జీవులనే పావులలో కొన్నిటిని తనకు అనుకూలముగా మరి కొన్నింటిని తనను ధిక్కరించునవిగా మనలను భ్రమింపచేయుచు,ఎత్తుకు పైఎత్తులను ప్రదర్శింప చేయుచు,కొన్నిటికి రాజు అని,ఇంకొన్నిటికి మంత్రులని,అశ్వములని,బంటులని ఎల్లా ఎన్నో నామరూపములను నిర్ధారించి,ఆట ముగిసిన వెంటనే అన్ని పావులు చదరంగపు బల్లతో సహా పెట్టెలో కలిసిపోయి ఉండినట్లు తల్లి తన లీలగా అసురులు-సురలు అను రెండు వర్గములను మనము భావించునట్లు చేసి,మనకు అర్థము చేయవలెనను దయతో తానొక పక్క-వారినొక పక్క పెట్టి ఎత్తు...