Wednesday, October 14, 2020

01NAMONAMAHA

నవదుర్గ మాతా నమో నమః ******************** ప్రసీద మమ సర్వదా ****************** "యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ" నిరాకార-నిరంజన నిర్గుణ నిత్య తత్త్వమే తత్.అంటే అది.అది అంటే అన్నింటా ఉన్నది.దానినే సా సావర్ణిగా ( సా అనే అక్షరముగా పెద్దలు చెబుతారు.ఇంకా సులభముగా మనకు అర్థమవాలంటే ఏకాతత్త్వమే-బహుముఖములుగా తనని తాను పరిచయము చేసుకొనుచు ఆదే చదరంగపు ఆట.ఇందులోని జీవులనే పావులలో కొన్నిటిని తనకు అనుకూలముగా మరి కొన్నింటిని తనను ధిక్కరించునవిగా మనలను భ్రమింపచేయుచు,ఎత్తుకు పైఎత్తులను ప్రదర్శింప చేయుచు,కొన్నిటికి రాజు అని,ఇంకొన్నిటికి మంత్రులని,అశ్వములని,బంటులని ఎల్లా ఎన్నో నామరూపములను నిర్ధారించి,ఆట ముగిసిన వెంటనే అన్ని పావులు చదరంగపు బల్లతో సహా పెట్టెలో కలిసిపోయి ఉండినట్లు తల్లి తన లీలగా అసురులు-సురలు అను రెండు వర్గములను మనము భావించునట్లు చేసి,మనకు అర్థము చేయవలెనను దయతో తానొక పక్క-వారినొక పక్క పెట్టి ఎత్తుకు-పై ఎత్తులను వేయుచు ఆట ముగించి అందరిని తన దయ అనే పెట్టెలో దాచివేస్తుంది తల్లి. ఈ జగన్నాటకములోని పాత్రధారులైన మనలను తల్లి తన అవ్యాజకరుణతో తన అనుగ్రహమును వ్యక్తపరుస్తూ,(కొత్తకొత్త-తొమ్మిది-నవ) కుమాతా న భవతి అనే నానుడిని సార్థకము చేస్తుంది. పారమార్థిక తత్త్వమును తెలియచేయుటయే కాక ,ప్రాపంచిక మాయ యనెడి సాగరమున మునిగి,దారి తెన్ను తోచని స్థితిలో నున్న మనకు వివేకము-అవలోకనము అను రెండు రెక్కలను అతికించి విహరించమటుంది. నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను. దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగితే వచ్చిన సంభాషణ లోంచి దుర్గాదేవి వివరాలు మనకు వరాహ పురాణాం నుంచి ఈ క్రింది విధంగా కీర్తించబడినది. 'ప్రథమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాందేతి చతుర్థకం పంచమం స్కందమాతీతి షష్ఠం కాత్యాయినీతి సప్తమం కాళరాత్రీతి మహాగౌరీతిచాష్టమం నవమం సిధ్ధిధాత్రీచ నవదుర్గ ప్రకీర్తితః." అమ్మదయతో కొనసాగుతుంది. శరణం నీ దివ్య చరణం. శ్రీమాత్రే నమః.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...