Friday, May 1, 2020

CHAMAKAM-ANUVAAKAMU-08

 శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.
 ఈ అనువాకము యజ్ఞకర్త-యజ్ఞభర్త-యజ్ఞభోక్త అయిన పరమాత్ముని యజ్ఞ నిర్వహణకు కావలిసిన పరికరములను-పరివారమును అనుగ్రహించి,సాధకుని యజ్ఞము సమర్థవంతగునట్లు చేయబడు ప్రార్థన.
 సాధకుడు అంతర్యాగానందమును అనుభవించుచు ఈ అనువాకములో బహిర్యాగ విశేషములను ప్రస్తుతిస్తున్నాడు.



  యజ్ఞము అను ప్రక్రియ సనాతన వైదిక సంప్రదాయ అగ్నికార్యము.ఈనాటి ఆధునికము కొన్నిసంవత్సరముల తరువాత పురాతనముగాను,కొన్నేళ్ళ కిందటి ఆధునికము నేటి పురాతనముగాను మారుచుండుట మనము చూస్తూనే ఉన్నాము.ఇటువంటి మార్పులు లేని శాశ్వత సంప్రదాయమే సనాతనము.అపౌరుషేయమైన వేదోక్త విధినిర్వహణము.అపరిమిత సౌభాగ్యఫల ప్రదము.


 పరమాత్మస్వరూపమైన ప్రకృతి లోని సంపదలను మనము ఏవిధముగా కోరుకోవాలో-ఎందుకు కోరుకోవాలో-ఎప్పుడు కోరుకోవాలో కోరుకున్న వాటిని ఏ విధముగా ఉపయోగించుకొని ఆధ్యాత్మికామృతమును అందుకోవాలో తెలియచేస్తున్నాడు చమకరూపములో.విజ్ఞతకు ఇది ఒక ఉదాహరణ.

  నిజము చెప్పాలంటే చిన్నపిల్లల చేతిగోరు ముద్దలు తింటూ అమ్మ ఎలా పరవశించిపోతుందో,చిన్న పిల్ల తినిపించిన అనుభూతితో ఎలా ఆనందపడుతుందో అదేవిధముగా సాధకుని నిరంతర నిశ్చల సాధన మను యజ్ఞమునకు కావలిసినవి ఏవో,వాటిని ఎలా అభ్యర్థించి పొందాలో,పొందిన వాటిని సద్వినియోగము చేసుకొని సత్ఫలితములను పొందుటను వివరిస్తుంది.

    యజ్ఞ నిర్వహణకు సమకూర్చుకొనవలసిన వాటిని మూడు విధములుగా వర్గీకరించుకొన వచ్చును.అవి,
1) యజ్ఞ ప్రారంభమునకు పూర్వమే సిధ్ధము చేసుకోవలిసిన సమిథలు-దర్భలు-దక్షిణలు,పాత్రలు చెక్కవి-మట్టివి,చెక్క కత్తులు-పళ్ళెములు,ద్రోణ కలశములు అనగా మర్రిచెక్క నుండి మామడికాయ ఆకారములో చేయబడిన పాత్ర(సోమ రసమును ఉంచుదురు) అగ్నిని ప్రజ్వలింప చేయుటకు రాళ్ళూ మొదలగునవి.

   వీటితో పాటు ముఖ్యమైనది యజ్ఞ కుండము దానినే వేదిక అందురు.వేదిక కాక నాలుగు యజ్ఞ కుండములనేర్పరుచుకొనవలెను.వీటితో పాటు హోత-ఉద్ఘాత ఆసీనులగుటకు,హవిస్సులను సమర్పించుటకు అనువైన ఉన్నతాసనములను ఏర్పరచవలెను.

  పవిత్రమైన అచేతన హోమ పరికరనులవారా చేతనత్వమును వేద మంత్రముల ద్వారా ఆహ్వానించి గౌరవించు యోగ్యులు హోత ఉద్ఘాత.అన్నిటికన్న ముఖ్యమైనది అగ్ని అనుగ్రహము.సాధకునికి-స్వామికి మధ్యవర్తియై యజ్ఞమును సుసంపన్నముచేయు సామర్థము గల సనాతన శక్తి.
 స్థలము-సన్నుతులైన సత్పురుషులచే వేదోక్త ప్రకార విధినిర్వహణకు "బ్రహ్మ" యు పర్యవీక్షతను పూర్తిచేసి,యజ్ఞము ముగిన తరువాత అవబ్రుధ స్నానమునకు సాధకుని అభిముఖుని చేయించును.విశ్వశాంతి వర్థిల్లును.

    సాధకుడు ఇధ్మశ్చమే బర్హిశ్చమే అంటూ సమిధలను-గరికలను అడుగుచున్నాడు.అదే విధముగా యజ్ఞ నిర్వహణకు కావలిసిన స్రుచశ్చమే-చమసాశ్చమే-ద్రోణ కలశశ్చమే-పురోడాశాశ్చమే అంటూ పాత్రలను అభ్యర్థించాడు.సుస్వర మంత్రోచ్చారణకు స్వరవశ్చమే-ఉపరవశ్చమే అని,యజ్ఞమునకు సహాయపడువారిని పచతాశ్చమే అంటూ,ప్రార్థించి ,తన యజ్ఞవిధిని పూర్తిచేసి,సాధకునితో అవబృథ స్నానమును చేయించుచున్న చమకముతో మమేకమగుచున్న వేళ సర్వం శివమయం జగత్.

   ఏక బిల్వం శివార్పణం.



  

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...