Posts

Showing posts from March 31, 2024

ADITYAHRDAYAMU-SLOKAMU-31

    ఆదిత్యహృదయము-శ్లోకము-31   ***********************  ప్రార్థన  *******  "జయతుజయతు సూర్యం సప్తలోకైక దీపం   హిరణసమిత పాప ద్వేషదుఃఖస్యనాశం   అరుణకిరణ గమ్యం ఆదిమాదిత్యమూర్తిం   సకలభువనవంద్యం భాస్కరం తం నమామి."  పూర్వరంగము  ***********  పరమాత్మ పన్నెండు నెలలు ఋతుచక్రమునకు అనుకూలముగా తనపరివారమును-తానుసైతము మలచుకుని,ద్వాదశాదిత్యులుగా దర్శనమిస్తున్నాడో,ఏ విధముగా సకలజగములను సకలగ్రహములను సంరక్షించుచున్నాడో,ఏ విధముగా సర్వపాపములను నశింపచేయుచున్నాడో వివరించిన అగస్త్యభగవానుడు,చివరి శ్లోకములో ,  మహేంద్రః ధనదః కాల యమ గా అలరారుతున్న పరమాత్మ సూర్యభగవానునిగా ప్రకటితమగుచు,రావణాసురునికి అంత్యకాలము సమీపించినదని తెలిపి,రాముని రణోన్ముఖుని చేస్తూ,ఆశీర్వదించి తరలినాడట.  శ్లోకము  ******  "అథ రవిరవదన్నిరీక్ష రామం   ముదిత మనాః పరమం ప్రహృష్యమాణః  నిశిచరపతి సంక్షయం విదిత్వా  సురగణ మధ్య గతో వచస్వరేతః"    ఇతి శ్రీమద్రామాయణే యుద్ధ్ధకాండే    ఆదిత్యహృదయ స్తోత్రం సంపూర్ణం."   ఎంతటి చమత్కారి ఈ అగస్త్యభగవ...