BHAVANAAMAATRA SAMTUSHTAA-GUPTATARA YOGINULU

భావనా మాత్ర సంతుష్టా-గుప్తతర యోగినులు ******************************** సర్వాశాపరిపూరకచక్రములోని 16 గుప్తయోగినులు పంచేద్రియములను పంచభూతములతో కర్మేంద్రియములను పంచతన్మాత్రలతో అనుసంధానముచేసి ఆత్మసాక్షాత్కారమునకు సిధ్ధముచేస్తుంటే,మరికొంచము ముందుకు సాధకుని సాధనను జరుపుతూ,8 మంది గుప్తతర యోగినులు సర్వసంక్షోభచక్రములో అనంగులై మానసిక పరిపక్వతకై పాటుపడుతుంటారు.ఆకర్షణ శక్తులైన గుప్తయోగినులు ఉపాధిని సిధ్ధము చసిన తరువాత,అనంగ శక్తులు అనగా శరీరమునకు సంబంధములేని ,మనసుతో శరీరమును సైతము నియంత్రించగలిగిన మహిమాన్వితములు. అనంగ కుసుమా అనంగమేఖలా అనంగ మదనా అనంగ మదనాతురా అనంగ రేఖా అనగవేగినీ అనంగాంకుశా అను ఈ మానసికశక్తులు మంచిభావములను సాధకుని మనసులో కలుగచేస్తూ,ధర్మబధ్ధ ప్రవర్తనను పెంపొందింప చేస్తాయి.అనంగ వేగినీ కొత్త కొత్త ఆలోచనలకు ప్రవృత్తిగా,దురాలోచనలకు నివృత్తిగా అనంగాంకుసినీ శక్తి సహాయపడుతుంటే,అనంగమాలిని శక్తి తటస్థ భావమును కలిగిస్తూ,అనవసర భావనలకు దూరముగా ఉంచుతుంది. అనంగదేవతలు సాధకుని అంతరంగములో కుసుమే ఒక సంకల్పమును పుష్పింపచేయుశక్...