Monday, March 2, 2020

MADHAVAMASAMU-ARYAMA

అదిగో మధుమాస సంరక్షణను దిగ్విజయముగా పూర్తిచెసుకొని,

   పులహ మహాముని వంశాభివృధ్ధికి కారణమవుతు,వేదవేద్యునికి లాంఛనప్రాయముగా మార్గమును చూపిస్తూ,మురిసిపోవాలని తహతహలాడుతున్నాడు.అప్సరసాంగన పుంజికస్థలి తన దివ్యశక్తులతో నారద గానామృతమునకు అనుగుణముగా నర్తిస్తున్నది.కఛ్చనీరుడను సర్పము ఏకచక్ర రథ పగ్గములను ఏకాగ్రతతో పరిశీలిస్తూ,ప్రయాణమునకు సిధ్ధపరుస్తున్నాడు ఒద్దికగా.అతౌజుడను యక్షుడు సలక్షణుడై స్వామిరథమునకు సప్తాశ్వములను అనుసంధిస్తూ,ఆనందిస్తున్నాడు.ప్రహేతి రాక్షసుడు పరాక్రమోపేతుడై రథమును ముందుకు జరుపుతున్నాడు.తన కిరణముల ద్వారా ఉష్ణోగ్రతల పెంచుతు,అవనీతలమును ఆనందమయము చేయుటకు మాధవమాస అధిపతియై "ఆర్యమ" నామాలంకృత శోభితుడై తరలు    వాయు తత్త్వ ప్రధాన స్వామీ.
 " తం ఆర్యమ ప్రణమామ్యహం."

MADHUMAASAMU-DHAATA

 మధుమాసము-ధాత
 ******************

 అదిగో! ఆనందోత్సాహము! ఆస్వాదించండి.

 " మననాత్ త్రాయతే మంత్రః" మననము చేసే వారిని రక్షించేదే మంత్రము అను ఆర్యోక్తికి అద్దము పడుతూ,బ్రహ్మ మానసపుత్రుడు,సప్తర్షులలో ఒకరైన పులస్త్యుడు (ప్రథమముగ నుండువాడు),పురాణ సంపదను మానవాళికి చేరువ చేసిన మహనీయుడు వేదవేద్యుని కీర్తిస్తూ,లాంఛన ప్రాయముగా మార్గమును చూపిస్తు మురిసిపోవాలని తహతహలాడుతున్నాడు.క్షీరసాగర మథనానంతరము జలరసముగా ప్రకటింపబడిన/వెలువడిన( అపొ-నీటి-రస-సారము)కృతస్థలి అను అప్సరస అవనీతలమును చిగురింపచేయుటకు ఆడుతూ స్వామిని అనుసరిస్తున్నది.అసమాన సౌందర్యముతో,అప్రమేయ పరాక్రమముతో కోకిలమ్మకు కొత్త కూత నేర్పించుటకా యన్నట్లు,తుంబురుడు తన మధుర గానముతో పరమాత్మను తన్మయ పరుస్తూ,తరించిపోతున్నాడు.

  నాగరాజైన వాసుకి ఏకచక్ర రథ పగ్గములను ఏకాగ్రతతో పరిశీలిస్తూ,ప్రయాణమునకు సిధ్ధము చేస్తున్నాడు.


 పర్వత పరిరక్షకుడు పరిశీలనా దక్షుడు అయిన రథకృత్ అను యక్షుడు జగములను తన శక్తిచే మాయామోహితులను చేయుటకు స్వామి రథమునకు సప్తాశ్వములకు అనుసంధానమును చేస్తూ, ఆనందిస్తున్నాడు.హేతి రాక్షసుడు రథమునకు వెనుక నిలబడి స్వామి రథమును తన భుజబలముతో ముందుకు జరుపుతున్నాడు.నయనానందకరముగా " ధాత" నామాంకృత శోభితుడై భూతలమును నవనవోన్మేషము చేయుటకు స్వామి తరలుచున్నాడు.

 స్వామి సృష్టికార్యమును తిరిగి ప్రారంభిస్తున్నాడు.మోడుబారిన చెట్లు కొత్తచిగురులు తొడుగుటకు తనతో పాటుగా జలసంపత్తిని (అపరసను) జ్ఞాన సంపత్తిని(పులస్త్య మునిని) మోహవివశులను చేయుటకు రథకృత్ ని,భవసాగర బంధములను (వాసుకిని)సర్పములను ,తమోగుణ హేతి రాక్షసుని సంకేతములుగా తనతో పాటు తరలిస్తున్న ఆ తాపస మనోహరుడు మనలను రక్షించును గాక.
  తం ధాత ప్రణమామ్యహం.

DVAADASAATMAN -NAMOSTUTE.


 ద్వాదశాత్మన్ నమోస్తుతే
 **********************

  "బృహత్వాత్-బృమ్హణత్వాత్ ఇతి బ్రహ్మ."అన్నింటికంటె ఏదిఉత్కృష్టమైనదో అది,బృహతి.బృమ్హణము అంటే వ్యాపకత్వము.ఏది అన్నిటికంటె మహోత్కృష్టమైనదో,ఏది అన్నింటియందు వ్యాపించి యుందో అదియే "బ్రహ్మము." వేదము ఆదిత్యుని బ్రహ్మముగా కీర్తిస్తుంది.సర్వజీవుల యందలి ఆత్మయే బ్రహ్మము.అది జగతఃస్థుషః -తాను కదలకుండ ఉంటూ అన్నింటిని కదిలించే శక్తి గల స్థావర-జంగమాత్మకము.

  ప్రత్యక్ష పరంజ్యోతి ఏడాది పొడవునా ఒకతే స్వరూప-స్వభావాలతో వెలుగులు-వేడి వెదజల్లుతుంటే మనము తట్టుకోగలమా? అసలు ఆ ఊహనే అమ్మో? మన పొట్ట నింపుకోగలమా?విద్య పై పట్టు సాధించగలమా?వైద్యరంగపు మెట్లు ఎక్కగలమా?కొన్ని రోజులు చిగురులు-మరి కొన్ని రోజులు గుబురులు.కొన్ని రోజులు ఎండలు-మరి కొన్ని రోజులు వానలు.కొన్ని రోజులు వెన్నెల-మరి కొన్నిరోజులు శిశిరము.కొన్ని జీవులు పుట్టుట-మరి కొన్ని జీవులు గిట్టుట.కొంత మందికి బాల్యము-మరి కొంత మందికి భారము.ఇవన్నీ కలిగించటానికే " ఏకం సత్ విప్రా బహుదా వదంతే" అన్నట్లు పన్నెడు రాశులలో పన్నెండు రూప -గుణములతో,తన నుండి ప్రకటింప బడిన ఆరు శక్తులతో కలిసి,ఆరగింపులను అందిస్తున్నాడు తన అవ్యాజ కరుణతో.

  సౌరశక్తులు సొబగులు దిద్దుకొని మనకు కానుకలను అందించుటకు కదులు సమయమున జరుగు బ్రహ్మాడోత్సవము(బ్రహ్మోత్సవము) బహు ప్రశంసనీయము.సకల కళల సమ్మోహనం.యక్షులు రథ పగ్గములను పట్టుకుని గట్టిగా లాగుతూ సాగుతుంటేగంధర్వులు మధుర గానముతో,అప్సరసలు నాట్యాభినయనముతో అనుసరిస్తుంటారట.జల సంబంధ -లలితకళ సంబంధ శక్తులు వీరు.యక్షులు-రాక్షసులు మన రక్షణార్థము స్వామి రథమునకు కట్టిన తాళ్ళను గట్టిగా పట్టుకుని,గుట్టుగా మురిసిపోతుంటారట.వాలిఖ్యాది మునులు లాంఛనప్రాయముగా స్వామికి దారిని చూస్తూ,పరవశిస్తుంటారట.జగత్కళ్యాణ జగన్నాథుని సేవాసందర్శనాసక్తుల మనోభీష్టము నెరవేరు గాక.

   చాంద్రమాన ప్రకారము చైత్రము నుండి ఫాల్గుణము వరకు ప్రస్తావింపబడిన పన్నెండు తెలుగు నెలలు,సౌరమాన ప్రకారముగా,

 1.మధుమాసము,
 2.మాధవ మాసము,
3.శుక్ర మాసము,
 4.శుచి మాసము,
 5.నభస్ మాసము,
 6.నభస్య మాసము,
 7.ఈశ మాసము,
 8.ఊర్జ్య మాసము,
 9.సహస్ మాసము,
10.సహస్య మాసము,
11.తపస్ మాసము
12.తపస్య మాసముగా  కీర్తింపబడుతున్నవి.

  అవ్యక్త రూపమును అర్థము చేసుకొనుటకు( సామాన్య మేథ)ఆలంబనగా వ్యక్త నామ రూపములను నిర్దేశిస్తూ,

 పన్నెండు మాసములున్న రాశి చక్ర గమనములో,
 1ధాత,
 2.ఆర్యమ
 3.మిత్ర,
 4.వరుణ,
 5.ఇంద్ర,
 6.వివస్వంత,
 7.త్వష్ట,
 8.విష్ణు,
 9.అంశుమంత్,
 10.భగ,
 11.పూష,
 12.పర్జన్య నామములతో ప్రకాశించు పరమాత్మ ప్రణతోస్మి.

    ప్రసీద మమ భాస్కర.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...