DASA SLOKI STOTRAMU.
దశ శ్లోకి- శ్రీ ఆదిశంకర కృతము. *********************************** 1. ఇల పంచభూతములు నేనుకాను ఇంద్రియములు నేనసలు కాను సుషుప్తావస్థకు ఒకే సాక్షిగ నున్న గురుదేవ! కేవల శివస్వరూపమును నేను. 2. వర్ణాశ్రమములో నేనిమిడిలేను అవిద్యకు ఆశ్రయము నేనసలు కాను ఆత్మస్వరూపియైన అద్వితీయమును గురుదేవ! కేవల శివ స్వరూపమును నేను. 3. లోకములు,మాతా-పితలు నేను కాను యజ్ఞములు-తీర్థములు నేనసలు కాను సుషుప్తిలో జీవభావాతీత సత్యమును గురుదేవ! కేవల శివ స్వరూపమును నేను. 4.తర్కిమ్హు వివిధ మతములు నేనుకాను సంకల్ప-వికల్పానుభూతిని నేనసలు కాను అది నీవె అయిన అఖండ నిర్వికల్పమును గురుదేవ! కేవల శివస్వరూపమును నేను. 5.తూరుపు-పడమర దిక్కులు నేను కాను లోపల-వెలుపల నేనసలు కాను అఖండాకృతియైన అద్వితీయమును గురుదేవ! కేవల శివస్వరూపమును నేను. 6.కొలుచు వివిధ పరిమాణములు నేను కాను కొలువైన వింత వర్ణములు నేనసలు కాను సూర్య-చంద్రుల...