Tuesday, July 4, 2017

INDEPENDENCE DAY-JAI HIND

70 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
********************************************
శ్రీ పింగళి వెంకయ్యచే మంగళ సంకేతముగా
చెక్కబడిన శిల్పమురా మన చక్కనైన పతాక.
అల్లూరి వీరత్వము, ఆనందుని వివేకము
భారత భాగ్య విధానపు సౌభాగ్యము గాగ
"తాకాలనుకుంటే పీకలు కోసేస్తాం" అను
కర్తవ్యదీక్ష సాక్షి" కాషాయపు రంగు."
బాపూజీ ఆశయాలు, అమ్మ థెరెస్సా ఆచరణలు
తేటతెల్ల పరచుచున్న వెలిసిపోని వెల్లరా
"వందేం అహింసా పరమో ధర్మ:" అను
శాంతి కపోత సంకేతం "తెలుపు రంగు".
పంచభూతములు శుచిగ పంచభక్ష్య రుచులుగ
కర్షకునికి కూతురుగా,క్షుత్తునకు మాతగా
"సుజలాం,సుఫలాం,సస్య శ్యామలాం" అను
పచ్చతోరణపు కుచ్చు మెచ్చుకోలు "ఆకుపచ్చ రంగు."
నిరంతర ప్రయత్నమనే నీలివృత్త నృత్యముతో
వ్యాకులత నిర్మూలనమనే ఆకుల సమానతతో
ధర్మపు నడిబొడ్డుయైన అశోక ధర్మ చక్రముతో
జనగణమన గళముతో జనగణముల మంగళముతో
"జై కిసాన్" పొలముగ,"జై జవాన్" బలముతో
కోటలలో పేటలలో కోటి కోటి కాంతులతో
ఎగురుతోంది పతాక- ఎద నిండిన ఏరువాక.
అమ్మలార రండి రండి-అయ్యలార రారండి
పిల్లా పాపలు అందరు పరుగు పరుగున రండి
శ్రీ పింగళి వెంకయ్య,శ్రీ బంకించంద్ర చటర్జీ
శ్రీ రవీంద్ర నాథుడు, శ్రీ మహమ్మద్ ఇక్బాలు
ఎందరో మహనీయులు కొలువుదీరి ఉన్నారు
"70 వ స్వాతంత్ర జెండాను ఎగురవేద్దాము
అజెండాను తిరిగి వ్రాద్దాము
దేశభక్తి గీతాలను ఆలపిస్తుంటే వారు
ఆలకిస్తారు ఆనంద భాష్పాలతో
దేశభక్తి చేతలను ఆచరిస్తుంటే వారు
ఆశీర్వదిస్తారు హర్షాతిరేకముతో.
జైహింద్

SREE SIRIVENNELA SEETAARAAMA SASTRYJI.

PELLI PUSTAKAMU


     పెళ్ళి పుస్తకము
    ***************

  "ధర్మేచ-అర్థేచ-కామేచ
"
   నాతిచరామి అని కన్యాదాత  
  నాతి  చరితవ్యామి   అని వరుడు పలుకు

  వివాహ బంధము అనే వేద గ్రంథములో

  వధూవరులుగా మొదటి పుటలోను
  నవ దంపతులుగా  రెండవ పుటలోను
  ఆలు-మగలుగా  మూడవ పుటలోను
  అమ్మ-నాన్నలుగా  నాల్గవ పుటలోను
  అత్త-మామలుగా ఐదవ పుటలోను
  అవ్వ-తాతలుగా ఆరవ పుటలోను
  షష్టిపూర్తి రూపం లో ఏడవ పుటలోను
  తదుపరి ప్రతిపూట తన్మయపు మూటలుగా

  పారదర్శికత కలిగిన దార్శనికతో
  ఒకే ఆస మీదిగా-ఒకే శ్వాస మీదిగా
  ఒకే మాట పలుకుతూ-ఒకే బాట సాగుతూ

 "సం" పదమంటు   కదిలే "సం" సార రథ చక్రాలుగా
  ఒకరికొకరు  తోడుగా  ఒద్దికైన వేళ

 " సప్త పది" పయనము సకలాభీష్టములనిచ్చుగాక
   ముక్కోటి దేవతల దీవెనలు చక్కని పూబాట అగుగాక

  బంధుమిత్ర అభినందన సుగంధములు చల్లుగాక
  "గట్టి మేళము" ఎపుడు మీ చేయి పెట్టి నడుపు గాక

  " అర్థనారీశ్వరమై"  మీరు వర్ధిల్లెదరు గాక.

THOMAS JEFFERSON PARK


 జెఫర్సన్‌ పార్కు
**************
అందరికేమో అది ఆనందసుందరము
అందమైన మదికేమో అధ్యయనమందిరము

అందరిని అందముగ ఆదరించు మేదిని అది
ఎందరికో శాంతముగ మోదమిచ్చు బాపూజి అది

 అతివల  వలపునుదోచే అమ్మ ఒడి ఆ బడి
 గతుకుల తలపులుతోలే కమ్మనిగుడి ఆ ఒడి

కన్నపిల్లల చిన్నచిన పొరపాటును కనపడనీయదచట
తల్లడిల్లు తల్లితండ్రుల తడబాటును వినపడనీయదెచట

సఫరింగుని తొలగించే థామస్ జెఫర్సన్ పార్కు
ముఫత్గా తగిలించా నేనొక తారీఫ్‌ రిమార్కు

వస్తూనే అనుకున్నా నాకంతా తెలుసునని
చూస్తూనే తెలుసుకున్నా నాకేమి తెలియదని

చేస్తున్నా ప్రయత్నాన్ని అందరిని కలుసుకొని
వ్రాస్తున్నా అనుకొన్నది నీ విలువ తెలుసుకొని

బుధవారంనాడు తననుతెంచి మనసు తుంచినా
మంగళవారం నాటి వరకు మదిని ఆశతో పెంచుతుంది

పెనుతుఫాను సైతం నిను పెకలించలేదుకదా
గడ్డితల్లి చెబుతుంది గడ్డుసమస్యలకు అర్థం

తలవంచక తెలివితోడా మెలగుటకద పరమార్థం నా
గుడ్డితనము తొలగించిన గడ్డితల్లీ; నీ ముందు నేనెంత?

గాలమునకు పడనీయక జాలరినుండి దాచిపెట్టి
చేపతల్లికి తానే ప్రాపై బ్రోచినట్టి
నీటితల్లి చెబుతుంది పరోపకార పరమార్థం

దప్పితీర్చి,ముప్పు తీర్చు ఓ నీటితల్లీ
నీ సహాయనిరతిముందు నేనెంత?

ఆదమరువ సేదతీర్చి,మా ఊరిని మరపించి
భేదములతోపాటు మా ఖేదములను తొలగించి

మాకు ఊరట కలిగించే ,మమ్మెంతో  మురిపించే 
గారపు ప్రియ నేస్తమా ,నీ ప్రస్తుత
సేవానిరతిముందు నేనెంత?

తోచినపుడు,తోచనపుడు,తోచితోచనపుడు
తెగిడినా,పొగిడినా సాగనీ నీ పయనాన్ని
తెలివిగా మిగిలుతూ మిగలనీ నీ వినయాన్ని
అని, మా బాధలు విని బోధచేయు నీ
మేధ ముందు నేనెంత?

గురుదక్షిణగా నేను గురుతెరిగి మసలుకొంటా
పొగరుతనమును నేను చిగురునుండి తుంచుకుంటా
పలువురితో మంచితనము పదిలముగా పంచుకుంటా
నలుగురు మెచ్చే దారిలో నా నడకను సాగించుకుంటా

వాడవాడనుండి వచ్చి గోడుచెప్పువారికి
తోడునీడగా ఉండి వారి మూడు మార్చుచు
నీడవోలె మమ్మంటిన నీ మధురస్మృతులు
తోడురాగ వీడలేక అడుగుతున్నా

మాకిస్తావా సెలవిక.

E SAYAJNAANI

 శతమానం భవతి.సహస్ర చిత్ర సంగీత సామ్రాట్
 రాగం-తాలం-పల్లవి
 అనురాగపు పల్లవమై
 కోటి కోటి రాగాలను
 మీటి మనల మురిపించగ
 తరలెనేమో తాన్సేను
 తానై జ్ఞానదేశికను
........
 శుభమయ ముఖ కమలమునకు
 శృతిలయలు మధుపములుగ
 వేణువులు అణువణువణువులుగ
 జాణ వీణలు మృదుపాణులుగ
 మువ్వలసడి చిరునవ్వులుగ
 శ్వాస కోశములు నాదస్వరముగ
 శాసనములు వ్రాయసాగె...ఆ బ్రహ్మ.
 జాణ వీణలు మృదుపాణులుగ
 మువ్వలసడి చిరునవ్వులుగ
 శ్వాసకోసములు నాదస్వరముగ
 శాసనములు వ్రాయసాగె..ఆ బ్రహ్మ.
 ............
 "పంచ ముఖ" రాగ సృష్టికర్తగా
  ప్రపంచ స్వర సంధాన కర్తగా
  చినతాయమ్మాళ్ రామస్వామికి
  అవతరించెను డానియల్ రసయ్య
  పన్నైపురం పులకించెనయ్య.
  .......
  కలివిడి కనపడి
  స్వరముల సరములు అతుకగ ముడిపడి
  అందపు పొందుగ మరందము చిందగ
  నాదములన్నీ విందులుచేయగ
  ........
  మిఠాయిగా మారెను గిటారు తాను
  రాజా బాజా కాజా చేరెను
  బాదుషా బాదుషా గళమైపోయెను
  సాక్షోఫోను స్నాక్సుగ మారెను
  హార్మొని చరెను హార్మోనియము
  .........
  జనని వరము జానపదము నీ జత చేర
  సాంప్రదాయ పద్ధతిని సంప్రదిస్తూనే
  పాశ్చాత్య పద్ధతికి పట్టం కట్టావు
  నీ బోణీ బాణీ చేరింది కన్నదాసను వాణి
  అందించింది ఆ రవళి నెహ్రూకి ఘన నివాళి.
  చిలుకగా వచ్చావు చిత్రరంగము లోకి
  చిత్రంగా నీ చిలుక చిటికలే వేసింది
  పాప్,జాజ్,ఫంక్ దిస్కో ఎన్నెన్నో కోయిలలు
  కూహు కూహు అంటు నీ ముందు గొంతులు సవరించాయి
  ............
   తూర్పు పడమర సంగీత కలయిక భావము
   రాయలు ఫిలు హార్మోనిక్ సింఫనీ ఆవిర్భావము
   ఆదికవివని మురిసింది ఆసియాఖండము
   శ్రీ త్యాగరాజును కొలిచావు
   శ్రీ యోహాన్ బాకును భజియించావు
   పేరుపెట్టలేని తేరుపై
   ఇరువురిని కూర్చుండ పెట్టావు
   ...........
   నీ కలము కళకళలాడింది
   నాడోడి తెండ్రల్ అంది
   నీ గళము గలగలలాడింది
   తెండ్రల్ వందు రంగులంది
   నథింగ్ బుట్ విండ్ అంటు
   నయగారాల రాగం అంది
   చల్లగాలి సాక్షిగా మీరు
   చల్లగా ఉండాలంది
   నాలుగు దిక్కుల శుభరవాలు
   నాలుగు జాతీయ గౌరవాలు
   అలరించే ఆ నందులు
   అందాల ఆనందులు
   ప్రతిష్ఠాత్మక పద్మభూషణము
   ప్రతిభ మధుర భాషణము
  ..............
   పావలాయి పాటలలో
   పదనిసల తోటలలో
   గాత్రములు అత్తరులు
   తంత్రులన్నీ తావులు
   బృందగళ చందనములు
   నవ్వులు జవ్వాజులు
   స్వరకుస్తీలు కస్తూరులు
   సంగతులు సాంబ్రాణులు
   అన్నీ కలిసి పన్నీరును
   మేళవించి పరిమళాలు
   మరెమ్న్నో మరులుగొలిపేలా
   మంగళ వాయిద్యాలుగ

   మోగుతూనే ఉండాలని ప్రార్థిస్తూ
   .........
   సరిగమలు పలుకలేని
   సంగతులు తెలియని
    ఒక  మూగ కలం పలుకులు

VANDANAMAYYAA CHANDRAYYAA

 వందనాలు చంద్రయ్యా
*******************************
 ఆబాలగోపాలము చందమామను రమ్మనగా
 మాబాలచందురుడు ఇలకే దిగివచ్చెనుగా

 అరుదైన ప్రతిభతో తన ఆరంగేట్రముతో
 పూవాసనలందించాడు పున్నాగమన్నన్

 చిత్రసీమ దర్శకులకు కొత్త కొత్త అర్థాలుగా
 నాశరహిత కీర్తులకు నాలుగుగోడలుగా

 ఆకలిమంటలను ఆర్పిన సర్వర్ సుందరముగా
 అంటరానితనము ఆర్పు రుద్రవీణ సూర్యంగా

 స్త్రీలు స్వతంత్రులన్న సిద్ధాంతపు అబద్ధముగా
 వింతవైన అంతులేని కథల నిలువుటద్దములా

 ఇంతుల ఆంతర్యాల తెరలు రాసిన కవితలా
 పవిత్ర ప్రవృత్తి గల మా ఊరి పతివ్రతలా

 అక్రమాలను అణచగలుగు మేజర్ చంద్ర కాంతులా
 సినిమా.టెలివిజను  నీ ఇంటికి రెండు గుమ్మాలుగా

 తారాగణమును అందించిన కమ్మనైన అమ్మలా
 రహమాను జయహోల కులుకు కోకిలమ్మలా

 ప్రతిభా ప్రశంసలకు నూట్రికి నూరుగా
 పద్మశ్రీ -,ఫాల్కే పలుకరించిన దర్శకత్వ దాదాగా
 కైలాసమే విలాసమన్న మా బాలచందురిడివి
 చిరంజీవివయ్యా నీవు చిత్రసీమలోన

   వందనమయ్యా ఓ చంద్రయ్యా.

AYYAVAARKI CHAALU 5 VARAHAALU.


 పండుగ శుభములు తెలుప దండుగా వచ్చాము
****************************************
   అయ్య వారికి చాలు ఐదువరహాలు
   పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లములు
   శ్రీరస్తు శుభములకు శ్రీకారమస్తు
.  .....
  మంచికి అంకురార్పణము మొదటిదిన ప్రత్యేకత
  అపరిశుభ్ర నివారణము అదియేగ భారతము

  మదించిన రాక్షస బలము రెండవ దిన ప్రవేశిక
  అసురభావ మర్దనము అదియేగ దైవత్వము

  ఆకలి నిర్మూలనము మూడవదిన ప్రణాళిక
  అన్నపూర్ణ అవతారము అదియేగ ఆహారము

  వర్ణవ్యవస్థ నినాదము నాలుగోరోజు శీర్షిక
  కర్మ సంస్కారములు అదియేగ గాయత్రీ ప్రవేశము

  రక్తబీజ ప్రస్థానము ఐదోరోజు కదలిక
  శక్తి వాని సం హారము అదియేగ కాళికారూపము

  ప్రకృతి సేవనము ఆరోరోజు అవతారిక
 ప్రస్తుతీ అర్చనలు అదియేగ బతుకమ్మ సంప్రదాయము

  అవిద్యా నిర్మూలనమునకు ఏడవరోజు అవనిక
  సారస్వతారాధనము అదియేగ సరస్వతీ రూపము

  వర్గభేద నిర్మూలనము ఎనిమిదోరోజు కృతకృత్యత
  స్వర్గతలము భువి అదియేగ మహాలక్ష్మి ప్రసాదము
 
  ఆయుధాల పూజనము తొమ్మిదోరోజు నవ్యత
  పరిశ్రమావతరణము అదియేగ ఆదిశక్తి పరాక్రమము

  జమ్మిచెట్టు పాలపిట్ట పదోరోజు ధన్యత
  నేలనింగి కలుపుట అది యేగ సమర్థత


VENTA RAANEEYAKU SHIVAA.


" సహస్రాక్ష శతేషుధే
  అవతత్య ధనుస్తవం
  సహస్రాక్ష శతేషుధే
  నిశీర్య శల్యానం ముఖా
  శివోన సుమనా భవ."

     వెంట రానీయకు శివా
     **********************

.............
   అత్తమామలని చూడక పెత్తనాలు చేసిందా-నీ" జట"
    కడసారి  తప్పని చుట్టివేయుము శివా
     .......
  కళ్యాణమని చూడక మదనుని కడతేర్చిందా -నీ" కన్ను"
  కడసారి ప్రయోగమని దానిని తెరువనీయకు శివా
   .............
  కదన వ్యామోహమంటు నరునిపై కదిలినిదా-నీ" విల్లు"
  కడసారి ప్రయోగమని దానిని వెనుకనే దాచు శివా
  .........
  ఉదారతను కనుగొని తన ఉదరమున చేరమనెన-ఆ" గజము"
  కడసారి వరమని కరికెరిగించుము శివా
  .............
  కన్న కొడుకని చూడక కడతేర్చిందా -నీ "శూలము"
  కడసారి దుడుకని దానిని కదలనీయకు శివా
..........
  అసురుడై నిను తరిమెనా అలుముకున్న -నీ" బూది"
కడ సారి ఆట అని దాని మదమును అణిచివేయి శివా
..........
ఉద్ధరణను మతిమరచి ఉన్మత్తత ప్రదర్శించినదా-నీ కత్తి
కడసారి మత్తు ఇది దాని ప్రవృత్తి మార్చుకోమను శివా
...........
బిడ్డలము అనుకోక అడ్డముగా నరికినదా -నీ గొడ్డలి
కడసారి పదును అని దాని చివరను మొద్దుబారనీయి శివా
..........
శిశువులని చూడక అసువులు తీస్తున్నదా-నీ పాశం
 కడసారి తప్పు అని దాని నడవడిని మార్చు శివా
........
మేధలేని నాకెందుకు నీ ఆయుధాల గోల
కంటికి కాటుక అందం ఒంటికి మరికాదు శివా
......
నా విలాసమే నీకు కైలాసము కాబోగా-నీ తోడుగ
వెంట రానీయకు ముక్కంటి ఆయుధాలను శివా.
హరహర మహాదేవ శంభో: శంకర.
............

MAHILA JAEJAELU

శుభాకాంక్షలు
మహిళా..ఓ మహిళా జేజేలు

మంగళ వాయిద్యాలైన శుభవేళ
నందనమమ్మా,శుభాభినందనలమ్మా
...
అత్యంతాత్మీయతేగ అంతర్జాతీయత
మక్కువతో మొక్కుతూ నీకిచ్చింది ఒకరోజు


అమృతమథనమేగ ఆడజన్మ.ధన్యము


పాలకడలి ప్రభవించెను పసిడి మాలక్ష్మి


పాలన ప్రభలను చూపెను పడతి ఝాన్సీలక్ష్మి


అగ్నికార్య జననము ద్రౌపది జేగంటల


గణితపు అగణిత ప్రతిభగ శకుంతల


భారములే తొలగించెను భాసురముగ మోహిని


భారతీయతే చాటెను కోకిలగ సరోజిని


మాతగ ప్రతి అవతరణము కోరినది కులాసా


మానవత ప్రతికణము విశ్వమాత థెరెసా


సకలకళల సమాహార ప్రక్రియల ప్రతీక


సకలజనుల మనోహర ప్రశంసల పతాక


పుడమికి పులకింతైనది పునీతగ సీత


పురోగతికి వంతైనది ఇలలో ప్రతివనిత.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...