Tuesday, July 4, 2017

E SAYAJNAANI

 శతమానం భవతి.సహస్ర చిత్ర సంగీత సామ్రాట్
 రాగం-తాలం-పల్లవి
 అనురాగపు పల్లవమై
 కోటి కోటి రాగాలను
 మీటి మనల మురిపించగ
 తరలెనేమో తాన్సేను
 తానై జ్ఞానదేశికను
........
 శుభమయ ముఖ కమలమునకు
 శృతిలయలు మధుపములుగ
 వేణువులు అణువణువణువులుగ
 జాణ వీణలు మృదుపాణులుగ
 మువ్వలసడి చిరునవ్వులుగ
 శ్వాస కోశములు నాదస్వరముగ
 శాసనములు వ్రాయసాగె...ఆ బ్రహ్మ.
 జాణ వీణలు మృదుపాణులుగ
 మువ్వలసడి చిరునవ్వులుగ
 శ్వాసకోసములు నాదస్వరముగ
 శాసనములు వ్రాయసాగె..ఆ బ్రహ్మ.
 ............
 "పంచ ముఖ" రాగ సృష్టికర్తగా
  ప్రపంచ స్వర సంధాన కర్తగా
  చినతాయమ్మాళ్ రామస్వామికి
  అవతరించెను డానియల్ రసయ్య
  పన్నైపురం పులకించెనయ్య.
  .......
  కలివిడి కనపడి
  స్వరముల సరములు అతుకగ ముడిపడి
  అందపు పొందుగ మరందము చిందగ
  నాదములన్నీ విందులుచేయగ
  ........
  మిఠాయిగా మారెను గిటారు తాను
  రాజా బాజా కాజా చేరెను
  బాదుషా బాదుషా గళమైపోయెను
  సాక్షోఫోను స్నాక్సుగ మారెను
  హార్మొని చరెను హార్మోనియము
  .........
  జనని వరము జానపదము నీ జత చేర
  సాంప్రదాయ పద్ధతిని సంప్రదిస్తూనే
  పాశ్చాత్య పద్ధతికి పట్టం కట్టావు
  నీ బోణీ బాణీ చేరింది కన్నదాసను వాణి
  అందించింది ఆ రవళి నెహ్రూకి ఘన నివాళి.
  చిలుకగా వచ్చావు చిత్రరంగము లోకి
  చిత్రంగా నీ చిలుక చిటికలే వేసింది
  పాప్,జాజ్,ఫంక్ దిస్కో ఎన్నెన్నో కోయిలలు
  కూహు కూహు అంటు నీ ముందు గొంతులు సవరించాయి
  ............
   తూర్పు పడమర సంగీత కలయిక భావము
   రాయలు ఫిలు హార్మోనిక్ సింఫనీ ఆవిర్భావము
   ఆదికవివని మురిసింది ఆసియాఖండము
   శ్రీ త్యాగరాజును కొలిచావు
   శ్రీ యోహాన్ బాకును భజియించావు
   పేరుపెట్టలేని తేరుపై
   ఇరువురిని కూర్చుండ పెట్టావు
   ...........
   నీ కలము కళకళలాడింది
   నాడోడి తెండ్రల్ అంది
   నీ గళము గలగలలాడింది
   తెండ్రల్ వందు రంగులంది
   నథింగ్ బుట్ విండ్ అంటు
   నయగారాల రాగం అంది
   చల్లగాలి సాక్షిగా మీరు
   చల్లగా ఉండాలంది
   నాలుగు దిక్కుల శుభరవాలు
   నాలుగు జాతీయ గౌరవాలు
   అలరించే ఆ నందులు
   అందాల ఆనందులు
   ప్రతిష్ఠాత్మక పద్మభూషణము
   ప్రతిభ మధుర భాషణము
  ..............
   పావలాయి పాటలలో
   పదనిసల తోటలలో
   గాత్రములు అత్తరులు
   తంత్రులన్నీ తావులు
   బృందగళ చందనములు
   నవ్వులు జవ్వాజులు
   స్వరకుస్తీలు కస్తూరులు
   సంగతులు సాంబ్రాణులు
   అన్నీ కలిసి పన్నీరును
   మేళవించి పరిమళాలు
   మరెమ్న్నో మరులుగొలిపేలా
   మంగళ వాయిద్యాలుగ

   మోగుతూనే ఉండాలని ప్రార్థిస్తూ
   .........
   సరిగమలు పలుకలేని
   సంగతులు తెలియని
    ఒక  మూగ కలం పలుకులు

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...