TIRUVEMBAVAY-09
తిరువెంబావాయ్-09 ************ మున్నై పరం పొరుక్కుం మున్నై పరం పొరుళై పిన్నై పుదుమైక్కుం పేత్తుం ఎప్పెట్రియెనె ఉన్నై పిరారాదా పెట్రవుం శీరడియో ఉన్నడియార్ తాళ్పణివోం ఆంగవర్కెపంగవో అణ్ణవరె ఎణ్కణ్వర్ ఆవార్ అవర ఉగందు శోన్న పరిశె తొళుంబాయ్ పన్నె శెయివోం ఇన్న వగయే యమకింకోణ్ నల్గుదియేల్ ఎన్న కురయుం ఇలో ఎలోరెంబావాయ్ తిరువారూర్ పూకోవెల స్వామియే పోట్రి ******************************** మొదటి ఎనిమిది పాశురములలో చెలులు నిదురించుచున్నవారిని మేల్కొలుపుచు,వారిని శివసేవా సన్నధ్ధులను చేస్తున్నట్లుగా కీర్తించారు.కాని, తొమ్మిదవ పాశురములలో చెలులు అందరు సామి సనాతనత్వమును-సహృదయతను చాటుచు,నిత్యనూతనుడైన స్వామి నిరంతర నిష్కలంక సేవా సౌభాగ్యమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నారు. మున్నై పరం పొరుక్కుం- అన్నిటికన్నా/అందరికన్నా ముందరగా నున్నది దైవము.అది సనాతనము.మూలము.దానికి ఆది-అంతము-కాలపరిమితి లేదు. మున్నై పరం పొరుళై- బిందువు విస్తరించి వృత్తముగా మారునట్లు,మూలపదార్థము విస్తరిస్తూ,వ్యాపిస్తూ,ఎన్నో నూతన రూపములుగా ప్రకటిం...