Thursday, July 23, 2020

OM NAMA SIVAYA-69

ఓం నమః శివాయ-46
  ***************

 రూపివా/అరూపివా/అపురూపివా? శివా నీవు
 కన్నతండ్రిని చూడ నే కాశిపోవ కానరాడు

 దేవతల మోహమడచ మొదలు-చివర కానరాడు
 చిదంబరము పోయిచూడ చిన్నగను కానరాడు

 అటుచూడని-ఇటుచూడని ఆటలెన్నో ఆడతాడు
 నింగిలోకి సాగుతాడు-నేలలో  దాగుతాడు

 అగ్గినంటి ఉంటాడు-గాలినేనే అంటాడు
 జ్యోతిని నేనంటాడు-ప్రీతిని నీకంటాడు

 ఈ వలసలు ఎందుకంటే చిద్విలాసమంటాడు
 దాగుడుమూతలు ఆడుతు  పట్టుకోమంటాడు

 సుందరేశ్వరడునంటాడు ముందున్నానంటాడు
 ఒక్కరూపునుండవేమిరా ఓ తిక్కశంకరా.

OM NAMA SIVAYA-68


 ఓం నమః శివాయ-68
 *****************

 మాతంగపతిగ నువ్వుంటే ఏది రక్షణ వాటికి?
 గణపతి అవతరించాడు కరివదనముతో

 అశ్వపతిగ వుంటె నీవు ఏదిరక్షణ వాటికి?
 తుంబురుడు వచ్చాడు గుఱ్ఱపు ముఖముతో

 నాగపతిగ ఉంటేను ఏది రక్షణ వాటికి?
 పతంజలి వచ్చాడు మనిషి ముఖముతో

 వానరపతిగ ఉంటేను ఏది రక్షణ వాటికి?
 నారదుడు వచ్చాడు వానర ముఖముతో

 సింహపతిగ ఉంటేను ఏది రక్షణ వాటికి?
 నరసింహుడు వచ్చాడు సింహపు ముఖముతో

 పశుపతిగ నీవుంటే అశువులకు రక్షణలేదని
 ఒక్కటే గుసగుసలు ఓ తిక్కశంకరా.

 శివుడు తాను పశుపతినని,వాటిని సంరక్షిస్తానని చెప్పుకుంటాడు కాని కళ్ళెదురుగానే శిరము వేరు-మొండెం వేరుగా ఎన్నో రూపములు కనిపిస్తూ,శివుని చేతగానితనమును ఎత్తిచూపిస్తున్నాగాని కిమ్మనక ఊరుకుంటాడు కాని దురాగతములను ఆపడు.-నింద.తాను కూడ శరభ రూపమును ధరించి మరొక్కసారి ఋజువు చేసాడు.

 శిరము నమః శివాయ-మొండెము నమః శివాయ
 పశువు నమః శివాయ-మనిషి నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.


 " ఛందఃశాఖి శిఖాన్వితైర్ద్విజవరైవరైః సంసేవితే శాశ్వతే
   సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే
   చేతః పక్షిశిఖామణే త్యజవృధా సంచార మంత్యైరలం
   నిత్యం శంకర పాదపద్మ యుగలీనీడే విహారం కురు."

     శివానంద లహరి.

  మనసా! నీ అవివేకపు ముసుగును తొలగించి  అన్నిటింలో శివస్వరూపమును దర్శించుటకు ప్రయత్నించు.స్వామి నిరాకారుడు.ప్రకటింప బడుతున్న-ప్రకటించేయ బడుతున్న ఈ బాహ్య ఆకారములు స్వామి లీలలనె విభూతులు.కనుక నీవు వ్యర్థముగా అటు-ఇటు సంచరించకు.శంకరుని పాదపద్మములనే శుభప్రదమైన గూటిలో  విహరించు.ఎందుకంటే ఆ గూడు వేదములనే చెట్టును ఆశ్రయించుకొని యున్న,వేదాంతము అనే కొమ్మలతో,వాని వాలి యున్న మంచి పండితులనే పక్షులతో ప్రకాశిస్తుంది.అనుగ్రహమును ప్రసాదిస్తుంటుంది.-స్తుతి.

   ఏక బిల్వం శివార్పణం.

OM NAMA sIVAYA-67


   ఓం నమః శివాయ-68
   *****************

 పాశము విడువనివాడు యమపాశము విడిపించగలడ
 గంగను విడువని వాడూ నా బెంగను తొలగించగలడ?

 మాయలేడిని విడువని వాడు మాయదాడినెదిరించగలడ
 పాములు విడువని వాడు పాపములను హరించగలడ?

 విషమును విడువనివాడు మిషలను కనిపెట్టగలడ
 ఉబ్బును విడువనివాడు నా జబ్బును పోగొట్టగలడ?

 నృత్యము విడువనివాడు దుష్కృత్యములను ఆపగలడ
 భిక్షాటన విడువని వాడు శిష్టరక్షణమును చేయగలడ?

 చిన్ముద్రలు విడువని వాడు ఆదుర్దా గమనించగలడ
 వింతరాగమున్నవాడు వీతరాగుడవుతాడ?

 కానేకాడంటు బుగ్గలు నొక్కుకుంటున్నారురా
 చుక్కచుక్క నీరు తాగు ఓ తిక్కశంకరా


 శివుడు అమ్మ పార్వతిమీది ప్రేమను వదిలిపెట్టలేడు.గంగను వదలలేక గట్టిగానే బంధించాడు.మాయలేడిని చేతినుండి జారనీయడు.విషమును-భిక్షాటనను-నృత్యమును అసలే వదిలిపెట్టలేడు.వీటన్నిటిని మించి,ఎన్నిసార్లు అనుభవమైనా పొగత్లకు లొంగిపోతుంటాడు.మాయామోహితుడైనప్పటికిని తాను మాయా రహితుడనని చెప్పుకుంటాడు కనుక శివుడు  విషయవాసనలను జబ్బును తగ్గిస్తాడని నమ్మకము లేదు.-నింద.

 విషము నమః శివాయ-మిషలు నమః శివాయ
 పాశము నమః శివాయ-పార్వతి నమః శివాయ

 నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ


 " ఆకాశేన శిఖీ సమస్త ఫణినాం నేత్రాకలాపీనతా
   సుగ్రాహి ప్రణవోపదేశ నినదైః కేకేతియో గీయతే
   శ్యామాం శైల సముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా
   వేదాంతోపవనే విహార రసికం తం నీలకంఠం భజే."

   శివానంలహరి.

  నల్లని కంఠముతో, ఆకాశమును పింఛముగా ధరించి ప్రకాశించుచున్న నెమలి అను శివుడు,పార్వతీదేవి అనే నల్లని మేఘకాంతిని చూసి,సంతోషముతో నర్తించుచు,వేదాంతమనే ఉద్యానవనములో విహరించుచు,ఆనందించుచున్నది.అట్టి పవిత్ర పాశబంధితులైన పార్వతీపరమేశ్వరులు,మనలనందరిని రక్షించెదరు గాక.

 మాతాచ పార్వతీదేవి-పితాదేవో మహేశ్వరః
 బాంధవా శ్సివభక్తాశ్చ-స్వదేహో భువనత్రయం.

  ఏక బిల్వం శివార్పణం..

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...