Saturday, October 5, 2019

 పదిశక్తుల పరమార్థము- ఎనిమిదవశక్తి-బగలముఖి
 ****************************************

   అమ్మ దయతో ఈరోజు మనము ఎనిమిదవ మహాశక్తియైన బగళాముఖి తత్త్వమును తెలిసికొనుటకు ప్రయత్నిద్దాము.తల్లిరూపములో మనము చూడగలిగిన పీతవర్ణము-ఎడమచేతిలోని అసురశిరము-తల్లి తాడుతో వాని వాగ్శక్తిని బంధించుట తల్లి మనకు అందిస్తున్న దృశ్య సహకారములుగా,ఎందరో జ్ఞానులు నొక్కివక్కాణించిన స్తోత్రనిధులు మరింత సహకార పరికరములుగా,పరమేశ్వరి ప్రసాదములుగా మనము స్వీకరించగలిగినపుడు అమ్ములోని మూడు ప్రత్యేకతలను మనము చూడకలుగుతాము.(మనసుతో)

 అవి వాణిరూపమైన తల్లి వాగ్బంధనశక్తి.సిధ్ధిప్రదాత్వము ఆ రెండింటిద్వారా పరోక్షప్రీతికారిణిగా ప్రసిద్ధికెక్కుట.

   వాక్బంధనము

  దండనాథా పురస్కృతా గా తల్లి కీర్తింపబడుచున్నది.దండించినది దేనిని?
  దేవీపురాణకథనము ప్రకారము దుర్గముని (అసురుడు) కుమారుడైన రురు తన సైన్యముతో తల్లిపై దండెత్తినాడు.ఇది బాహ్యము.ఉదాహరణకు అధిక వర్షముల వలన జలప్రవాహము హద్దులుదాటి ఉద్రిక్తతతో విలయమునకు కారణమవుతుంటే దానిని ఆపవలసినదే కదా.ఇక్కడ మన సమస్య జలముతో కాదు.ఆ సమయమున దానికున్న ఉద్రిక్తత.అదేవిధముగా ఇక్కడ వర్షములు అరిష్డ్వర్గములు,హద్దులు దాటుట వివేకమును వీడుట దాని వలన కలిగేది నాశనమే.అందు వలన తల్లి తన బగలతో(తాడు) ఉద్రిక్తతను బంధించుచున్నది.భావనాశక్తిని-వాక్శక్తిని నియంత్రిస్తోంది.ఆ బంధనము మనకు సిధ్ధులను అనుగ్రహిస్తున్నది.



  సిధ్ధిధాత్రి
  చేస్తున్నది బంధనము.చెబుతున్నది ఆ బంధనము మనకు సిధ్ధులను అనుగ్రహిస్తుందని.ఉద్రుత జలప్రవాహమును దారిమళ్ళిస్తున్నది ఆనకట్టలలోనికి.జల సముదాయమును నిలువచేసి జలశక్తులను మన జీవనమునకు అనుగ్రహిస్తున్నది.

  పరోక్షప్రీతిదాయిని

  తల్లి నీటి ఉద్రిక్తతను బంధించినది.దాని దారి మళ్ళించినది.ఒక జలాశయముగా తీర్చిదిద్దినది.ఇది ఏ విధముగా మనకు సహాయము? తల్లి ఆ నీటిని పంటపొలములకు మళ్ళిస్తూ,తాగునీటికి తరలిస్తూ తన గతుల-నడకల ద్వారా స్థితిని (పోషణను) కలిగిస్తోంది.

    పరోక్షము-ప్రత్యక్షము అను ద్వంద్వములు లేవని,అవి నిర్ద్వంద్వ యైన తల్లి రక్షణా తత్త్వములోని వివిధకోణములుగా అర్థముచేసుకోగలితే తల్లి మనలోని చెడుభావముల ద్వారా వెలువడు వాక్కుల ఉద్రుతమును బంధించి,వివేకమను ఆనకట్టలో మనశక్తిని నిలువచేసి విశ్వకళ్యాణమనే పంటచేలవైపు మళ్ళిస్తుంది.

  బగళాముఖి చరణారవిందార్పణమస్తు.



 

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...