Tuesday, December 21, 2021

PASURAMU-06

తిరుచిట్రంబలం-పాశురము-06 **************************** మానే నీ నెన్నలై నాళివన్ దుంగళై నాణే ఎళుప్పువన్ ఎన్రళుం నాణామే పోనది శై పగరార్ ఇన్నం పులర్దిండ్రో వాణే నిలానే పిరవే అరివరియాన్ దానే వందెమ్మై తలయెడిత్తాల్ కొండొరుళుం వాణ్వార్ కళల్ పాడి వందోర్కుం వాయ్ తిరవాయ్ ఊనే ఉరుగాయ్ ఉనక్కే ఉరుం ఎమక్కుం ఏనోర్కుం తంగోనై పాడేలో రెంబావాయ్ నిజమేదో కల్లయేదో నీలకంఠుండెరుంగు ********************************** అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు ఇతరులెరుగక యున్న ఈశ్వరుడెరుగడా, అని వేమన నుడివి నట్లు ,తిరుమాణియవాచగరు మేల్కొలుపబడిన చెలుల వాక్చాతుర్యమును వివరిస్తూనే,ఒకామె తిత్తిక్క పేశువాయ్-వట్టి మాతలను మాత్రమే చెప్పినదని,మరొకామె పాలూర్ తేన్ పేశుం తేనెలో పాలలో నానిన పదార్థములు ఎంత మధురముగా ఉంటాయో వాటికంటె మధురమైన మాటలను మాత్రమే పలికినదని,ప్రస్తుత పాశురములోని చెలి,వీరిని మించిన వాక్చాతుర్యముతో తాను ముందటిరోజే వారి దగ్గరకు వెళ్ళి,తానే వారి నిదురను మేల్కొలుపుతానని చెప్పినది.కాని కార్యాచరణము జరుగలేదు. నీలవేణి మాటలు నీటిమూటలు-అన్నట్లుగా త్రికరణములలోని మనసు-వాక్కు-కర్మలలోని రెండును తటస్థముగా నుండి వాక్కును మాత్రమే అందించుచున్నది. కనక చెలులు ఆమెను, మానే నీ-లేడి వంటి చురుకుదనము కల సొగసరి, నీ-నీవు నెన్నెలె-నిన్ననే నాళై వందు-నాకు నేనుగా మీ దగ్గరకు వచ్చి ఉంగళై-మీ దగ్గరకు నాకు నేనుగా వచ్చి ఎళుప్పవన్-మిమ్ములను మేల్కొలుపుతాను అన్నావు. ఈ చెలి చురుకుదనముతో-వాక్చాతుర్యముతో కూడిన లావణ్యవతి. కాని ఆడితప్పరాదు అన్న సూక్తిని మరచి,ఆదమరచి హాయిగా నిదురించినది. చెలులు వచ్చి ఆమె పలుకులను గుర్తుచేసినప్పటికిని కొంచమైనను నొచ్చుకొనుట లేదు తన ప్రవర్తనకు. అదిగమనించిన చెలులు-ఎండ్రలుం నాణామే, కొంచమైనను సిగ్గుగా లేదా స్వచ్ఛందముగా చేస్తానన్న పనిని చేయలేనందులకు నాణామే-అవమానముగా అనిపించుటలేదా శివారాధనను మరచినందులకు అని నిందిస్తున్నారు. ఇక్కడ మనము ఒక విషయమును గమనిస్తే తిరుమాణియవాచగర్ ఆమెను మానే అని ఎందుకు సంబోధించారో అర్త్థమవుతుంది. మా కురు యవ్వన సంపద గర్వం---హరతి నిమేషా కాలాన్ సర్వం కనుక నీలోని శక్తిని నీలకంఠుని సేవకు వినియోగించుకో చెలి అని హెచ్చరిస్తున్నారు. నీ వాక్కులు వాగర్థములైన పార్వతీపరమేశులుగా ప్రస్తావింపబడి/ప్రశంసింపబడాలి కాని వ్యర్థము కాకూడదు. చెలి నిన్న నీవు మమ్ములను వచ్చి మేల్కొలుపుతానని మాటలు, పొనదిశై పగరార్-ఎటువైపు వెళ్ళినవో నీకే తెలియదుకదా. అనగా వ్యర్థములైనవి కదా , ఇలా కర్తవ్యమును మరచియుండుట, ఊనే ఉరుగాయ్-నీకు మాత్రమే చెల్లినది. కనుకనే, ఇన్నం పులందిండ్రో-ఇంతగా వెలురేఖలు వ్యాపించినప్పటికిని,నీవు కదిలి రాలేక యున్నావు. అదిగో బయటకు చూడు, ఎందరెందరో భక్తులు,స్వామి వాణ్వార్ కళల్-పవిత్ర పాదపద్మములను స్మరిస్తూూ,తరిస్తూ,దర్శిస్తూ, పాడి-సంకీర్తనమును చేస్తూ, వందోర్కుం-వస్తున్నారు. పరమేశుడు, ఉనక్కేం-నీకు మాత్రమే కాదు ఎమక్కోం-మనకు మాత్రమే కాదు అందరిని అనుగ్రహించుతకు, తలై ఎళిత్తు-మనలను ధర్మ మార్గమున నడిపించుటకు/ధర్మమూ పరిరక్షించుటకు, ఆట్కొండ అరుళంం-అరుళం ం-ఆశీర్వచనములను ఆట్కొండ-తనతో పాటుగా తీసుకుని, తానే వందు-తనకు తానుగా తరలి మన దగ్గరకు వచ్చాడు తం మనలనందరికి కోనై-సంరక్షకుడు/ప్రభువు ఆ స్వామి ఉనికిని కనుగొనుటకు ముందు ఎందరో అహముతో, వానే-ఆకాశ మార్గమతా, నిలవే-భూలోక మార్గమంతా పిరవే-మిగిలిన మార్గములనీ తేడి తేడి-వెతికి వెతికి కనుగొనలేకపోయిరి అన్న విషయము నీకు తెలుసుకదా. స్వామి కేవలము మనమీది అవ్యాజ అనుగ్రహముతో ఆశీర్వచనముగా /మనలను ఆశీర్వదించుటకు /అనుగ్రహించుటకు . తనకు తానే తరలివచ్చినాడు. వాయ్ తిరవాయ్- గాత్రమును సవరించుకొని కీర్తించు. మనమందరము త్రికరణములను శుధ్ధము చేసుకొని స్వామి పాదములను అర్చించి అనుగ్రహపాత్రులమగుదాము అంటూ ఆ చెలిని తమతో కలుపుకొని మరొక చెలిని మేల్కొలుటకు అడుగులను కదుపుచున్నారు. అంబే శివే తిరువడిగళే శరణం.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...