Posts

Showing posts from July 14, 2022

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

Image
1. సుందరి సుమంగళి నిరంతరి దురంధరి జ్యోతిస్వరూపమే నీవు శుక్రవారమునాటి నీదివ్యదర్శనము కిల్బిషము కడతేర్చునమ్మా నీ పాద చింతనమే భవతాపహరణము భావనామాత్ర సంతుష్టవు జగమంత నీ మాయలో మునిగిన తరుణాన నేనేమని కీర్తించగలను నీ సొంత సంతతిని వేగమే రక్షించు బిరుదు నీకున్నదమ్మా శివ శివ మహేశ్వరి పరమనిలయేశ్వరిశిరోన్మణి మనోన్మణియు నీవే శాంకరి శుభంకరి యశోధరి పరాత్పరి అనాధరక్షకియు నీవే అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే. **** 2. ముత్తైదువ మెట్టెలు పావనపాదముల ప్రకాశముల దండగొలుసు చీల మండలమున పచ్చ వైఢూర్యముల మువ్వల సవ్వడులును ముత్య ముక్కుపుడక రత్తన పతకములు హారములు కడుసుందరం గరళకంఠుని సతిగ మంగళముగ అలరారు తాళి ఘనము శరణన్న వినిపించు చెవులకు కమ్మలు కరుణకరముల కంకణములు జగములన్నింటికి వెలుగుతానైనది జనని నీ వదన మిహిర. అత్తి వరదుని చెల్లి శక్తి శివ రూపిణివి అథముడిని వర్ణింపగా అవ్యాజ కరుణతో కాంచిలో కొలువైన అమ్మ కామాక్షి ఉమయే *********** 3.నిన్ను నెరనమ్మి నీ పాదాలపై వాలి శరణుశరణన్నగాని తగదమ్మ నామీద కనికరమునే మరువ,తాత్సారమది యేలనో కఠినాత్మురాలవను విషయము తెలియక మనసార నమ్మినానే క్షిప్రప్రసాదినిగ దాసుని రక్షింప జాగు...

KAMAKSHI-KAMADAYINI

Image
    అమ్మా! కామాక్షి శరణం.   ************************* శ్రీ మాత్రే నమః ************* " శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయేత్" భగవత్స్వరూపులారా! నమస్కారములు. వాచక-కాయక-మానసిక పాపశేషములు జీవులను జన్మ అనే గుంజకు కర్మ అనే పాశముతో కట్టి,జనన-మరణ చక్రములో దారి-తెన్ను లేక తిరుగుతుండేలా నిర్దేశిస్తాయి.అమ్మలకన్న అమ్మ తన అవ్యాజకరుణతో (కరుణించుటకు మనకు ఏ అర్హత లేనప్పటికిని)మనలను ఉధ్ధరించుటకొక ఉపాధిని అనుగ్రహించి,మన కదలికలను ధర్మబధ్ధముగా జరుపుతు,మనలో మార్పులు తెస్తూ-తెస్తూ,ఏ మార్పులేని స్థితిని చేరుస్తుంది.పాశములను తొలగించివేసి,పశుపతితో/పశుపతిలో పరవశమయే భాగ్యమును ప్రసాదిస్తుంది. తల్లి నిర్హేతుక కృపాకటాక్షమేమో,ఏ మాత్రము పట్టులేని నా చేతిని పట్టుకుని, ద్రవిడభాషా శిరోభూషణములైన కామాక్షి అమ్మ విరుత్తము-నటరాజ పత్తులను స్పూర్తులుగా అనుగ్రహించి,ప్లవ నామ సంవత్సర దేవీ శరన్నవరాత్ర పుణ్యసమయమున, తమిళము నా మాతృభాష(తాయి మొళి) కాకపోయినప్పటికిని,వాటి అద్భుతానుగ్రహములను అందరికి పంచవలెనను చిన్న కోరికను నా మనసులో చిగురింపచేసి, " కామాక్షి-కామదాయిని" అను త...