నః ప్రయచ్చంతి సౌఖ్యం-24
*******************************
" ఊర్థ్వమూలం అథః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం
ఛందాసి యస్య పర్ణాని యస్తం వేద స దేదవిత్."
ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా,బ్రహ్మయే ముఖ్య శాఖలుగా,వేదములే పర్ణములుగా గల ఈ సంసారరూప అశ్వస్థవృక్షమునకు నమస్కారములు.దానిని మూలసహితముగా తెలిసికొన్నవారికి నమస్కారములు.
భగవంతుడు-భక్తుడు ఇద్దరు వృక్షములను రక్షించువారే.
' నమో వృక్షేభ్యో హరికేశభ్యః."
నింగి-నేలలను అనుసంధించే పరమేశ్వరుని అద్భుత ఆవిష్కరణలు వృక్షములు.చేతనాచేతనత్వములను భగవత్ప్రసాదములుగా కలిగినవి.కాండం అచతనమై-పై భాభాగములు చేతనత్వముతో చల్లని ప్రాణవాయువును అందించుచు పరమేశ్వర ప్రతి రూపములు.
సింధునాగరికతయు వృక్షపూజను నిర్వహించినదని,నాటి నుండి వృక్షములలో ఆధ్యాత్మికత ప్రాధాన్యత పరిశోధకులు కాదనలేని ప్రాధాన్యతను సంతరించుకున్నది.
జమ్మిచెట్టు,మారేడు చెట్టు,తెల్ల మద్దిచెట్టు,నేరేడు చెట్టు,ప్రత్యేకముగా ఉసిరి చెట్టు దైవస్వరూపములుగా ఆరాధనలనందుకుంటున్నాయి.
వృక్షో రక్షిత రక్షితః.
స్థితికారుడుగా పరమాత్మ విశ్వపాలన చేయుటే వృక్షరక్షణ.దానిని పోషించునవి హరికేశములు.
.ఆకుపచ్చని కొమ్మలు-రెమ్మలు.పువ్వులు-పండ్లు.ఆచ్చాదనయే పరమాత్మ తత్త్వము.విజ్ఞానమనెడి వృక్షము రుద్రుడైనప్పుడు వేదములు-వేదాంగములు హరికేశములు.దానిఆకులు-కొమ్మలు.శ్రీశైల పర్వత ప్రాంతములో వృక్షములు జరుగుట ఎందరో మహానుభావులు దర్శించినారట." ఊర్థ్వమూలం అథః శాఖః" అని శ్రీక్రిష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించినాడు.మహాభారతములోను ధర్మరాజు ధర్మవృక్షముగాను,తమ్ముళ్ళు దాని శాఖలుగాను ,అదేవిధముగా దుర్యోధనుడు అధర్మ వృక్షముగాను వర్ణించబడినారు.పవిత్ర మర్రివృక్షము క్రింద స్వామి దక్షిణా మూర్తిగా దర్శనమిస్తున్నాడు.శ్రీశైలములో తెల్లమద్దివృక్షము శివస్వరూపమని నమ్ముతారు.మరియు త్రిగుణాతీత వృక్షముగా బిల్వవృక్షము లక్ష్మీదేవిచే సృష్టించబడినదట.అమ్మవారు స్వామివారి గురించి చూతవృక్షము క్రింద ఆసీనురాలై అత్యంతశ్రధ్ధాభక్తులతో తపమును సలిపినదట.సంసారమనెడి వృక్షమునకు సకలము తానైన వాడు సదాశివుడు.
" నమః శుష్క్యాయచ హరిత్యాయచ." ఎండిన-పచ్చని ఆకులరూపమైన రుద్రునకు నమస్కారములు.
ఈశావాస్యమిదం సర్వం అను ప్రగాఢ విశ్వాసముతో భక్తులు మహాశివుని విశ్వసించుసమయమున శివలీలయన జైనము విస్తరించి పరమాత్మ తత్త్వమును ప్రశ్నించుచున్న రోజులవి.రెండు వర్గములుగా చీలిన ప్రజలు తమ విశ్వాసమే గొప్పదని నిజమని నమ్ముటయే కాక అన్యమును అంగీకరించలేని సంకుచిత మానసిక స్థితిలో,యుక్తా యుక్తములను మరచి పరస్పరము దూషించుకొనుచుండిరి.
" జ్యేష్ఠంచమే ఆధిపత్యం చ మే మన్యుశ్చ మే "
మమ్ములను కాపాడుమని-అనుగ్రహమును ప్రసాదించుమని పరమతసహనములేని జైనుల పాలనలో నున్న శివభక్తులు ప్రార్థించుచున్న పరిస్థితులవి.
కోవూరు బ్రహ్మయ్య అను పరమ పరమేశ్వర భక్తుడు,జ్యేష్ఠుడు-కనిష్ఠుడు,పూర్వము-పరము,సోభ్యము అనగా పుణ్య-పాప మిళితమైన మనుష్యలోకము సర్వము శివమయముగా భావించుచు భక్తితో బసవని కొలుచుచుండెను." నమః శంభవాయచ -మయస్కరాయచ" ఇహపర సుఖములనందించు ఈశ్వరా! నమస్కారములు.అని స్తుతించుచున్న సమయమున పరమత ద్వేషముతో బ్రహ్మయ్యను దుర్భాషలాడుటయే కాక ఆరాధ్యదైవమును అవహేళన చేయసాగిరి.అందులకు నొచ్చుకున్న బ్రహ్మయ్య స్వామి అందరిపై 'మీడుష్టమ
శివతమ శివోనస్సుమనా భవంతు" అని ప్రార్థిస్తూ,అ గ్రామమును వదిలి పొరుగూరికి వెళ్ళిపోవుటకు నిశ్చయించి అడుగువేయసాగాడు.శివ సంకల్పమస్తు.సివానంద ప్రాప్తిరస్తు అన్న శివాశీర్వచనముతో కదులుచున్న బ్రహ్మయ్యవెంత వెంట " గణేభ్యో-గణపతిణ్యో' అనేక శివగణములు,వ్రాతేభ్యో-వ్రాతపతిభ్యశ్చ నమోనమః" అనేకవ్రాతములు అనుసరించినవి ఆనందముతో.ధర్మ సంస్థాపనకు తరలుచున్నది కందర్పదర్పుని కుటుంబము.
"నమః సస్పింజరాయ త్విషీమతే పత్తీనాం పతయే నమః
వారిని అంగరక్షకుడై అనుసరిస్తున్నాడు ఆ మార్గములకు అధిపతి.
వారు పొరుగూరు వెళుతూ దారిలో ఒక మర్రిచెట్టు క్రింద విశ్రాంతి తీసుకొనుటకు కూర్చున్నారు
భక్తుల కొరకు మార్గములకు అధిపతి క్షత్రాధిపతిగా తన కర్తవ్యమును మార్చుకున్నాడు.అసలే సాత్త్వికులైన తన భక్తుల వెంట పరుగెత్తే ప్రథముడు.
.శివనామ స్మరణను మాత్రము మానలేదు.ఇంతలో ఒక చిలిపి ఆలోచనవచ్చింది పరమేశ్వరునికి." నమః శర్వాయచ పశుపతయేచ" అక్కడికి వచ్చిన ఒక జైనుడు వెర్రి నమ్మకమును వమ్ముచేసి,అవమానించాలనుకున్నాడు.హింసా ప్రవృత్తి చోటుచేసుకుంది.
నమో ఘొరేభ్యే అఘోరేభ్యో ఘోరాఘోర తరేభ్యో నమోనమః.
జైనుల లోని ఘోర రూపమునకు శైవుల లోని అఘోర స్వరూపమునకు సర్వవేళలా తానైన ఘోరఘోర స్వరూపమునకు త్రికరశుధ్ధితో నమస్కారములు.
బ్రహ్మయ్యను సమీపించి మీరునమ్మిన రుద్రుడు పక్షులతో నిండిన పచ్చని మర్రిచెట్టును బూడిదచేస్తే,తిరిగి దానిని జీవింపచేయగలడా? దానిపై నున్న పక్షుల సంగతి ఏమిటి? పశుపతి అని పూజించే మీ దేవుని మహిమలు చూపించగలరా? అంటూ వారిని రెచ్చగొట్టాడు.ఘోరములోనే అఘోరము మరినదా అన్నట్లు,బ్రహ్మయ్య ఎంతో వినయముతో ."
నమో రోహితాయ స్థపతియే వృక్షాణాం పతయే నమః" అని స్తుతిస్తూ పరమేశ్వరుడు పచ్చదనమును అందించే ప్రఖ్యాత శిల్పి.తనశిల్పకళా చాతుర్యముతో పదునాలుగుభువనములను సృష్టించి పరిపాలించుచున్నాడు.పరమకరుణాంతరంగుడు.మేము ఈ వృక్షమును భస్మీపటలముచేయము.హరితము హరుని పూజకు నోచుకున్నదని హస్తి సేవించి తరించినదని బదులిచ్చిరి.క్షుల్లకేభ్యుడైన జైనుడు తాను మర్రిచెట్టును బూడిదచేసి తిరిగి పచ్చనిచెట్టుగా మార్చమని బ్రహ్మయ్యను రెచ్చగొట్టెను.
యేషాం పురుషానాం యేషాం పశూనాం ---- కించనా మమత్.
అచంచలవిశ్వాసముతో బ్రహ్మయ్య ఆ విభూతిని స్పర్శించి " ఓం నమో భవాయచ-రుద్రాయచ" ఓ రుద్రా రోదనమునకు కారణము నీవే.దానిని పోగొట్టువాడవు నీవే.ఈ దురాగతమును క్షమించి,అభము-శుభము తెలియని ఆవృక్షమును రక్షించి,అహముతో కనులు మూసుకొని పోయిన వీరిని కరుణించుం.' నమో యామ్యాయచ-క్షేమ్యాయచ" పాపమును నశింపచేసి-పశ్చాత్తాపుని పాలించుము అని ప్రార్థనలు సలుపగానే పచ్చనివృక్షము పక్షులతో నిండి పరమేశ్వర తత్త్వమునకు ప్రతీకగ నిలిచినది.
మారేడు నీవని నీ సేవచేయ మారేడు దళములు నీ పూజకు పరమేశా!
పంచభూతేశ్వరుడు ప్రపంచమును రక్షించుగాక.
స్వామి బిల్వార్చనకు రేపు కలుసుకుందాము.
( ఏక బిల్వం శివార్పణం)
( ఏక బిల్వం శివార్పణం.)