SAUNDARYA LAHARI-27
దాస్యము పరమపావనమైన నీ పాదరజకణము పతిత పాలకమైన పరమాత్మ స్వరూపము ఉద్ధరిస్తుందంట ఉలిదెబ్బలు తిన్నబొమ్మ పుడమిని పాలిస్తుందంట పూజలందుకుంటున్నదమ్మ అడుగుతడబడనీయదట ఆరడుగులు లేనిబొమ్మ కరుణను కురిపిస్తుందట కనురెప్పలు వేయదమ్మ చేయందిస్తుందట చలనమేలేని బొమ్మ రాతను మారుస్తుందట రమ్మని ఈ రాతిబొమ్మ అమ్మలను గన్నయమ్మ ఆ మల గన్న అమ్మ నా అపహాస్యములన్నీ దాస్యములగుచున్న వేళ నీ చెంతనే నున్న నా కేలు విడనాడకమ్మా,నా మానసవిహారి ఓ సౌందర్య లహరి. "జనని వరదాయిని త్రిలోచని నీ పద దాసిని కావగదే."అని తల్లిని వేడుకొనిన లీలావతి (ప్రహ్లాదుని మాత) దాసినని స్వచ్చందముగా ప్రకటించినది. " బంటు రీతి కొలువు ఈయవయ్య రామా" అని త్యాగరాజు కీర్తించినాడు.ఆంజనేయ స్వామితో పాటు తనని కూడ దాసునిగా స్వీకరించమని ప్రార్థన. బానిసత్వము దాస్యము రెండు వేరు వేరు అర్థములనిచ్చు ఒకటిగా తోచు పదములు.పుట్టు బానిస/కట్టుబానిసలు తమ అభిప్రాయముతో నిమిత్తము లేకుండా ...