Monday, May 27, 2024

SARVASIDDHIPRADACHAKRAMU-PARICHAYAMU


 


 " మహా బుద్ధిః మహాసిద్ధిః మహాయోగేశ్వరీశ్వరీ"


    అనుగ్రహముతో,సాధకుడు సర్వసిద్ధిప్రద చక్ర ప్రవేశముబకు యోగ్యతను పొందగలుగుతాడు.

   అదియును,

 " నీరాగా రాగమదనీ-నిర్మదా మదనాశినీ

   నిశ్చింతా-నిరహంకారా-నిర్మోహా మోహనాశినీ

   నిస్సంశయా సంశయఘ్నీ-నిర్భవా భవనాశినీ"

      కరుణా కటాక్షమే.

 వ్యాపినీ వివిధాకారా విద్యావిద్యా స్వరూపిణిగా/వ్యక్తావ్యక్తస్వరూపిణిగా నున్న పరమాత్మ,

 ప్రకాశమైన శివతత్త్వము+విమర్శరూపమైన శక్తి తత్త్వము అవ్యక్తమైన బిందురూపముగ విరాజమైనప్పటికిని సృష్టిచేయు సంకల్పముతో విమర్శ తాను ప్రకాసము నుండి విడివడి,ఇచ్ఛా-క్రియా-జ్ఞానశక్తులను బిందువులను కలుపుతూ అథోముఖ త్రికోణముగా ప్రకటనమైనది.ఇది మొదటి శక్తి కోణము.దీనికి తక్కిన కోణములతో సంబంధము కానరాదు.

 ఈ మూడు శక్తులనే ,

1,మహా కామేశ్వరి

2.మహా వజ్రేశ్వరి

3.మహా భగమాలినిగా

   సంకీర్తిస్తారు.

 స్థూలములోని శక్తి కామేశ్వరి అయితే సూక్ష్మములో సామీప్యములోని యోగిని మహాకామేశ్వరి.ఈ తల్లినే బ్రహ్మీ శక్తిగాను ఆరాధిస్తారు.దేవీ భాగవత్ములో,

"సంపత్కరీ సమారాధ్యా సింధుర వ్రజసేవితా" అని సంపత్కరీదేవిగా కొలుస్తుంది.

  మదముతో కూడిన మనోభావములను నియంత్రించే మహేశ్వరి.

   మహావజ్రేశ్వరి స్థితికారిణి యైన వైష్ణవీ శక్తిగా విశ్వపాలనశక్తిగా ఆరాధిస్తారు.దేవీ భాగవతము,

 "అశ్వారూఢాధిస్ఠితాశ్వ కోటికోటిభిరావృతా"గా అశ్వవాహినిగాను ప్రస్తుతిస్తున్నది.అచంచలమైన మనోభావములను అదుపుచేయు అమ్మ అశ్వారూఢా.

  మహా భగమాలిని సమ్హారిణి శక్తిగా సంస్తుతిస్తారు.ఈ తల్లియే,

"కిరిచక్ర రథారూఢా-మంత్రిణిపరిసేవిత యైన వారాహిదేవి.

  ఊహాత్రికోనములో నున్నఈ మూడు శక్తులు పరాశక్తులు.

    ఊహా త్రికోణము చుట్టు ఆవరించియున్న ఊహా చతురస్రాకారమునాలుగు దిక్కులలో నాలుగు ఆయుధశక్తులు సాధకుని సహాయపడుతూ తురీయస్థితికి చేర్చుతుంటాయి.అవియే

"మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకలు"

 "రాగ స్వరూపపాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వలా" గా కీర్తింపబడుచున్న,

1బాణము,2,చాపము,3.పాశము,4.అంకుశము అను నాలుగు ఆయుధ శక్తులు.

 వీరినే,

1,జంభనాఖ్య,2.మోహనాఖ్య,3.వశ్యనాఖ్య.4.స్తంభనాఖ్య శక్తులుగాను సంకీర్తిస్తారు.

 నిరాకార-నిర్గుణ-నిరంజనయైన అమ్మ క్షిప్రప్రసాద తత్త్వమే అమ్మ చతుర్భుజములతో సాకారముగా సాక్షాత్కరించుట.


 ఎప్పుడైతే మనమనస్సు ఇంద్రియ నిగ్రహముతోనిర్వికారముగా ఉంటుందో అదే తల్లి అనుగ్రహించే చాపము.దానినిపంచ తన్మాత్రలనేబాణములతో అనుసంధానము చేసుకుని తురీయస్థితి అనే గమ్యమును చేరుటకు సహకరించే అమ్మ కరుణయే పాసము.ఆ ప్రస్థానములో వచ్చు ఆటంకములను ఖండించినదియే అంకుశము.ఈ నాలుగు ఆయుధశక్తులు ,

 స్థూలము నుండి (మొదటి మూడు చక్రముల) సూక్ష్మమునకు,సూక్ష్మమునుండి సూక్ష్మ తరమునకు,సూక్ష్మ తరము నుండి సూక్ష్మ తమమునకు,సూక్ష్మ తమము నుండి తురీయమునకు సాధకుడు చేరుటకు కావలిసిన యోగ్యతను అనుగ్రహిస్తాయి.

 త్రికోనములో మూడు శక్తులనుపరాశక్తులుగాను,చతురస్రములోని నాలుగు శక్తులను అపరా శక్తులుగాను పరిగణిస్తూ ఈ ఆవరనములోని యోగినులను "పరాపర రహస్య యోగినులు" గా భావిస్తారు.

 సారూప్య-సామీప్య భక్తిని దాటి సాలోక్య-సారూప్యతను అనుగ్రహించుతకు సహాయపడు శక్తులు కనుక "అతి రహస్య యోగినులు"అని కూడా ఆరాధిస్తారు.

 సాధనాత్ సాధ్యతే సర్వం అన్నది ఆర్యోక్తి.

 నిధిధ్యాసనము ఇప్పటివరకు తాను తెలుసుకున్న దానిని పదే పదే మదిలో నిక్షిప్తము చేసుకుంటూ,సర్వబీజ ముద్రాశక్తి అనుగ్రహముతో"అంబామయం సర్వం అన్న భావనతో,ఇచ్ఛాసిద్ధి శక్తి సహాయముతో,త్రిపురాంబ చక్రేశ్వరికి నమస్కరించి,ఆశీర్వచనమును పొంది,సాధకుడు బిందుస్థానమైన"సర్వానందమయ చక్రము"లోనికి ప్రవేశించబోతున్నాడు.

 " యా దేవి సర్వభూతేషు ముక్తి రూపేణ సంస్థితా

   నంస్తస్త్యై నమస్తస్తై నమస్తస్త్యై నమో నమః."



TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...