AKHANDA MANDALAKARAM-VYAAPTAM YENA CHARACHARAM

అఖండ మండలాకారం-వ్యాప్తమ్యేన చరాచరం. ************************************************ ఆద్యంతరహితమైన తత్త్వానికి సంకేతము మండలం.ఒక తేజో బిందువు విస్తరించి పెద్దగా వృత్తాకారములో గోచరమయితే అది మణ్డలము.అనంతత్త్వానికి ప్రతీక. ఈ సృష్టి ఆవిర్భవించక ముందున్న పరంజ్యోతియే సృష్టి ఆవిర్భావం జరిగినపుడు సూర్య మండలం గా భాసిస్తోందని ఆర్యోక్తి. సమూహములతో నిండినది అని మనము మండల శబ్దమును అన్వయించుకుంటే,ఆదిత్యులు,అప్సరసలు,మునులు,గ్రామణులు,యాతుధాన్యులు,గంధర్వులు,సర్పములు,వాలిఖ్యాది మునులు మొదలగు గణములతో సంసేవింపబడుచున్న అనంత తేజోరాశి,ఉత్తరాయణ పుణ్యకాలమున సంపూర్ణ మండల భాతితో లోకపాలన చేస్తుంది. అంతటా వ్యాపిస్తూ దేనికి అంటని వాడు ఆ మండలములోని పరంజ్యోతి.స్వయం ప్రకాశకత్వము-సృష్టి-స్థితి-లయకారకత్వమును కలిగిన దివ్య తేజము.సూర్యుడంతేనే జాగ్రదావస్థ.సకల చరాచరములు చతనత్వమును పొందకలుగుటకు కారణమైనది ఆ మండల ద్వారము గుండా ప్రసరించుచున్న దివ్య కిరణములు.కనుకనే " రశ్మిమంతం-సముద్యంతం" గా సంకీర్తింపబడుతున్నది. సూర్య మండలము ఆనందమయము-విజ్ఞాన మయము-యజ్ఞమయమ...