TIRUPALLIELUCHCHI-08
ముందియ ముదల్నడు ఇరుదియం ఆణా మువ్వరం అరికిలాల్ యవర్మట్రు అరివార్ పందణై విరళియుం నీయుం, నిన్ అడియార్ పలంకుడి తొరుం ఎళుయుం అరుళియ పరనే శెందడల్ పురైతిరు మేనియుం కాట్టి తిరుపెరుం తురైయురై కోయిలుం కాట్టి అందణన్ ఆవదుం కాట్టి వందండాయ్ ఆరముదయె పళ్ళి ఎళుందరుళాయె. ..... "యత్ త్రికాలే అపి తిష్ఠతి తత్ సత్." ఏదిసర్వకాల సర్వావస్థలందును స్వయం ప్రకటితమో అదియే సత్తు. దాని ప్రకశనమే చిత్తు. ఉన్నదాని ఉనికిని తెలిసికొనుట సత్చిత్. తెలుసుకొనుటవలన లభించు దివ్య అనుభూతియే అలౌకికానందము.అదియే "సచ్చిదానందము." ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు చెలుల సంభాషణ ము ద్వారా మనకు ఆ దివ్యమైన అనుభూతిని, ఆరముదయె-మధురాతిమధురమైన మకరందమా అని సంబోధింపచేస్తున్నారు. ఆ మందార మకరందమును ఆస్వాదింపగలిగే మధుపముగా మన మనసు మారాలంటే మన ఇంద్రియములు స్వామి అనుగ్రహపాత్రములై ఉండాలి. మన కర్మలు స్వామి యొక్క నిజతత్త్వమును,తెలుసుకొనగలగాలి. మున్ముదల్ ఆణాయ్-ప్రపంచ సృష్టికి ముందున్నది ముదల్ ఆణాయ్-సృష్టి ప్రారంభమునందున్నది నడు ఆణాయ్-మధ్యమ స్థితిలో నుండునది ఇరుదియం ఆణాయ్-ప్రళయమునందుండునదియును అనగా స్వతంత్ర ప్రకటనముకల నిత్య సత్యముగా...