ALAMPURAE JOEGULAAMBA
ఆలంపురే జోగులాంబ "లంబస్తనీ వికృతాక్షి ఘోరరూపాం మహా బలాం ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం" మాయాసతి పైపలువరస పడి జోగులాంబగా కర్నూలుకు సమీపములోనున్న ఆలంపుర క్షేత్రమునందు భక్తులను అనుగ్రహించుచున్నది.ఉష్నస్వభావముతో నున్న తల్లిని చల్లబరచుటకు అలయము చుట్టు తటాకములు ప్రసాంతముగా ప్రవహించుచుండును.స్వభావములోనేకాదు స్వరూపములో కూడ అమ్మ ఉగ్రముగా ఉండి తలపై తేలు,బల్లి,గుడ్లగూబ, శవము మొదలగు వాని ఆభరణములుగా అలంకరించుకొనును. అలంపురము పూర్వము హలపురము హలంపురంగా వ్యవహరింపబడినది. చాలుక్యరాజైన రెండవ పులకేశి ఆలయ పునర్నిర్మాణము గావించెనని శాసనములు తెలియచేయుచున్నవి. పూర్వము ఋషిశాపము వలన తన బ్రహ్మత్వమును కోల్పోయిన బ్రహ్మ ఈ పుణ్యస్థలమున శివుని గురించి ఘోరతపము చేసెనట.పరమేశుడు సంతుష్టుడై బాల బ్రహ్మ,తారక బ్రహ్మ,పద్మ బ్రహ్మ,కుమార బ్రహ్మ,ఆత్మ బ్రహ్మ,వీర బ్రహ్మ,విశ్వ బ్రహ్మ,గరుడ బ్రహ్మ,శబ్ద బ్రహ్మ అను నవ బ్రహ్మ రూపములలో సాక్షాత్కరించి అనుగ్రహించెనట.శివ బ్రహ్మమే జగమంతా అని భావించిన రస సిద్ధుడు నవబ్రహ్మ మందిరమ...