TANOTU NAH SIVAH SIVAM-06@SIVATANDAVASTOTRAMU

తనోవ నః శివః శివం-06 **************** "వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" మహాద్భుతమైనది ప్రస్తుత చరణము శివశక్త్యాత్మకతను మరింత ప్రస్పుటము చేస్తోంది " ధరాధరేంద్ర నందిని విలాస బంధుబంధుర స్పురత్ దిగంతసంతతి ప్రమోద మాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని." సర్వమంగళా దేవి సమక్షములో మహాదేవుడు మహదానందముతో తాందవిస్తున్నాడు. 1.ధరేంద్ర నందనందిని విలాస బంధు బంధుర లీలగా తనను తాను అలంకరించుకొనినది జగన్మాత.ఆలంకారములకు లక్ష్యము మహాదేవుని ప్రమోద మానసునిచేయుటయే. అవలీలగా తాండవిస్తున్నాడు త్రయంబకుడు.ఆ తాండవమునకు లక్ష్యము మహాదేవిని ప్రమోద మానస చేయుటయే. వారిరువురి పరస్పరావలోకన లక్ష్యము వారి సంతతిని ప్రమోదమానసులను చేయుటయే. అమ్మది విలాసము-అయ్యది వినోదము. అమ్మ నందిని-ఆనందప్రదాయిని. అ...