DHYAAYAET IPSITA SIDHDHAYAET-05

ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-05 *********************** మనసంతా ఒకటే గందరగోళం.మనము చూసేదిది నిజమైనది -శాశ్వతమైనది కాదా? శాశ్వతమైనది సులభముగా మనము దర్శించలేమా? లోపల బయట తానే యున్నదంటున్నారు కొందరు "జగమెవ్వని లోపలనుండు "అంటు. అంటే ఈ దృశ్యప్రపంచము ఎచరో మనకు తెలియని వాని లోప ఉందా? లోపకనుక ఉంటే మనలను బయటనే ఉన్నట్లు ఎలా భ్రమింపచేస్తున్నది. ఇది భ్రమ తత్త్వమా? బ్రహ్మాండ తత్త్వమా? ఒక సందేహమునకు తోడుగా మరొక సందేహమును జతకలుపుకొనుటకా అన్నట్లు, పనులన్నీ చేసుకొని కాసేపు కాలక్షేపం కోసము చర్చావేదికను చూచుటకు టి.వి ముందు కూర్చున్నాను. కార్యక్రమము ప్రారంభమైనది.చర్చకు ఇరువర్గముల వారు అభిముఖముగా అసీనులైనారు.ఆసనముపై న్యాయనిర్ణేత వారిని గమనిస్తున్నారు. గులాబీలతో, సహకారపరికరములుగా కొన్ని వస్తువులను ప్రవేశపెడుతూ చర్చా కార్యక్రమమును ప్రారంభింపచేసారు. వారిద్దరి మధ్యన రంగురంగు గులాబీలతో, అలంకరింపబడిన పుష్పగుచ్చమును ఉంచారు.గులాబీలలో కొన్ని ఎర్రవి.కొన్ని పసుపుపచ్చవి.కొన్ని త...