Posts

Showing posts from January 30, 2026

ADITYAHRDAYAMU-12

Image
  ఆదిత్యహృదయము-12   *****************   జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం   కిరణసమిత పాపం క్లేశదుఃఖస్య నాశం   అరుణకరుణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం   సకల భువన వంద్యం భాస్కరం తం నమామి.    పూర్వ రంగము *********** పరమాత్మ హరిత గుర్రములను-రథమును-సప్తశబ్ద ప్రాభవమును తెలియచేసిన అగస్త్యమహాముని,  పరోక్షముగా మనకు-ప్రత్యక్షముగా రామచంద్రునికి,ప్రస్తుత శ్లోకములో ద్వంద్వ విభాగములను-శాశ్వతత్త్వమును వివరిస్తూ,స్వామి ఏ విధముగా తన ప్రచండత్వమును-ప్రసన్నత్వమును అనుగ్రహిస్తూ,లోకరక్షణము గావిస్తున్నాడో వివరిస్తున్నారు. ఋగ్వేదము-వాల్మీకి రామాయణము-ఆదిత్యహృదయము పరమాత్మ ప్రాభవమును మానవులకు అర్థమయ్యే విధముగా సులభతరము చేసి ,చైతన్యవంతము చేస్తున్నది. శ్లోకము ****** " హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః   అగ్నిగర్భో దితేపుత్రః శంఖః శిశిరనాశనః"        ఋగ్వేడము స్తుతించినట్లు పరమాత్మ, 1హిరణ్యగర్భుడు-అగ్నిగర్భుడు. ************************  హితము-రమణీయము హిరణ్యము.ఇక్కడ హిరణ్యగర్భపదమును అంతః-బహిశ్చ యత్ సర్వం కింద భావిస్తే, " హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూ...