ADITYAHRDAYAMU-12


 


ఆదిత్యహృదయము-12

  *****************

  జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం

  కిరణసమిత పాపం క్లేశదుఃఖస్య నాశం

  అరుణకరుణగమ్యం ఆదిం  ఆదిత్యరూపం

  సకల భువన వంద్యం భాస్కరం తం నమామి.

   పూర్వ రంగము

***********

పరమాత్మ హరిత గుర్రములను-రథమును-సప్తశబ్ద ప్రాభవమును తెలియచేసిన అగస్త్యమహాముని,

 పరోక్షముగా మనకు-ప్రత్యక్షముగా రామచంద్రునికి,ప్రస్తుత శ్లోకములో ద్వంద్వ విభాగములను-శాశ్వతత్త్వమును వివరిస్తూ,స్వామి ఏ విధముగా తన ప్రచండత్వమును-ప్రసన్నత్వమును అనుగ్రహిస్తూ,లోకరక్షణము గావిస్తున్నాడో వివరిస్తున్నారు.

ఋగ్వేదము-వాల్మీకి రామాయణము-ఆదిత్యహృదయము పరమాత్మ ప్రాభవమును మానవులకు అర్థమయ్యే విధముగా సులభతరము చేసి ,చైతన్యవంతము చేస్తున్నది.


శ్లోకము

******

" హిరణ్యగర్భః శిశిరః తపనో భాస్కరో రవిః

  అగ్నిగర్భో దితేపుత్రః శంఖః శిశిరనాశనః"

 

     ఋగ్వేడము స్తుతించినట్లు పరమాత్మ,


1హిరణ్యగర్భుడు-అగ్నిగర్భుడు.

************************

 హితము-రమణీయము హిరణ్యము.ఇక్కడ హిరణ్యగర్భపదమును అంతః-బహిశ్చ యత్ సర్వం కింద భావిస్తే,

" హిరణ్యగర్భః సమవర్తతాగ్రే భూతస్య జాతః పటిరేక ఆసీత్"

"హిరణ్యగర్భ సూక్తము-ఋగ్వేదము"

విశ్వము యొక్క బీజము పరమాత్మ.

గోప్త్యతను సూచించు పదము గర్భము.అంటే,

తనలో మనము-మనలో తాను

***************************

ఇదియే బృహత్వము.పరమాత్మను మించినది ఏదీలేదు అనుకుంటే,

బృంహణత్వము

దానిలోని చైతన్యము "అగ్నిగర్భ" నామము.

" అగ్నిమీలే పురోహితం యజ్ఞస్యదేవం ఋత్విజం

అగ్నిః పూర్వేభిః ఋషిభిః లిద్యో నూతనైః ఉతా సదేవా ఏవా'" అగ్నిసూక్తము-ఋగ్వేదము.

పరబ్రహ్మ నిత్యనూతనము-శాశ్వతము,

2.రెండవ విశేషము

ఆదిత్యుడు తన హిమసర్జనకిరణములతో శిశిరమును,

ఘర్మ సర్జన కిరణములతో తాపమును కలిగిస్తాడు.

అదియును తగినంత మోతాదులో/తగినంత సమయము వరకు.

శిశిరము ఆయనే-శిశిరనాశకుడు ఆయనే

తాపము ఆయనే-తాప నాశకుడు ఆయనే.

ఆ దివ్య చైతన్యమే తనకు తానుగా హెచ్చుతగ్గులతో ప్రతి ఉదయము వెలుగు-వేడిని విస్తరింపచేయుచు,మధ్యాహ్న సమయములో మరింత ప్రచండుడై-అస్తమాన సమయమునకు ప్రసన్నత్వమును ప్రకటిస్తాడు.

3.భాస్కరో-రవిః/ప్రకాశము-ప్రణవము.

************************************

తనకిరణములనే కరములతో భా కాంతిని/జ్ఞానమును ప్రసాదించువాడు.

తన నాదముతో ర రవమును వి విస్తారముగా చేయువాడు.అదియే కదా" వేదోత్పత్తి."

4.దితేపుత్రః-విభజింపబడిన శక్తులచే/రశ్ములచే పాలించువాడు.

అదితే పుత్ర-ఆకాశమునుండి ప్రకటనమగు అఖండుడు.

5.శంఖః

*******

ఖ అను అక్షరం ఆకాశము అను అర్థమునే కాక లోతైనది/కనుగొనలేనిది అని అనుకుంటే,

ప్థ్వీతత్త్వమునకు  కూడ అన్వయిస్తుంది.

దాని ఉదాహరణయే మనము జరిపించే,

"శంఖ స్థాపనము" భూమినిలోతుగా తవ్వుట,ఆకాశపు లోతును అంచనా వేయుట అసాధ్యమే.

ఆకాశమునుండి(లోపల నుండి-భూమి లోతునకు) తనకిరణములను ప్రసరింపచేస్తూ,శుభములనొసగువాడు " శంఖః"

గొలుసు కట్టుగా చూస్తే,

హిరణ్యగర్భ నుండి-అగ్నిగర్భ,

అగ్నిగర్భనుండి-భాస్కర

భాస్కర నుండి తపనః

తపనః నుండి శిశిరః,మాంద్యమును తొలగించుటకై

శిశిర నుండి శిశిర నాశనః,

అన్నీ తానైన పరమాత్మ అన్నివేళలలో అన్నీ స్వీకరిస్తూ సమస్తమునకు వానిని


 అనుకూలముగా మారుస్తూ,తగినంత అందిస్తూ,శుభకరుడగుచున్నవేళ,

' తం సూర్యం ప్రణమామ్యహం." 


Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI