MARGALI MALAI-21

మార్గళి మాలై-21 ****************** ఇరవైఒకటవ పాశురం **************** ఏత్తి కలంగళెదిర్పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ శొరియం వళ్ళన్ పెరుం పశుక్కళ్ ఆత్తపడైత్తాన్ మగనే! అరివురాయ్ ఉత్తముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్ తోత్తమాయ్ నిన్ర శూదరే!తుయిళెలాయ్; మాత్తార్ ఉనక్కు వలితులైందు ఉన్ వాశర్ కణ్ అత్తాదు వందు ఉన్ అడిపణియు మాపోలే పోత్తియాం వందోం పుగళందు ఏలోరెంబావాయ్. తల్లికి క్షమాపణ అభ్యర్థనలతో. శ్రీకరము శుభకరము భవహరణము శ్రీవ్రతము శ్రీనీలా కృష్ణుల అనుగ్రహము అనవరతము. తల్లడిల్లు గోపికలకు తలుపును తెరిచినది నీల మరువలేదు మీ ప్రార్థనలను నేనును మీ పక్షమే స్వామికి నివేదించ తగిన సమయమునకై వేచితిని మరియొక మాట మగువలార! భగవానుని మరిమరి మానవుడు-మన వాడను భావనను కలుగచేయవలెనుగా గోపాలురు-గోసంపద-గోపికలను జ్ఞప్తిచేయు విధముగ యశోద-నందులను మరిమరి కీర్తించండి యదుకుల భూషణుడను లీలలను చాటండి దాసోహులు గోపికలు దర్శన ధన్యత గ...