జై శ్రీరాం ********** ఎంతటి చమత్కారి అగస్త్యభగవానుడు.రామచంద్రునకు 'తతో యుధ్ధమునా చింతా శోకములను తొలగించుటకై రాముని సమీపించి,స్తోత్రమును ఉపదేశించి నిజస్థానమునకు తరలినాడట.ఇంకాచమత్కారము రామచంద్రుడు భక్తి-శ్రధ్ధలతో ప్రార్థించగానే సూర్యనారయణుడు సంతుష్టుడై రామునిసమీపించి,రావణునికి మరనము ఆసన్నమైనదని కాల స్వరూపునిగా/యమునిగానిర్దేశించి,రాముని దీవించి,సంతసముతోనిజస్థానమునకు చేరినాడట. అంటే అతి పవిత్రమైన ఆదిత్యహృదయస్తోత్రము కేవలము రామునికిసంబంధించినదా/లేక సకల చేతనులనూద్దేశించి,వెలుగు మార్గమును చూపించుటకు పరోక్షముగా ప్రసాదించినదా అన్న ఒక్కఆలోచన మనకు నామికి-నామమునకు భేదము లేదని,సకలములో అంతర్యామిగా దాగిన పరమాత్మ తానొక మానవ ధర్మమును అనుసరిస్తూ,ధర్మసంస్థాపనమును ఏ విధముగా నిలిపినాడో విశదపరుస్తుంది. నారాయణుడే రామచంద్రుడు/సూర్యనారాయణుడు/అగస్త్యభవ్గవానుడు,ఆంజనేయుడు/విభీషణుడు/యుధ్ధభూమి,సీతమ్మ,సర్వము/సకలము పరమాత్మే. అయినప్పటికిని, " గోచరంబగు జగములోపలగోప్యమైనది రామనామము." తాను గోప్యముగా ఉండి మనందరిచే,రాముడు యుధ్ధభూమిలో ఉన్నాడు/రాముడు చింతా-శోక...
Posts
Showing posts from April 1, 2024