Sunday, January 7, 2018

JAI SREEMANNAARAAYANA-25

  ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరి రవిల్
 ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళిర
 తరిక్కిలా నాగిత్తాన్ కంజన్ వైత్తిల్
 నెరుప్పెన్న నెన్ర నెడుమాలే! ఉన్నై
 అరితిత్తి వందోం పఱై తరుదియాగిల్
 తిరుత్తక్క శెల్వముం శేవగముం యాంపాడి
 వరుత్తమాం తీరంద్ మగిళింద్ ఏలో రెంబావాయ్.

 ఓం నమో నారాయణాయ-
విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది

ఒక్క రాత్రి సమయములో యశోదను రహస్యముగ చేరినవాడైన
"ఒరుత్తి మగనాయ్ పిరందు" అని కీర్తించుచున్న గోపికలలో

జాతక కర్మను రహస్యముగా జరిపించుకొనిన వాడైన
ఆపదలతో ఆటలాడుకొనిన ఆ ఆపద్బాంధవునిలో

కూడని గుణములకూడి కీడును తలపెట్టిన వాడైన
ముడిబడనీయని కుంపటి ఆ కంసుని గుండెలలో

అష్టాక్షరిలో పుట్టి ద్వయమంత్రములో పెరిగిన వాడైన
"ఉన్నై తిరుత్తిత్తు వందోం" అంటున్న ముందుకాళ్ళ బంధములో

నల్లనయ్యను కీర్తించగ నళినాక్షులు రారె
ఆముక్త మాల్యద ఆండాళ్ అమ్మవెంట నేడె.

భావము

శ్రీ కృష్ణుడు పాపం! పుట్టిన వెంటనే దేవకీదేవిని వీడి రహస్యముగా యశోద బిడ్డడుగా వచ్చి చేరాడు.జాతక కర్మలను గర్గ మహామునిచే రహస్యముగానే చేయించుకున్నాడు.(కంసునకు తెలియునన్న భయముతో) కంసుడు పంపిన శత్రువులతో ఆడుకుంటు,వారిని హతమారుస్తూ,కంసుని గుండెలమీద కుంపటిలా మారిన శ్రీ కృష్ణుని కీర్తించుటకు "ఉన్నై అరుత్తిత్తు" వందోం-వచ్చాం అంటున్నారు గోపికలు.

గోపికల మాటలలో నున్న రహస్యము గురించి తెలుసుకోవాలన్న వింత ఆలోచన వచ్చింది. రహస్యము ఇద్దరు వ్యక్తుల మధ్యనుండునది కదా.కాని శ్రీ కృష్ణుడు యశోదమ్మ దగ్గరకు వచ్చినాడన్న విషయము నేలకు తెలుసు-నింగికి తెలుసు-నీటికి తెలుసు.గాలికి తెలుసు.ఆదిశేషునకు తెలుసు.తెరుచుకున్న చెరసాల తలుపులకు తెలుసు.నిమిత్త మాత్రుడైన వసుదేవునకు తెలుసు అయితే ఇందులోని రహస్యము ఏమిటి?

స్వామి జనన మరణ రహితుడు.అనంతము తేజో మయము సర్వ వ్యాపకము కాల స్వరూపము కృష్ణుడు.తాను దేవకీ పుత్రుడనని ప్రకటించుకొనుట రహస్యము.నామ రూప రహితుడైన స్వామి మహామునిచే నామకరణము చేయించుకొనుట వారిని అనుగ్రహించుట రహస్యము.సమస్తము నశించినా నిశ్చలంగా ఉండే పరబ్రహ్మస్థానము ఆవాసమైన మన స్వామి కంసుని తన నివాసము తెలుస్తుందని జాతక కర్మను (రహస్యముగా)జరిపించుకొనుట మరియొక రహస్యము.అరివీరత్వము గల స్వామి సుకుమారుడుగా కనిపించుట స్వామి లీలా విశేషములను గుర్తించుచున్న గోపిక అమ్మ వెంట స్వామితో ఆడిపాడ ఆత్మార్పణతో వెళ్ళుచుండగా,నా మనసు వారితో పాటు మెల్లగా తన అడుగులను కదుపుతున్నది.

( ఆండాళ్ తిరువడిగళే శరణం )


TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...