Friday, December 9, 2022

AALO REMBAVAY-04


 నాల్గవ పాశురము

*************
ఆళిమళై కణ్ణా! ఒన్రు నీ కై కరవేల్
ఆళియుల్ పుక్కు ముగందు కొడార్ త్తేరి
ఊళి ముదల్వన్ ఉరువం పోల్ మెయికరుత్తు
పాళియన్ తోళుడై ప్పర్బనాబన్ కైయిల్
ఆళిపోల్ మిన్ని వలంబురి పోల్ నిన్రదిందు
తాళాదే శార్ఙ్ ముదైత్త శరమళై పోల్
వాళ ఉలగనిల్ పెయిదిడాయ్ నాంగళుం
మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంబావై.
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః


 ఓంగి ఉలగళంద్ పాశురములో స్వమి తానే త్రివిక్రమ వేషధారియై అవతారలీలావిశేషములౌ ప్రస్తుతించిన గోదమ్మ ప్రస్తుత పాశురములో స్వామి తాను సూత్రధారియై,వరుణదేవుని పాత్రధారునిగా మలచి,పద్మనాభస్వామి స్వరూప-స్వభావ-విభవములతో పోలుస్తు,వరుణదేవుని లోక సంరక్షణాకార్యనిర్వాకునిగా అదియును పాపపుణ్యములను లెక్కించని సర్వత్ర వానగా స్వామి ఆనగా వర్షించు అని ప్రార్థిస్తున్నది.వారి నోము లోక సంక్షేమమునకు గాన జలకములాడుటకు తగిన వనరులను అర్థించుచున్నది.

   ఆళ్వారులు (ఆచార్యులు) వరుణదేవుని వంటివారు.వారు భగవత్ గుణములనెడి జ్ఞాన సముద్రములో పూర్తిగా మునిగి,భగవత్తత్త్వను నీటిని నిశ్శేషముగా త్రాగి,నిరంతరము నీలమేఘశ్యామునితో రమించుట వలన నల్లగా స్వామి మేనిఛాయను పొందుతారట.ఎంతటి భాగ్యశాలురో కద.మేఘము గగనమునకు వెడలునట్లు వీరును ఆ-అంతట-కాశము-ప్రకాశవంతమైన మూలతత్త్వమున ప్రవేశించి,మనలను సంస్కరించుటకు జ్ఞానామృతధారలను వర్షించెదరు

స్వామి శంఖనాద ప్రణవ నాదము శేష-శేషి భావమునకు,శరమళై స్వరూప యాదాత్మ్య జ్ఞానమునకు సూచికలు.ఉపదేశములు-.వారి జ్ఞాన వాగ్వర్షము కాంతిని-విజ్ఞతను మెరుపు ఉరుముల వలె కలిగియుండును.తిరుగులేని రామబాణముల వరుస వలె అనవరతము అనుగ్రహించుచుండును అని అమ్మ పర-వ్యూహ-విభవ మైన ఆచార్య తత్త్వమును " ఆళిమళైకణ్ణా! అని ప్రస్తుతించినది."ముగందు కొడు" అని జ్ఞానమును పూర్తిగా సంగ్రహించిన వారిగా ప్రస్తుతించినది.వారి జ్ఞాన ధారలను"మగిళిందు పెయిదిడాయ్"
 వరుణదేవా నీవు సముద్రగర్భములోనికి ప్రవేశించి,కడుపునిండా నీరు త్రాగి,సంతోషముగా త్రేంచుచు పైకి లేచి,బీడునేల-పంటనేల అను వివక్షను చూపకుండా,ఏ విధముగా స్వామి అనుగ్రేహము పాపపుణ్యములను లీక్కకు తీసుకొనదో అదేవిధముగా మమ్ములను అనుగ్రహించు.
 ఆ సమయములో నీ ఉరుములు స్వామి పాంచజన్య నాదములను,మెరుపులు సుదర్శన కాంతులను,నీ వాన చినుకులు శారంగ శరములను పోలి ప్రతిఫలించనీ.
  స్వామి పర-వ్యూహ-అర్చ-విభవ రూపములను ప్రస్తావించిన తదుపరి ఆండాళ్ తల్లి మనకు భాగవత ప్రాశస్త్యమును పరిచయము చేస్తున్నదా అన్నట్లు,ఆచార్యులను వరుణదేవునితో వారు అందరికి సమానముగా అనుగ్రహించు ఆధ్యాత్మిక సంపదను వానతో వారి కాంతి నీలమేఘునితో,కరుణను వర్షించు,కనికరముతో సంకేతిస్తున్నదనుటలోను సందేహము లేదు.
 పర మూర్తి,వ్యూహమూర్తిగా దర్శనమిస్తున్నప్పుడు తన నాభినుండి బ్రహ్మను సృజించినాడు.అదేవిధముగా తాను వరుణునికి తన సమ్రక్షనములో పాలుపంచుకునే అవకాశమును ఆశీర్వదించినాడేమో.
 స్వామి శారంగమునుండి వచ్చున్న సరములా అన్నట్లు వానజల్లులను పోల్చినది.నిజమునకు అవి శరములుకావు.ఆశ్రిత వాత్సల్యము అందించుచున్న వరములు.
 ఆండాల్ తల్లి మనలను గోపికలు అను పేర నున్న పదిమంది ఆళ్వారులను రేపటి నుండి పరిచయము చేయుటకు ముందుగా భగవదాశ్రయము ఎంతగొప్పదో-భాగవతాశ్రము సైతము అంతే ఉదాత్తమైనదను భావనమును అందించుచున్న ,
 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.

AALO REMBAVAY-03




 మూడవ పాశురం

***************

ఓంగి ఉలగళంద  ఉత్తమన్ పేర్పాడి

నాంగళ్ నంబావైక్కుచ్చాత్తి నీరాడినాల్

తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయిదు

ఓంగు పెరుం శెన్నల్ ఊడు కయల్ ఉగళ్

పూంగువళై ప్పోదిల్ పొరివండు కణ్పడుప్ప

తేంగాదే పుక్కిరుందు శీర్తములై పత్తి

వాంగక్కుడం నిరైక్కుం వళ్ళల్ పెరుం పశుక్కళ్

నీంగాద శెల్వం నిరైందు ఏలో రెంబావాయ్.

 పూర్వ పాశురములలో స్వామి వ్యూహ వైభవమును ప్రస్తావించిన గోదమ్మ ప్రస్తుత పాశురములో అవతార
 వైశిష్ట్యాన్ని వివరిస్తున్నది.
  మనము నిత్యవిభూతి-కృత్యవిభూతి అనేఆంసమును పరిశీలిస్తే,అవతారవిభూతిని  ప్రస్తుత పాశురములో అర్శింపచేస్తున్నదిగోదమ్మ.
   స్వామి అవతార విశేషములు అనంతమైఅనప్పటికిని మత్స్య-కూఎర్మ-వరాహ-నారసిమ్హములను కాక అమ్మ వామనావతార వైభవమును ,భక్త సౌలభ్యత్వమును బాలుడిగా నున్న కృష్ణుని అజ్ఞానము ఎక్కడ పరమాత్మునిగా గుర్తించనీయదో అంటూ అష్టసిద్ధుల ప్రకటన విశేషముగా స్వామి అవతారమును దర్శింపచేస్తుంది.
  ఉపేంద్రుడైన స్వామి వటువుగా తన పరిణామమును తగ్గించుకొనుట,సకలప్రదాత యైన తన విభవమును మరుగునదాచి,యాచకునిగా స్వభావమును సైతము మార్చుకొని,ప్రహ్లాదునికి ఇచ్చిన మాట ప్రకారము అతని మనిమాఇన బలిని సంహరించక-సంస్కరించుట పరమాద్భుతము.
  అంతేకాక రాక్షస గురువైన శుక్రాచార్యుని మృతసంజీవని బలముతో యుద్ధములో అసురులను జయించుట దేవతలకు అసాధ్యము.ఉపాయము-ఉపేయము తానే అయిన పరమాత్మ జగత్కళ్యాణమునకై ధరించి-మనలను తరింపచేసిన అవతారము.

   ప్రస్తుత పాశురము ఓం కారముతో-ప్రణవముతో ప్రారంభమవుతుంది.
 అలంద-కొలిచి,లెక్కించి
 ఉలగం-భూమిని,లోకాలను
   బాలునిగా వచ్చి,మూడు అడుగులు యాచించిన స్వామి
 ఓంగి-పెరిగి కొలిచినాడట.
 సూక్ష్మము-స్థూలము తానైన స్వామి స్పర్శను అనుగ్రహించి ఆసీర్వదించినాడు.
 భక్తులు స్వామిని కొలుచుట లోక రివాజు.స్వామి భూమిని కొలుచుట భోగవిభూతి.
 నం పావైక్కు-మనకు స్వామి అనుగ్రహించిన నోము
 నాంగళ్-స్వార్థరహితము/సకల శ్రేయోదాయకము.
  దానికి నిదర్శనము తాను పెరుగుటయే కాక 
  ఓంగు పెరుసెన్నల్-పెద్దపెద్ద అందమైన తామరలు 
  పెరుగుతున్నాయి.అవి నీవేకదా సెల్వా
   తింగళ్ ముమ్మారిపెయిదు-నెలకు మూడువానలు
   ఊడు కయల్ ఉగళ్-కేరింతలతో ఎగురు చేపలు
   పెరుం పశుక్కల్-పాలనిచుచు సురభులు నీ అనుగ్రహమే కదా.
 మనము కోరుతున్న సంపద వానలు-పంటలు-పశులు-పాలు-చేపలు-పూవులు-తుమ్మెదలు గా కనిపించినప్పటికిని అసలైన సంపద నీవు మాత్రమే స్వామి
 నీగాద సెల్వం అని నొక్కివక్కాణిస్తున్నది.
    మరొక్క ముఖ్య విషయము గోదమ్మ ఎక్కడ అవతారనామమును చెప్పక ,ఉత్తమన్ పేర్పాడి అని అవ్యాజకరుణను ఆరాధించినది.
  ఉత్తములు-మధ్యములు-అథములు ఇలా వారి స్వభావమునుపట్టి,చర్యలను పట్టి జనములను వర్గీకరిస్తారు.
 మన స్వామి ఉత్తముడు.
అనగా తన స్వకార్యమునకు తనభక్తుల శత్రువులను సంస్కరించుట కొరకు ఉద్యుక్తుడైనాడు.
  ఉత్తమ లక్షణునిగా ఎలా గుర్తించటము మనము
 గుణములో దోషమును చూసేది అసూయ
 దోషములో గుణమును చూడగలిగేది వాత్సల్యము.
 నిజమునకు బలి ఇంద్రుని రాజ్యమును ఆక్రమించుకున్నాడు.దానమునిస్తున్నానన్న అహంకారముతో నున్నాడు.
 ఆచార్యుని మాటను సైతము పెడచెవిన పెట్టినవాడు.
 అట్టివాని దోషములను లెక్కించక వాని ఔదార్యమును పరిగణించి అనుగ్రహించినాడు.
 ఆ అనన్యరక్షకత్వము నీంగాద  .నిర్హేతుక కృప నీంగాద.
 
   కృష్ణా నీ అనుగ్రహమను సంపద రేపల్లె అంతా,
 ఓంగు పెరు శెన్నల్ ఊడుగా-ఏపుగా పెరిగిన పంటగా.సస్య కేదారములుగా సాక్షాత్కరిస్తున్నది.
ఆహారమే కాదు ఆధ్యాత్మికను సైతము అందచేయుచున్నది.
అవిగో పూంగువళై పోదిల్-వికసించిన నల్లని కలువలు
వానిలో చేరి మధువును గ్రోలుచు 

కణ్పడప్ప-మత్తుగా నున్న
పొరివందు-తుమ్మెదలు.

ఆచార్యులనెడి తుమ్మెదలు నీ అమృతకథలను 
ఆస్వాదిస్తూ ఆదమరచిపోతున్నారు.ఆ అనుగ్రహము నీంగాద/నువ్వేకదా.
 ఊడు కయల్ ఉగళ-చేపలు ఆనందముతో కేరింతలు కొడుతున్నవి.వాటి ఆనందమునకు కారణము నీంగాద కన్నా.
వల్లాల్-ఉదారతగల-పెరుం పశుక్కళ్-పెద్దపెద్ద గోవులు
సిత్రమునై-పాలునిండిన పొదుగులతో
తెంగడి-ఒక్క నిమిషమైనను సందేహించకుండా
పాలను కురిపించుచున్నవి.క్షిప్రప్రసాదత్వము.  
పూర్ణ జ్ఞానులైన ఆచార్యులు క్షణకాలమైనను వ్యర్థము చేయకుండా ఆధ్యాత్మికామృతము వర్షిస్తున్నారు.
 అది నీంగాద సెల్వ అది నువ్వేకదా/నీ కరుణయే కదా

 స్వామి అదియంతయును నీ పాదస్పర్శ సౌభాగ్యమే కదా.
  కృత్య విభూతితో పాటుగా మనలకు 
  
  నిత్యవిభూతులనందించు స్వామి  వ్రతము అను మిషతో నిత్యకైంకర్య భాగ్యమును ప్రసాదించుము అనుచున్న

 
 ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...