Posts

Showing posts from October 25, 2017

JANANI JOHAARLU

Image
జననీ జోహారులు ఒదిగి ఒదిగి అందించే,ఒద్దికైన ప్రేమను పొదుగుతున్న కోడిలో,నీలో నే చూస్తున్నా చక్కని రూపమునిచ్చిన ఓర్పుకు నా జోహారులు .............. హారము రిపుసం హారమనే అపురూపపు ప్రేమను ఎగురుతున్న కాకిలో,నీలో నే చూస్తున్నా చల్లని జీవితమును ఇచ్చిన ఉక్తికి నా జోహారులు ..................... బుద్ధులను నేర్పించే సత్యబద్ధమైన ప్రేమను పూజిస్తున్న గోవులో,నీలో నే చూస్తున్నా విచక్షణను ఇచ్చిన శిక్షణకు నా జోహారులు .................... సందు సందు మారుచున్న అందమైన ప్రేమను దాస్తున్న పిల్లిలో,నీలో నే చూస్తున్నా అప్రమత్తతను ఇచ్చిన ఉదాత్తతకు నా జోహారులు ...................... వీక్షణమున రక్షించే లక్షణమైన ప్రేమను ఒడ్డునున్న తాబేటిలో,నీలో నే చూస్తున్నా కరుణను వర్షించే కన్నులకు నా జోహారులు ....................... వెనుకంజయే లేని వెన్నంటు ప్రేమను ఎగురుచున్న కంగారులో,నీలో నే చూస్తున్నా విడువక ముడిపడిన కడుపుతీపికి నా జోహారులు ....................... గుడ్లను గూటికి మార్చిన గుండెకోత ప్రేమను రాగాల కోకిలలో,నీలో నే చూస్తున్నా అనురాగము వెదజల్లు త్యాగమునకు నా జోహారులు .......... ఎన్నెన్...

Amma Gammathugaa Navvindi Oka Saari

Image
పొట్ట వత్తుకుంటోందని అమ్మ మనసు తిట్టుకుంది అమ్మ మనసు తిట్టుకుంటోందని బోర్లపడటం ..మానేసా. పెరుగుతు..పెరుగుతు అన్నీ అందుకోవాలని అంబాడాలనుకున్నా అంబాడగ ప్రయత్నిస్తే అదిరాయి నా మోకాళ్ళు మోకాళ్ళను చూసి అమ్మ మనసు బెంబేలెత్తేసింది అమ్మ మనసు బెంబేలెత్తేసిందని పాకటము..మానేసా. పెరుగుతు..పెరుగుతు మడుగులొత్తించుకుందామని అడుగులేద్దామనుకున్నా అడుగులేయ ప్రయత్నిస్తే పిచ్చి పిర్ర చుర్రుమంది పిర్ర చుర్రుమనుట చూసి అమ్మ మనసు నొచ్చుకుంది అమ్మ మనసు నొచ్చుకుందని.నడక నేను నేర్చుకున్నా పెరుగుతు..పెరుగుతు చక్కదనము అందీయగ చదువుకోవాలనుకున్నా చదువుకోగ ప్రయత్నిస్తే అవరోధాలెదురాయె అవరోధాలను చూసి అమ్మ బాధ పడింది అమ్మ బాధ పడిందని..అసలు మనిషి నేనయ్యా పెరుగుతు..పెరుగుతు నా సందేహం పెరిగింది ...అది.. నా బాధతో మమేకమైన ..అమ్మ. ఒక్కసారి..ఒకే ఒక్కసారి నేను గట్టిగా ఏడిస్తే..నన్ను చూస్తూ గమ్మత్తుగా నవ్వింది..ఎందుకో..తెలియదు మీకైన తెలుసా..ఎప్పుడో..ఎప్పుడంటే నేను పుట్టినప్పుడు ??????????????? ఎంత పెద్దవాడినైన అద్దమంటి నా మదిలో ముద్దుగా కూర్చున్న హృద్యమైన ఆ నవ్వును ఆశీర్వచనమై ఆలంబనగా ఉండనివ్వు...అమ్మా.....

Ammante Emito Cheppana

Image
అమ్మంటే ఏమిటో నేను చెప్పనా - సంతకాల పుస్తకము. ****************** వికారమును తనుభరించి, ఆకారమును ఇస్తుంది, అమ్మ ఒక "అద్భుతం." తాడు తాను సృష్టించి, ఆహారమును ఇస్తుంది, అమ్మ ఒక "అమృతం." కానరాని శక్తినిచ్చి, కదలికలను కలిగిస్తుంది, అమ్మ ఒక" అవ్యక్తం." గర్భసంచిని పెరగనిచ్చి, తాను జరుగుతూనే ఉంటుంది, అమ్మ ఒక "అక్షయం." శిశువు జననము గురించి, ప్రసవ వేదన తానై సహకరిస్తుంది, అమ్మ ఒక "అద్వైతం". కసిగా నన్నేడిపించి, ముసి ముసి నవ్వౌవుతుంది, అమ్మ ఒక "అనుభవం." పాలను పట్టించి, ఒట్టువేసినట్లే ఒడిలో కట్టిపడేస్తుంది, అమ్మ ఒక "అయస్కాంతం." ముద్దులతో మురిపించి ఒజ్జయై తీర్చిదిద్దుతుంది, అమ్మ ఒక" అధ్యయనం". సూర్య-చంద్రులను చూపించి సూక్ష్మాలను నేర్పుతుంది, అమ్మ ఒక "అభ్యాసం". పట్టుదలను అందించి నేను పడిలేస్తుంతే ఫరవాలేదు అంటుంది అమ్మ ఒక "అనునయం." కష్టమునకు తానోర్చి కావలిసినదేదైన కాదనలేనంటుంది, అమ్మ ఒక" అల్లాయుద్దీన్ అద్భుతదీపం." మనసారా దీవించి మానవత్వ విలువలను ప్రేరేపిస్త...