NA RUDRO RUDRAMARCHAYAET-21

న రుద్రో రుద్రమర్చయేత్-21 *********************** ఓం నమ శివాయ-నిందాస్తుతి **************** నారి ఊడదీయమనగానే జారిపోవచేసావు అమ్ములు దాచేయమనిన గమ్మున దాచేసావు విల్లుకనబడకూడనిన వల్లె యని అన్నావు పినాకమే కానరాని పినాకపాణివి నీవు మంచపుకోడును కూడ కనిపించకుండ చేసావు ఖట్వాంగధారివైన ఖండోబా దేవుడవు పరశును మొద్దుచేయమంటే పదును తీసేసావు ఖండపరశు కానరాని పరమేశుడివి నీవు లేశమైన లేకుండా ఆశాపాశమును తీస్తావు పాశుపతాస్త్రములేని పశుపతివి నీవు రుద్రములో చెప్పారని వద్దనక చేస్తుంటే తెలితక్కువంటారురా ఓ తిక్కశంకరా. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఘోరేభ్యో-అఘోరేభ్యో -రెండును తానైన రుద్రునకు నంస్కారములు. ప్రియమిత్రులారా ఈనాటి మన బిల్వార్చనను ఘోరస్వభావమైన "క్రోధము" పదమును అర్థమునుతెలుసుకునే ప్రయత్నముగా చేద్దాము. పరమాద్భుతము రుద్రనమక ప్రారంభమే, " నమస్తే రుద్ర"మన్యవ" ఉతో త ఇషువ నమః నమస్తే అస్తు ధన్వనే బాహూభ్యాముతతే నమః". ఉభయనమస్కార ఋక్కుతో మన్య శబ్ద ప్రస్తావనముతో...