TIRUPPAAVAI-07 PAASURAM

తిరుప్పావై-పాశురము07 ****************** "మాతః సముత్థైతవతీ మదివిష్ణుచిత్తం విశ్వోపజీవమమృతం వచస దుహానాం తాపఛ్చదం హిమరుచేరివ మూర్తిమన్యాం సంతః పయోధి దుహితః సహజాం విదుస్త్వాం" పూర్వపాశుర ప్రస్తావనము ********************* మనము శుద్ధి వ్రతమును పూర్తి చేసుకుని,ఆందాళమ్మచేతిని పట్టుకుని రెండవ భాగమైన 'మేల్కొలుపు వ్రత భాగములో మొదటి గోపికను మనతో కలుపుకుని,రెండవ గోపిక ఇంటికి వెళ్ళుచున్నాము" ప్రస్తుత పాశురములో శబ్దమును మరింత స్పష్టము చేస్తూ,భారధ్వాజ పక్షుల "కృష్ణ నామ సంకీర్తనమును" గొల్ల భామల చల్ల చిలుకు శబ్దములను,కేశి అను రక్కసుని సంహరించిన కేశవ నామ సంకీర్తనమును శబ్దమును-అందులో దాగిన పరమార్థమును తెలిసికొనుటకు శ్రవనమును సాధనములుగా నోము సాధనకు వివరించుచున్నది గోదమ్మ. ఆండాళ్ తల్లికి-ఆళ్వారులకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటూ,మనము పాశురములోనికి ప్రవేశిద్దాము. ఏడవ పాశురము **************** కీశు కీశెన్రెంగుం ఆనైచ్చాత్తు కలందు పేశిన పేచ్చరవం కేట్టిలైయో? పేయ్ పెణ్ణే కాశుం పిరప్పుం కలగల ప్పక్కై ప్పేర్తు వాశ నరుం కుళ...