Posts

Showing posts from February 13, 2026

ADITYAHRDAYAMU-25

Image
 ఆదిత్యహృదయము-శ్లోకము-26 ********************* ప్రార్థన **** " జయతు జయతు సూర్యం సప్త లోకైక దీపం   తిమిర హరణ పాప ద్వేష దుఃఖస్య నాశం   అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం   సకలభువన వంద్యం భాస్కరం తం నమామి." పూర్వరంగము ********* శరీర దృఢత్వమునకు ఆచరించే వ్యాయామమును తపముగా పద్మాసనమువేసికొని,"సకలంభువనం-చకలము-బుకలము",ఒంటికాలిపైనిలబడి,ఆహారమును స్వల్పముగా తీసుకుంటూ చేసేవిధానమును అదియును అభీష్టసిద్దికై తపము అనుకుంటే, ఏ అభీష్టము లేకుండా,బాహ్యముతో సంబంధము లేకుండా,సర్వకాల సర్వావస్థల యందును సత్తు-చిత్తు రెండును తానైన పరమాత్మను ధ్యానించుమానసిక వ్యాయామము జపము.దానికి సంఖ్యా నియమము లేదు అభీష్టము కానరాదు. ఒక విధముగా చెప్పాలంటే, తమో-రజో గుణములు తాకని శుద్ధ సత్వముతో ఉపాధి నిరపేక్ష అనుసంధానము. ప్రాణి చేస్తే జపము.పరమాత్మ చేస్తే అజపా విధానము.శ్వాసప్రక్రియ. ప్రస్తుత శ్లోకములో,అగస్త్య భగవానుడు ,రావణుని నీవు సూర్యనారాయణుని అనుగ్రహముతో వధిస్తావని రామునితో చెప్పి ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోయాడని కథనము. శ్లోకము ****** " అస్మింక్షణే మహాబాహో రావణం త్వం వధిష్యతి   ఏవం "ఉక్తా...