TIRUVEMBAVAY-15
తిరువెంబావాయ్-15 ************** "కృపాసముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం సదాశివం రుద్రం అనంతరూపం చిదంబరేశం హృది భావయామి. సందర్భము ********** ఇప్పటివరకు మడుగు,మడుగులోని జలము,ప్రవహాము,తెల్లని కొంగలబారు,వికసిస్తున్న నల్లకలువలు,ఎర్రని పద్మములు సకలము శివానుగ్రహ సంకేతముగా భావిస్తూ,దివ్యమంగళ స్నానము చేస్తూ మాయను విడిచిపెడుతున్న వారి దృష్టిని వారిలో ఒకరైన ధన్యురాలి వింతప్రవర్తనము వైపునకు మరల్చాడు ఆ చిదంబరేశుడు.ఈ పాశురము నామసంకీర్తనా వైభవమును,నామికి-నామమునకు కల అభేదమును మనకు అందిస్తుంది. పాశురము *********** ఓరు రకాల్ ఎం పెరుమాన్ ఎన్రెన్రే నం పెరుమాన్ శీరోరుకాల్ వాయోంవాళ్ శిత్తం కళికూర నీరొర్కాల్ ఓవా నెడందారై కణ్ పణిప్పన్ పారోర్కాల్ వందనయాల్ విణ్ణోరై తాం పణియాన్ పేరరయన్ ఇంగణ్ణే పిత్తోర్వార్ ఆమారు ఆరోరువార్ ఇవ్వణం ఆట్కోళం విత్తకర్తాళ్ వారురువ పూణ్మలైయార్ వాయార్ ఆనాంపాడి ఏరురురువం పూం పునల్ పాయింద్ ఆడేలో రెంబావాయ్ "మథురం శివమంత్రం మదిలో మరువకే ఓ మనసా ...