Friday, March 25, 2022

KAALAMAA! KAIMODPULU.

ఆర్యులు "ఉ" అను అక్షరమును నక్షత్ర సంకేతముగాను," గ" అను అక్షరమును గమన సంకేతముగాను నిర్వచించి,ఉగాది అను సంవత్సరారంభమును బ్రహ్మకల్ప ప్రారంభముగాను గుర్తించారు.యుగ అనే పదమును ద్వయముగా అన్వయించుకుంటే ఈ నక్షత్ర గమనము ఉత్తరదిక్కు-దక్షిణ దిక్కు అను రెండిటి వైపు ఉన్నది కనుక యుగాది గాను భావిస్తారు.తెలుగు సంవత్సరాల నామములు వాటి స్వరూప-స్వభావాలను స్పష్టీకరిస్తుంటాయనుట నిర్వివాదము.ఉదాహరణకు సృష్టి ప్రకటితమైన కాల నామమును ప్రభవ అని ముగియు నామమును క్షయ అని తిరిగి ప్రభవిస్తుంది కనుక అక్షయ అని పేర్కొన్నారు. క్షమాపణ అభ్యర్థిస్తూ సంవత్సరాది ప్రత్యేకతను తల్లిగా-తండ్రిగా-గురువుగా గుర్తించి,గణుతించే ప్రయత్నము చేస్తున్నాను. బ్రహ్మ కూడ తన నియమిత కాలము ముగియగానే అంతరించి,తిరిగి ప్రభవిస్తాడు సృష్టి రచనకు అని అంటారు.వసంతం ప్రారంభమైన చైత్రశుధ్ధ పాడ్యమి రోజున సూర్యుడు దినరాజై ఉండగా బ్రహ్మ రస జగత్తును సృష్టిచేస్తాడని ఐతిహాస వచనము.శుభకృత్ నామ సంవత్సర చైత్రశుక్ల పాడ్యమి బుధ వారము ఉషకాలమను తల్లి కొత్తసంవత్సరమునకు జన్మ నిచ్చి పురుడు పోసుకున్నది.ఔషధ స్వభావముతో,తన సంతతిని సమర్థవంతముగా సంతోష వంతులుగా చేయుటకు తన సర్వ శక్తులను స్సన్నధ్ధము చేస్తున్నది.అవసరమైన కొన్ని వనరులను పుర్వ సంవత్సరము నుండి స్వీకరించి తన తరువాత వచ్చు కొత్త సంవత్సరమునకు అందించే తలంపుతో నున్న ఈ జగతికి కొత్తదనమును అందించే కాలమా! మాతృదేవో నమః. "తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్" తనచే సృష్టింపబడిన సకలచరాచరములందు ప్రవేశించు పరమాత్మకు ప్రణామములు.ఎవరు ఉష స్వరూప-స్వభావముతో సకలమును సృష్టిచేసారో వారే శర్వ (విష్ణు) నామ గుణముతో పోషణకర్త (జగత్పిత) గా స్థితికార్యమునకు పూనుకుంటాడు.అహం సంవత్సరో అన్నాడు పరమాత్మ.ఋతు సుదర్శన కాలః.చక్కగా దర్శించగలిగిన ఋతుస్వరూపము నేనే అని మనలకు పదేపదే చెబుతున్నాడు.శర్వుడు-(శుభంకరుడు) అన్నమన్నాద ఏవచ అని అన్న స్వరూపము నేనే తన స్థితికారకత్వమును స్పష్టీకరిస్తున్నాడు కాలస్వరూపముగా మనము అన్వయించుకోగలిగితే. అన్నము అంటే తినేపదార్థము మాత్రమే కాదు.కంటికి దృశ్యము,చెవికి శబ్దము,మనసుకు తృప్తి ఇలా ప్రతిశక్తిని ఉద్దీపింపచేసే -ఉద్యమింపచేసే ప్రతిశక్తి.దానిని నిక్షిప్తము చేస్తూ-నిర్వహింపచేస్తున్న కాలమనే మహాశక్తిని మనము తండ్రిగా గమనించకుందా-గౌరవించకుండా ఉండగలమా? కొత్త సంవత్సరమును తల్లియై సృష్టించిన పరమాత్మ విశ్వం-విష్ణుం గా తండ్రియై అత్మ చైతన్యమును అఖిల చైతన్యముగా మలుస్తున్నాడు."విశతి" ఇతి విశ్వం.పరమాత్మ తనచే ప్రకటింపబడిన ప్రతిదానిలోనికి ప్రవేశించి ప్రభావితము చేస్తు, సమతౌల్యమును సమర్థవంతము చేస్తు, పోషకుడై పుష్టినిస్తున్నాడో అతడు జగత్పిత కాక మరి ఎవ్వరు?కలడంబోధి కలండు గాలి అని ప్రహ్లాదునిచే కీర్తించబడినవాడు శర్వుడు స్థితికారకుడై స్తుతులనందుకొనుచున్నాడు.ప్రకృతి శక్తులను పలు నామరూపములతో పరిభ్రమింపచేస్తూ తన పటిమను నిరూపిస్తున్నాడు..శుభములకు సంకేతము.పాడిపంటలకు ప్రతిరూపము.వ్యాపకత్వమునకు-ప్రాపకత్వమునకు ప్రతిరూపము.పితృదేవో భవ. "గు" కారో అంధకారస్య "రు" కారో తన్నివారణం. ఉషాదేవి తల్లియై కొత్తసంవత్సరమును సృష్టిస్తే,శర్వ శక్తి పోషణ బాధ్యతను స్వీకరిస్తే,భూమినుండి ఆకాశములోని అద్భుత పరిణామాలను గణించి-గుణించి వాటి ఫలితములను మనకు అందచేయు అద్భుత విజ్ఞానమే పంచాంగమను పరి రక్షణ ప్రస్థానము.సూర్యచంద్రుల ప్రయాణములను పరిరక్షితు,సమస్త శాస్త్రములను సమగ్ర పరుస్తు.సమర్థవంతముచేస్తూ,రాబోవు అడ్డంకులను సూచిస్తూ,పరిష్కారములను ప్రస్తావిస్తు, తిథి-వార-నక్షత్ర-యోగ-కరణములను పంచభాగములతో కూడిన అచంచల విశ్వాసము.తిథి సంపదలకు-వారము ఆయుర్దాయమునకు-నక్షత్రము పుణ్యమునకు యోగము వ్యాధి నిరోధక-నాశకత్వమునకు,కరణము ఇష్టకామ్యసిధ్ధికి సంకేతముగా జ్యోతిష్యము గుర్తించి-గౌరవిస్తుంది. ఆచరించి చూపించే ఆ పరమాత్మ అద్భుత తత్త్వమును ఆచార్య తత్త్వము అని అనకుందా ఉండలేము కదా.అజ్ఞాన తిమిరహరమా "తం ఆచార్య దేవో భవ " అంటూ మనలను అనుక్షణము అనుసరింపచేస్తాడు. కాలమును గౌరవించుటయే సకలమును గౌరవించుట. మిత్రులారా! ( నా అభిప్రాయముతో అంగీకరిస్తే ఆశీర్వదించండి.కాదనుకుంటే క్షమించండి.) శుభం భూయాత్.

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...