ప్రస్తుత శ్లోకము స్వామి యొక్క మందలాకార విశిష్టతను మరింత ప్రస్పుటముచేస్తూ స్వామి యొక్క తపనగునమును మరిత నొక్కిచెప్పుతున్నది.
అసలు మండలము అంటే ఏమిటి? ఆతపీ మండలము అంటే ఏమిటి? అనే విషయములో దాగిన అద్భుతములను తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.
"మండలం వర్తులాకారం" అన్నది ఆర్యోక్తి.వృత్తాకారముగా ప్రజ్వరిల్లుతున్న కిరణముల శోభను మండలముగా భావించుత ఒక విధానము.
అంటే ఒక బిందువును కేంద్రముగా చేసుకుని సమానదూరములోనున్న ప్రదేశములలో సమాన వేగముతో వేడిని-వెలుగును ప్రసరించుటకు అనుకూలమైన విధానము.అదియే వృత్తాకారముగా నున్న సూర్యమండలము.
మండలిని మరికొందరు,
" మంజతే అనేన ఇతి మణిభూషాయాం మండలి"
అనేక ప్రకాసవంతమైన కిరణములనే మణి భూషణములతో ప్రకాశించు స్వభావము కల స్వరూపము మండలి.ఐతిహాసిక కథనము ప్రకారము శమంతకమణి సూర్య ప్రసాదముగా సత్రాజిత్తునకు లభించినదని చెబుతారు.
మండలీ సబ్దమును స్వామి కిరణ ప్రవర్తన విశేషముగా భావిస్తారు.
వృత్తాకారముగా నున్నది మందలము.అంతే కాదు ఆతపీ స్వభావమును కలిగియున్నది.
తాప సబ్దము గురించి మనము "హిరణ్యగర్భః తపనో" అను శ్లోకములో తెలుసుకునే ప్రయత్నము చేసాము.జనులను రక్షించుటకు అనుకూలమగు కిరణములను తపింపచేయువాడు సూర్యుడు.తాపమును కలిగించి తిరిగి దానిని తగ్గించివయుస్వభావముతో శంఖ@ గా ప్రస్తుతింపబడుతున్నాడు.
" ఆ సమంతాత్-తపః అస్య అస్తి" ఆతపీ గా వివరించబడినది.
తపశ్సక్తి/తపసంకల్పము స్వభావముగా గలవాడు.అదియును ఆ-సమస్తాత్-సర్వ ప్రదేశములందును-సర్వకాలములందును వ్యాపింపచేయు సంకల్పము-సమర్థత గలవాడు ఆతపీ.
స్వభావము అందరిని రక్షించుట.
సన్నద్ధముచేయుట వర్తులాకారముగా ప్రసరింపచేయు తన కిరణములచేత.ప్రకాశము చేత.
ఇదే విషయమును భవిష్యపురాణములో సూర్యమందల స్తోత్రముగా చెప్పబడినది.
స్వామి సర్వతాపనః మృత్యుః.
...........................
తపన సబ్దము హిరణ్యగర్భ తపనో శ్లోకములో ప్రస్తావించంబడినది.
తప శబ్దము ఆలోచనకలవానిగాను,ఆధారమైనవానిగాను,పూర్ణమైన తపమే స్వభావముగా కలవానినిగా చెబుతుంది.తపమును /తాపమును అందించువాడు-పొందువాడు అను రెండు రూపములను అన్వయించుకుంటే పొందేవారు అనేకులు-అందించేపరమాత్మ ఒక్కడే.ఆ పరమాత్మ సర్వవిధములైన తాపములను సమయోచితముగా అందించి-పెంచి-తొలగించివేస్తాడు.అంటే సర్వ తాపములను/తపింపచేసే కారణములను నశింపచేస్తాడు.కనుకనే సర్వాతాపమృత్యువు సూఎయుడు.
స్వామి విశ్వః-స్వామి కవిః
..........................
ఈ రెండు ప్రత్యేక గుణములవలన స్వామి సర్వతాపములను నశింపచేస్తున్నాడు.చంపివేస్తున్నాడు.
ముందుగా మనము విశ్వః శబ్దమును అర్థముచేసుకునే ప్రయత్నమును చేద్దాము.
విశ్వం విష్ణుః అన్న శ్లోకముననుసరించి విశ్వమే తానుగా నుండు పరమాత్మ సూర్యనారాయణుడు.
యస్య విశ్వం శరీరం- కార్య-కారణముల అభేదమే సూర్యభగవానుడు.
"వసతి ఇతి విశ్వం బ్రహ్మ-అన్నది మరొక అభిప్రాయము.
పంచభూత ప్రపంచమును సృజించి-దానిలోనికి రహస్యముగా సూక్ష్మ చైతన్యముగా ప్రవేశించుటయే విశ్వము.అదియును నిజమే.
ఒకేఒక తత్త్వమును సమిష్టిగా-వ్యష్టిగా అన్వయించుకోవటము కూడా విశ్వమే.
ప్రళయకాలములో ప్రపంచమంతయును ఎవరిలో అంతర్లీనముగా ప్రవేశించి-దాగి ఉంటుందో అది కూడా విశ్వమే.
అటువంటి విశ్వముయొక్క నిజ స్థితిని గ్రహించి-దానికి పరిణామ చైతన్యమును కలిగించే అద్భుత శక్తియే "కవిః"దానినే రవి అనికూడా పిలుస్తారు.
"కౌ పశ్యతి ఇతి కవిః" అని సూక్తి.సర్వమును దర్శించి-వివరించగలవాడు కవి.క్రాంతదర్శనః.సూర్యశక్తియే కవి-రవి-పండితుడు.
సర్వశాస్త్రములను సృజించి-స్పష్టనిచ్చువాడు.
కనుకనే సూర్యశక్తి
మహాతేజ-పింగళ-రక్తః అను మూడు శుభలక్షనములుగలవానిగా కీర్తింపబడుతున్నాడు.
రక్త ఎర్రనువర్నము తేజోప్రతీక-రాగప్రతీక-తపన ప్రతీక.కాని అందులో అనురక్తి దాగియున్నది కనుక రక్తా.
ఇక్కడి రక్త శబ్దము అనురక్తికి సంకేతము.
పింగళ శబ్దము కూడా స్వరూపమునకు ఎర్రని రంగుతో పోల్చబడినప్పటికిని,పింగళ నాడిగా కనుక అన్వయించుకుంటే సుషుమ్నకు సహాయకారులుగా నున్న ఇడ-పింగళ నాదిగాను ఉత్కృష్టను కలిగించు శక్తి.శరీరమునకు మొత్తము సహాయపడు నాడివలె సూర్యభగవానుడు తాము మూలమై ఉపాధులను నడిపించుచున్న చమత్కారి.
సర్వ ఉద్భవములకు కారణమైన సూర్యశక్తి సర్వులను రక్షించునుగాక.
తం సూర్యం ప్రణమామ్యహం.