Monday, November 27, 2023

KADAA TVAAM PASYAEYAM-15


           కదా త్వాం పశ్యేయం-15 ********************** " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం". " దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరం పిబంతాం గౌరీశ మాం ఇహ సముద్ధర సత్కటాక్షైః" శంకరయ్యతో పాటుగా నేనుకూడా చేసిన అపరాధములను క్షమించి,మహాదేవుడు మనందరిపై తనకృపావీక్షణములను ప్రసరించమని త్రికరణశుద్ధిగా ప్రార్థిస్తూ,ఈ నాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము. పక్షులన్నీ కలిసి క్షమాపణమును అర్థిస్తున్నాయి. ఆశ్చర్యముతో వాటినిచూస్తున్నాడు శంకరయ్య. ఇంతలో అటువైపు వెళుతున్నా వారు ఒక్క క్షణము ఆగి, ఓ అర్జున వృక్షమా!, నీవు మూడు వేదములు- నమామి నీవు మనోహరమైన దానివి-నమామి నీవు-త్రిగుణములను-త్రిపురములను- త్రిశరీరములను జయించిన దానివి-నమామి నీవు ఆదివి-ప్రారంభుము నీవే-నమామి నీవు త్రినయనం-సూర్య-చంద్ర-అగ్నులను నేత్రములుగా గలదానివి-నమామి. నీవు జటాభారోదరాం-నీ జటలలో సర్వమును చుట్టుకున్నదానివి-నమామి నీవు చలత్+ఉరగహారం-కదులుచున్న కాలమనే సర్పములను ధరించియున్నదానివి-నమామి నీవే - మృగధరం-మార్గదర్శనము చేయుదానివి-నమామి. ఓ మద్ది వృక్షమా-నీవు సాక్షాత్తుగా మా మహేశ్వరునివి -నమామి అనుకుంటూ ప్రదక్షిణములనుచేస్తున్నాడు. చిలుకలు వచ్చి ,కొమ్మచివర నున్న అమృతఫలములను ఆరగిస్తూ-ఆనందిస్తున్నవి. కొన్ని పక్షులు కొమ్మలెక్కుచున్నవి.మరికొన్ని గూటిలో విశ్రమించుచున్నవి.ఇంకొన్నిచెట్టుచుట్టు తిరుగుతూ చేతులెత్తిమొక్కుతూ,రెక్కలతో విసురుతూ,పూలను తెచ్చి చల్లుతూ ,తన్మయత్వములో తేలియాడుచున్నవి. పైగా అన్నీ కలిసి తమతో పాటు వచ్చిన మృగములను,నరులను,కీటకములను,దేవతలను ఆదరముగా పలుకరిస్తూ, "నరత్వం-దేవత్వం-నరవనమృగత్వం-మశకతాం పశుత్వం -కీటత్వం-భవతు విహగత్వాది జననం....కింతేన వపుషా' అని, వాటి ఉపాధులగురించి ఆలోచించకుండా,స్వామిని భక్తితో, ముక్త కంఠముతో స్తుతిస్తున్నాయి. ఎందరో అమాయకత్వముతో వారు స్వామిరూపును పొందుట మాత్రమే సారూప్యమని భావిస్తారు,. కాని అవ్యాజ కరుణతో నీవు మాఉపాధిలో ప్రకటింపబడుతు,మమ్ములను అనుగ్రహిస్తున్నావు.అని ఆనందముతో పరవసిస్తున్నారు. నేను నిన్ను-నీవు మమ్ములను త్వమేవాహం అనుకోగలుగుతున్నాము అంటూ ఆనందాశ్రువులతో అభిషేకిస్తున్నాయి ఆ వివిధ ఉపాధులు. శంకరయ్య పరిస్థితి సరేసరి. "శంభుధ్యాన వసంత సంగిని......" శంభుధ్యానమనే వసంతము దరిచేరి పాపములనే పండుటాకులను రాల్చివేస్తోంది. ఇంతలో అన్నిపక్షులు ఒక్కసారి జయహో శిఖీ,జయహో శిఖీ-జయజయ జయహో అంటూ అక్కడికి వచ్చిన నెమలిచుట్టు ముట్టాయి. ఇదేమిటి? ఆనెమలి సైతము మీ వంటిపక్షియే కదా.ఎందుకంత గౌరవము/ప్రాధాన్యము దానికి? అన్న ఆలోచనలో పడ్డ శంకరయ్యనుచూస్తూ, శంకరయ్యగారు ఇది "సాక్షాత్తు స్వామిసాకారమే". కావాలంటే మీరే గమనించండి, " ఆకాశేన శిఖీ-సమస్త ఫణినాం-నేత్రా కలాపీ నతా నుగ్రాహి ప్రణవోపదేశ నినదైః కేకీతో తో యోగీయతే శ్యామా శైల సముద్భవాం ఘనరుచిం దృష్ట్వానటంతుం ముదా వేదాంతోపవనే విహార రసికం తం నీలకంఠం భజే." అని అత్యుత్సాహముతో ఏదో చెప్పబోతున్న పక్షులవంకచూస్తూ, ఆ మయూరము తమభాషలో, " భిద్యంతే హృదయగ్రంధిః -ఛిద్యంతే సర్వ సంశయః క్షీయంతే చాన్యకర్మాణి" అంటూ, ఈ శంకరయ్య మనసు ఇంకా సంశయాలతోనే ముడిపడి ఉంది.మీరుచెప్పే మాటలను చేరనీయక ఆ ముడులు అడ్డుపడుతూనే ఉంటాయి, అన్నది వాటివంక చూస్తూ, వాటి భాష అర్థంకాక అదోలా చూశాడు శంకరయ్య వాటివైపు. తమప్రభువు కనుసైగను గ్రహించిన ఆ పక్షులు,మేము మీతో ఎప్పటికి స్నేహితులుగా ఉండాలంటే,మీరు మాకు ఈ శ్లోక వివరణమును ఇవ్వాలి అన్నవి. మా "నీలగ్రీవుని ఆన." మేము దానిని జవదాటలేము.కనుక, మీరు ఈ శ్లోకము పరమార్థమును తెలుసుకుని వచ్చి, మాకు కూలంకషముగా వివరించండి. మేమందరము, మా నెమలిని/ నీలగ్రీవుని సేవించే సమయము ఆసన్నమైనది.. మళ్ళీ కలుద్దాము మహాదేవుని దయతో.అని వెనుదిరిగాయి. ఈ పక్షులు చాలా తెలివైనవి.నన్ను తెలుసుకుని భావమును వాటికిచెప్పమంటున్నాయి. ఇంతకీ ఈ శివయ్య ఏడి? ఎక్కడకు వెళ్ళాడు?ఎప్పుడు వస్తాడు? ఇంతసేపు నన్ను ఇక్కడ విడిచి వెళ్ళీనందుకు ఏమని సంజాయిషీ చెప్పుకుంటాడు? ............... అర్థమవుతోంది మెల్లగా ఆదిదేవుని కరుణ శివయ్య అంతరంగమునకు.అజ్ఞానతిమిరములను పారద్రోలుతున్నాయి ఆకాశదీపములు సావకాశముగా. అంటే తాను నెమలి అయితే స్వామి నీలిమేఘము.తాను చక్రవాకమైతే స్వామి సూర్యకిరణము.చకోరమైతే వెన్నెల.అపరాధి అయితే-క్షమ.అజ్ఞాని అయితే -కరుణ.అసహాయి అయితే-ఆలంబన.ఆర్తి అయితే -అమ్మ ఒడి. " ఓం నమః శివాయ" శివయ్యా-శివయ్యా-శివయ్యా అంటూ ఆర్తితో ,మనస్పూర్తిగా పిలుస్తున్నాడు తనదగ్గరకు సైతము రమ్మని ఆ ఆనందస్వరూపుని. " సా రసనా తే నయనే తావేవకశా స ఏవ కృతకృత్యం యా యే యౌ యో "భర్గం" వదతీక్షేతే సదార్చితః-స్మరతి" కదా? కదిలేవి కథలు-కదుపుతున్నది కరుణ. 'తన్మై మనః శివ సంకల్పమస్తు వాచే మమశివపంచాక్షరస్తు మనసే మమ శివభావాత్మ మస్తు". పాహిమాం పరమేశ్వరా. (ఏక బిల్వం శివార్పణం)     

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...