ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-10
********************************
సర్వము తానెయైన వానిని దర్శిస్తూ,
బ్రహ్మమొక్కటే-పరబ్రహ్మమొక్కటే" అనిసంకీర్తిస్తీ,బ్రహ్మానందములో మునిగిపోయాడు ఆ అన్నమయ్య పాత్రధారి.
బహిర్ముఖమగుటకు ఇష్టపడుటలేదు.
మూలకారణంబిది అని సన్నగా సన్నగా గొణుగుతున్నాడు.ఆది అనాది మధ్యయు కూద ఇదియే అంటున్నాడు.
మీరు అంటున్న ఇది-ఏది స్వామి అని ప్రశ్నిస్తూ అతనిని బహిర్ముఖుని చేసారు ఎదుటనున్న వారు.
బ్రహ్మము-దానిని కనుగొనినప్పుడు కలిగే బ్రహ్మానందము అని చెమర్చిన కన్నులతో బదులిచ్చాడు వారికి.
బహుళానందులను మించినదా ఆ బ్రహ్మానందము? సందేహము సందడి చేసినది అక్కడ.
అసలు బహుళానందములు అంటే అడగటం అతని వంతయింది.
అంటేఎన్నో విధములుగా-ఎన్నో పర్యాయములు ఎన్నో ప్రదేశములలో,ఎన్నో నామరూపగుణములతో విసుగు చెందక మనలను ఆనందపరిచేది అత్యుత్సాహముతో వచ్చింది సమాధానము.
సమాధానముగా చిరునవ్వు తొ అన్నమయ్యపాత్ర నుండి తన ఆహార్యమును తొలగించుకొని భాగవతారుగా అసలైన నామరూపములతో వారితో తన సంభాషణమును ప్రారంభించారు.
కొంచము సేపు క్రిందటి వరకు నేను అన్నమయ్య పాత్రను ధరించి,ఆ పాత్రకు సంబంధించిన నామరూపములతో,స్వభావ హావభావములతో,సంకీర్తనములతో ,సంతాపములతో మీకు కనిపించాను.ఎన్నో అవమానములు-సన్మానములు,సంయోగములు-వియోగములు,అదేశములు-ఆకాంక్షలు,జనన-మరనములు సాగిపోయాయి.
కాని ఇప్పుడు నేను అన్నమయ్యను కాను.నాకు వాటితో ఎటువంటి సంబంధము లేదు.
ఇది ఒప్పుకుంటారా అనగానే అందరు తలలాడించారు అంగీకారముగా.
అదేవిధముగా బహుళ ఆనందము అనేకానేకములు విభజింపడి స్థిరత్వము లేని ఒక భ్రాంతి.రాకపోకలు దాని నైజము.మన మనసులోనికి ఒక ఆశగా ప్రవేశించి,ఆమరూపములుగా ప్రకటితమయి మనలను చేరి మనలను సంతోషపరుస్తుంది.కోరిక యొక్క చివరి భావనయే ఆ అనందము.కాని అది,
ఎంతసేపు ఉంటుంది? కొన్ని నిమిషములా?గంటలా?రోజులా?నెలలా? సంవత్సరములా? దానికే తెలియదు మనకేమి చెబుతుంది.
దాని స్థావరము వేరొకటి వచ్చి దానిని తోసివేసే వరకే.ఏమిచేయలేక తప్పుకుంటుంది.పోతు పోతు అది తెచ్చిన ఆనందాన్ని సైతము తీసుకుని వెళ్ళిపోతుంది.అంటే అవి తాత్కాలికములే.స్వయం సమర్థము కావు.పరాధీనములు.
కొంచము సేపు నిశ్శబ్దము.
కాదనలేము కాని మరి మీరు చెబుతున్న బ్రహ్మానందము ,
ప్రత్యక్షము-అఖండము.ఆధారము.అజరామరము.మనము ముందర చెప్పుకున్న రాకపోకలను నియంత్రించగల నిర్గుణ-నిరాకార-నిరంజన-నిశ్చలము.
దానిని ఎలా తెలుసుకోగలము?దాని దగ్గరకు ఎలా చేరగలము?చేరి దర్శించగలము? ప్రశ్నల వర్షము.
మన చర్మ చక్షువునకు దర్శన శక్తిని అందిస్తున్న జ్ఞాన చక్షువుతో దర్శించగలఘట సాధన చేయాలి.
అప్పుడు మనకు జరుగుతున్న రాజపోకలతో పాటు -వాటిని జరుపుతున్న శక్తి కూడ దర్శనమిస్తుంది.ఇది మొదటి మెట్టు.
మొదటి మెట్టును ఎక్కిన తరువాత,మన్ము ఏమి చూస్తున్నాము అనే ప్రశ్నతో పాటు,దీనిని ఎవరు చూపిస్తున్నారు అనే ప్రశ్నను కనుక మనము వేసుకోగలితే చూస్తున్నదాని మీదనుండి దృష్టి చూపుతున్న దాని మీదకు మరలుతుంది.
ఇది రెండవ మెట్టు.
రెండవ మెట్టు నెక్కిన తరువాత దేని మీద ఏది ఆధారపడిఉన్నది మనము చూస్తున్న రెండింటిలో?
ఏది ఈ రెండింటిలో పరాధీనమై ఆవరణముగా వ్యాపిస్తు-విక్షేపముగా లోనికి ముడుచుకు పోతున్నది అని గమనిస్తే అసలు ఏదో-ఆభాస అంటే ఆ సమస్తములో దాగి,భాసిస్తున్నది ఏదో తెలుసుకోగలుగుతాము.ఇది మూడవ మెట్టు.
ఇక్కడ నుండి భగవత్ కృప మన బుధ్ధిని కనుక వికసింపచేస్తే -మనకు దేనిని పరిగ్రహించాలి-దేనిని పరిత్యజించాలి అనే అవగాహన ఏర్పడుతుంది.
ఆ అవగాహన మనకు ఏది ఆధారము?
ఏది ఆధేయము?
ఏది విధానము?
ఏది విలాసము?
గ్రహించగలిగేట్టు చేస్తు,
అంటు బ్ర" ఓం పూర్ణ మదః పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్చతే
పూర్ణస్య పూర్నమాదాయ
పూర్ణమేవా విశిష్యతే"
ఓం శాంతి శాంతి శాంతిః,"
హ్మానంద వృత్తములో మనలను పరిభ్రమింప చేస్తుంది.
సర్వం పరమేశ్వర పాదారవిందార్పణమస్తు.
పెద్దలు సహ్ర్దయతతో నా ఈ దుస్సాహసమును మన్నించి,లోపములను సవరించి,సర్వాంతర్యామి అనుగ్రహమునకు పాత్రులగుదురు గాక.
సర్వే జనా సుఖినో భవంతు.స్వస్తి.