CHIDAANAMDAA-SAKKIYA NAAYANAAR

చిదానందరూపా-5 కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా శివపూజకు అనుమతిలేని పాలనలో ఏమి తక్కువచేసెను స్వామి లాలనలో కనపడులింగము పూర్వము తానును రాయియే కదా ఆ రాయికి రాతిపూజ అపూర్వపు సేవయే కదా దూషణలన్నియు చేరు నిన్నుప్రదోష పూజలుగ చాలు చాలు భావము గ్రహియించలేని నిన్ను భజియించుట భావ్యము కాదు కాదు అనినను,లెక్కకుమించిన పున్నెము సక్కియ నాయనారుకు సదాశివుని కరుణను పొందగ విసిరిన రాళ్ళే కారణమాయెగ చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చు గాక. నిథనపతిని ప్రసన్నము చేసుకొనుటకుకావలిసినది భక్తి తత్పరత యను ధనము కాని బాహ్యాడంబరము కాదని నిరూపించినాడు సక్కియ నాయనారు అని పిలువబడే శాక్య నాయరారు. మగేశ్వరుని మానసపూజకు పాషాణమునకు -పారిజాతమునకు తారతమ్యములేదని తాదాత్మ్యమునొందిన సక్కియ నాయనారు తొండైనాడు ప్రాంతానికి సంబంధించిన భాగవతోత్తముడు.ఇతని ఈశ్వరసేవాతత్పరతను తెలియచేయు రెండు కథలు ప్రచార...