Friday, April 13, 2018

SAUNDARYA LAHARI-90


 సౌందర్య లహరి-మాంగల్య గౌరి

  పరమ పావనమైన నీ పాదరజకణము
  పతిత  పాలకమైన   పరమాత్మ స్వరూపము

  ఆకలి-దప్పిక  తీర్చును  అమ్మవారి  గోపురములు
  పురాణ ప్రవచిత  అమృత శిలా రూపములు

  సుదర్శన చక్ర పునీతములు- గయుని  అవయములు
  యాగ వాటికలు తారుమారైనవి అవి గయా వాటికలు

  శ్రాద్ధ కర్మలకు ప్రసిద్ధము ఇచట సంతృప్తులు పెద్దలు
  స్థితికార్య నిర్వాహకురాలికి పూజలు వైభవోపేతములు


  మాయా సతి స్తనములు పడిన  పాలనా పీఠములో
  దయయే ధర్మమైనగౌరి  తనకరమందించుచుండగా

  నీ మ్రోలనే  నున్న నా కేలు విడనాడకమ్మా,నా
  మానస విహారి! ఓ సౌందర్య లహరి.

 " గదాధర సహోదరి గయా గౌరీ నమోస్తుతే
   పితౄణాంచ సకర్తౄణాం దేవి సద్గుణదాయిని
   త్రిశక్తిరూపిణీ మాతా సచ్చిదానందరూపిణి
   మహ్యం భవతు సుప్రీతా  గయా  మాంగళ్య గౌరికా"


      " గయ" అను శబ్దమునకు అనేక మూలములు కలది అను అర్థము కలదు.విష్ణువుచే ఖండించబడిన గయుని శరీరపు ముక్కలు అనేకములు ఈ పవిత్ర క్షేత్రమున అనేక అచలములై(కొండలై) అచంచల భక్తితో అమ్మను ఆరాధించుచున్నవి.
  గయ అను పదమునకు పునీతముగావింపబడిన ప్రదేశము అని మరొక అర్థము కలదు.సుదర్శన చక్ర స్పర్శచే పునీతము గావింపబడిన అసురుని శరీరభాగములకు గయ అను నామము సార్థకమగును.

  ఇక కుడి ఎడమైతే పొరపాటులేదోయ్ అన్నారు పెద్దలు.వర్ణవ్యత్యయమును పరిశీలిస్తే గయ అను పదము  యాగ గా అన్వయించుకుంటే బ్రహ్మర్షుల యజ్ఞవాటిక (యజ్ఞము జరిగిన దేహము) గాను ప్రకాశిస్తున్నదిమంగళగౌరీదేవి అనుగ్రహించిన అనేకానేక కథలు ప్రచారములో కలవు.శ్రావణ మాసములో,ఆశ్వయుజ ,కార్తీక మాసములలోనవరాత్రులందును అమ్మవారి పూజలు వైభవోపేతముగా జరుగును.ప్రతి మంగళవారము.శుక్రవారము ప్రత్యేక పూజలు జరుగును.వక్షద్వయ ప్రతీకలుగా రెండు గోపురములు ఆకలిదప్పికలను తీర్చుచుండును. శాక్తేయులకు-బౌద్ధులకు గయాక్షత్రము కొంగు బంగారము.శ్రాద్ధకర్మ ఫలితమును పితృదేవతలకు అందించు అద్భుతము.. శ్రీకృష్ణుడు ధర్మరాజుతో త్రిపురాసుర సంహారసమయమున శివుడు ఈ తల్లిని పూజించెనని చెప్పెను.
  అంగారకుడు మంగళగౌరిని పూజించి కుజగ్రహ అధిపతియైనాడని మంగళుడు అను పేరును పొందెనని చెబుతారు.
   ఇంకా ఎందరో కథకాటుకను ధరించి కనులకున్న అహంకారపొరలను తొలగించుకొనుచున్న సమయమున చెంతనే నున్న నా చేతిని విడిచిపెట్టకమ్మా.అనేక నమస్కారములు.





TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...