OM NAMA SIVAAYA-95

ఓం నమ: శివాయ-32 ******************** కాళ్ళుజారతాయని చూడకుండ నీళ్ళూ పోస్తుంటావు తుడిచేందుకు బట్ట వేస్తే దానిని తడిపేస్తావు ఏనుగులు కొలిచాయాని బాగానే చెబుతావు ప్రత్యక్షపూజ కోరితే వృక్షము కమ్మంటావు అప్పులింగేశ్వరుడనంటు గొప్పలెన్నో చెబుతావు పప్పన్నానికి మాత్రము ఒప్పుకోను అంటావు గురువును నేను నీకు అంటు గౌరితో అంటావు అమ్మ శక్తిని కుదించి అఖిలాండేశ్వరి అంటావు నీళ్లమడుగుపైన కన్నులపండుగగా వెలిసావు తుళ్ళుచున్న ఆశలపై.నీళ్ళుజల్లుతుంటావు నీళ్ళదొరని నేనంటు భక్తుల పెళ్ళికి అనుమతించని ముక్కంటివి నీవటర ఓ తిక్కశంకరా. నీళ్ళమడుగులో నుండి( కావేరి జలము) ప్రకటింపబడిన శివుడు నీళ్ళతో ఆడుతు వాఈఇని కింద పారపోస్తుంటాడు.భక్తుల కాలుజారి పడతారని ఆలోచించడు.ఏనుగులు ఈ క్షేత్రములో తనను పూజించాయని గొప్పలుచెప్పుకుంటాడు.శంభుడు అను యోగి ప్రత్యక్షపూజానుగ్రహమును కోరగా నేరేడు చెట్టుగా మారి తనను పూజించమన్నాడు.గౌరీదేవికి తాను గురువునని కనుక ఆమెను పెండ్లిచేసుకోనని చెప్పాడు.తాను చేసుకోపోతే మానె,ఎవరైన ఉత్సాహంగా పెళ్ళిముచ...