TIRUVEMBAAVAAY-08
తిరువెంబావాయ్-08 ************** "కృపా సముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం సదాశివం రుద్రం అనంతరూపం చిదంబరేశం హృది భావయామి." సందర్భము ********* చిత్తములోదాగి చింతలను తొలగిస్తున్న చిదంబరేశుని అవ్యాజకరుణను మరింత స్పష్టముచేస్తూ నిదురిస్తున్న తమ చెలిని వ్రతమునకు సిద్ధముచేయుచుచున్నారు మేల్కొలుచు. పాశురము ******** తిరువెంబావాయ్-008 ****************** కోళి శిలంబ చిలంబుం కురుగెంగు ఎళిలియంబ ఇయంబువేన్ శణ్గెంగుం కేళిల్ పరంజోది కేళిల్ పరంకరుణై కేళిల్ విళుప్పోరుల్కళళ్ పాడినో కేట్టిలైయో వాళియిదెన్న ఉరక్కుమో వాయ్ తిరవాయ్ ఆళియున్ అంబుదమై ఆమారుమివ్వారో ఊళి ముదల్వనాయ్ నిన్ర ఒరువనై ఏలై పంగాళనయే పాడేరేలొ రెంబావాయ్. స్వామి "ఊళి ముదల్వాన్" ఆది ప్రళయానంతరమున మిగిలినది పరమాత్మ మాత్రమే.అట్టి పరమాత్మ తన కరుణను అనుదినము నాలుగు సంకేతములతో ప్రసరిస్తున్నాడు.మనలకు అది అవ్యాజకరుణ ప్రారంభము.అవియే 1.శిలంబ కోళి-కోడి కొక్కొరొకో (ప్రణవనాదము) 2.శిలంబ కురంగే-ప్రాతః కాల ఉషస్సు 3.శిలంబ ఎళిలియంబ-సప్తస్వర నాదముగా 4....